పుట:China japan.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

చీనా-జపాను

కాకుండా హాంకాంగు అనేద్వీపము వీరికి దానముచేయబడినది.బ్రిటిషు వస్తువులమీద చీనాప్రభుత్వము దిగు మతి సుంకములను విధించకుండా చూచుటకై బ్రిటిషు ఉద్యోగస్థులను కంపెనీవారు యేర్పాటు చేసుకొనుటకు చీనా అంగీకరించినది.పైగా,చీనాలో కిరస్తానీ మత ప్రచారము చేయుటకు కూడ బ్రిటిషువారికి అనుజ్ఞ యీయ బడినది.

చీనా సింహద్వారము మొట్టమొదట పాశ్చాత్యవర్తకులకు ఈ రీతిని తెరువఁబడినది.ఒక్కబ్రిటను ప్రవేశించిన, తక్కిన దేశములు ఊరకుండునా?జారుప్రభుత్వము క్రిందనుండిన రష్యా కూల్జారాష్ట్రమును తీసుకొని మంగోలియా ఆక్రమణమునకుపక్రమించెను.ఫ్రెంచివారు అన్నాము అను విశాలప్రదేశమును తీసుకొనిరి.జర్మనీ,ఇటలీఁ బెలిజియము దేశములు కూడా ప్రవేశించి వారివారికి కావలసిన వర్తకసౌకర్యములు మొదలగువానిని నిర్బంధించి తీసుకొనియెను.చీనా మీద జపానుయుద్ధమును ప్రకటించి ఫార్మోజా, కొరియా, దక్షిణమంచూరియా యందున్న లియావోటంగు రాష్ట్రములను తీసుకొనెను.

ఈ దేశములు ఈరాష్ట్రములను చీనానుండి త్రుళ్లగొట్టి తీసుకొనిటయే కాక తమకు కావలసిన షరతులను పత్రముపై వ్రాసుకొని చీనాప్రభుత్వముచే బలవంతముగా సంతకము చేయించి“ఒడంబడిక”లు చేసుకున్నవి.ఈఒడంబడికల షరతులు విచిత్రములు.(1)చీనాలో యెక్కడ పట్టిన నక్కడ