పుట:China japan.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


VI

మనల నొంచుచున్న ప్రభుత్వ వ్యయమునకగు భారమునెల్ల వహించవలసి వచ్చుచున్నది. చీనాకు ఆర్ధిక దాస్యమే కాని రాజకీయదాస్యము లేనందువలన అక్కడ స్వాతంత్ర్యోద్యమములేచి,సేనలను తయారుచేసి, విదేశ స్వదేశ శత్రువుల మెదరించుటకు తగిన అవకాశములు కనిపించుచున్నవి. కాని మన రాజకీయ దాస్యము మనలను నిర్వీరులుగను,నిరాధుయులు నిరుద్యోగులుగ జేసినది గనుక సాత్విక నిరోధము,సత్యపధము, సర్వసహనములే, మనకు శరణ్యములగుచున్నవి.చీనా తనను పీడించుచున్న విదేశపు శక్తుల నొకదాని మిాదికి వేరొక దానిని లేపి ఆడించుదామని ప్రయత్నించుచున్నది.కాని పదిమంది బలవంతుల మధ్య నిలచిన ఒక్కబక్కదాని వలె దాని ఆటలు సాగకున్నవి.మనకు బ్రిటిషువారి సుహృద్భావమో ఈశ్వరుని విలాసమో తప్ప అన్య విధముల స్వరాజ్యము లభించు మార్గము కానరాకున్నది.

అయినను చీనాకును మనకును కొన్ని సామాన్యపోలికలు ఉన్నవి.రెండును విశాల వ్యవసాయకదేశములు. రెండింటి యందును యంత్రపరిశ్రమ లిప్పుడిప్పుడే తలయెత్తుచున్నవి.రెండును పాశ్చాత్య సంపత్పిపాస కెఱలై శల్యములుగా చేయబడినవి.రెండును తెప్పరిల్లుటకై తన్నుకొనుచున్నవి.రెండింటికిని పాశ్చాత్యవాసనలు వచ్చినవి.ప్రతపద్ధతులను కూలదన్ని క్రొత్తవిధనములకు పూనకున్నచో ఈదారిద్య్రము