పుట:China japan.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చీనా


ఇవి స్వేచ్ఛగా వాణిజ్యము చేసుకొనవచ్చును.(2)వీరి దేశపు వస్తువులమీద చీనాప్రభుత్వము నూటికి 5 కంటె యెక్కువగా దిగుమతి సుంకములను విధించరాదు.(3)ఇట్లు విధించకుండా చూచుటకై ఈ దేశముల "నేషనల్సు" అనగా రాయబారులను లేక ప్రతినిధులను వీరు నియమించి చీనాలో కాపలా యుంచుటకు చీనా అంగీకరించవలెను.(4)ఈ విదేశస్థులు చీనాలో యెట్టినేరములు చేసినను వీరిని చీనాచట్టముల ప్రకారము శిక్షిం చరాదు.వీరిని వేరే కోర్టులలో విచారణ చేయవలెను.వీనికి"ఎక్స్ట్రాటెర్రిటోరియలు" కోర్టులు లేక చీనాదొరతన ప్రవేశమునకతీతమైన కోర్టులు అని పేరు.ఈ కోర్టుల ఉద్యోగస్థులను,సూత్రములను నిర్ణయించుట లేక యేర్పా టు చేయుట ఈ కూటము పనికాని చీనాకందులో నెట్టి ప్రమేయమును ఉండరాదు.(5)మంచిమంచి వర్తక కేంద్రములు,రేవు పట్టణములు మొదలగు వానిలో స్థిరావాసములు చేసుకొనుటకు వీరికి హక్కు లీయబడి నవి.(6)చీనామధ్య ప్రదేశములందు సేనలు,రేవు పట్టణములందు నావలు నిలువయుంచుకొని వారి దేశపు రాయబారులు(నేషనల్సు)కు అపాయము రాకుండా వారు చూసుకొనవలెను.(7)ఇంతే కాకుండగా చీనారెయిళ్ళు,ఫోస్టాఫీసులు,ఉప్పు మొదలైన వానివల్లవచ్చే ఆదాయములను తనిఖీచేయుటకు హక్కులను పిండుకొనినారు.

3