పుట:China japan.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీనా - జపాను

చీనా

పాశ్చాత్యజాతులతో ప్రధమసంబంధములు

చీనా ప్రాచీనచరిత్రతో మనకిప్పుడు ప్రయోజనము లేదు.18 వ శతాబ్దముతో చీనాయొక్క నవీనచరిత్ర ప్రారంభిం చబడినది.బ్రిటిషు తూర్పుఇండియా వర్తకసంఘము హిందూదేశములో పండించిన నల్లమందును చీనా దేశమున కెగుమతిచేయుటకై సర్వహక్కులను అనుభవించగోరినది.కాంటను నగరమునందలి చీనావర్తక సంఘ ములు ఆసదుపాయములను కూడా వారికి కలుగజేతుమని యొప్పుకొనిరి.కాని 1839 లో చీనా ప్రభుత్వము చీనాలో నల్లమందును మానిపించబూని ఒక నిషేధాజ్ఞను ప్రకటించినది.ఇది ఈస్టుఇండియా కంపెనీ వారికోరికకు విరుద్ధము కనుక ఈ కంపెనీ నల్లమందు ప్రచారమునకై చీనాతో మూడు“పవిత్ర” యుద్ధములనొనరించినది.

ఈయుద్ధముల ఫలితముగా ఇండియాలోపండిన నల్లమందును, లంకాషైరులో నేయబడిన మిల్లుబట్టలను నిరాటంకముగా చీనాదేశములో దింపి విక్రయించగల సర్వాధికారములు బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి చిక్కినది.ఇంతే