Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుండా ఆపటానికి ఫ్రీచర్స్ ప్రయత్నించారు. "కంగీ అనేది ఓ రకమైన గంజి లాంటిది తాగటానికి యిచ్చారు. కాని వాళ్ళ వినేవారు కాదు. “ఫరవాలేదు. నన్ను తిననీయండి. ఆకలితో చస్తున్నాను" అనేవారు. బోధకుల సలహాలు తిండి మీద తపనలో కోపం మాత్రం తెప్పించేవి. కొందరు ఎంత బక్కచిక్కిపోయారంటే, ఎంత తిన్నా ఆకలి తీరేదీ కాదు. తరచుగా తినేవారు. వాళ్ల ఆకలిదేహాలు తట్టుకోలేనంత తినేవారు. ఎక్కడో కదలకుండా పడి ఉంటే వెళ్ళి చూసేసరికి చనిపోయి ఉండేవారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువ. రోజుకి ఎంతమంది చనిపోయేవారో ఎవరికీ తెలీదు. చనిపోయిన వాళ్ళని కప్పెట్టడం బ్రతికున్నవాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. వాళ్ళ చెయ్యగలిగిందల్లా మోసుకుని వెళ్ళి పక్కనున్న బొమ్మజొమ్మడు దొంకలలో పారేయటం. మిగిలిన పని రాబందులు, కుక్కలూ, నక్కలూ చేసేవి. బంధువులలో చనిపోయిన వాళ్ళు ఉండేవారు. ఆ గట్టినేలలో గొయ్యి తీసి కప్పెట్టడానికి ఎవరూ ఉండేవారు కాదు. బాధ తాలూకు పదునుని అసహాయత్వపు నిరాశతీసివేసినా ప్రేమ మాత్రం రెపరెపలాడుతూనే ఉండేది. ఇసకలో కొన్ని అడుగులు గొయ్యి తవ్వి మృతదేహాన్ని పూర్తిగా కప్పెట్టేవారు. రాత్రివేళ నక్కల ఊళలు భూతపేతాల వికటాట్టహాసాలు దూరానికి వినిపించేవి. తెల్లారాక ఆ వైపుకి వెళ్ళటానికి శ్రద్ధ పెట్టేవారు కాదు. ఆ శిబిరంలో ప్రతి ఒక్కరి గుండె విషాదంగా ఉండేది. కొందరు పూర్తిగా భయంలో ఉండేవారు. శిబిరంలో కలరా ప్రవేశించింది. ప్రతి ముఖంలోనూ మృత్యువు తొంగిచూసేది. కాంప్కి వస్తున్న దోవలోనే తన భార్య ఎలా కలరాతో మరణించినదీ బోధకులలో ఒకరు నాకు చెప్పారు. భర్తగాని, అన్నదమ్ములు గాని బాగోగులు చూడడానికి లేని ఆడవాళ్లు ఉండేవారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండేవారు. అనాధల పట్ల క్రైస్తవం ఎంత దయ చూపిసుందో వారు ఇప్పడు తెలుసుకుంటున్నారు. రోడ్ల మీద పడి చనిపోయే వారి ఎముకలు రోడ్లకి అటూ యిటూ పడుండేవి. వేడి చాలా తీవ్రంగా ఉండేది. వాళ్ళ తవ్వేచోట నీడ ఉండేది కాదు. "మా మనసులు కృంగిపోయేవి. మా దొర జుత్తు ఆ ఏడే తెల్లబడిపోయింది. " అని బోధకులు చెప్పారు. ప్రతి ప్రీచర్ కిండా వంద మంది పనిచేసేవారు. వాళ్ళ చేసిన పనికి అతనే బాధ్యడు. ప్రతిరోజూ సాయంత్రం వాళ్ళ అతని నుంచి కూలి పుచ్చుకునేవారు. చాలామంది వచ్చి పోతున్నా తనకింద పనిచేస్తున్న బృందంతో అతనికి సామీప్యత ఉండేది. పగటిపూట కొంతమంది కొద్ది విశ్రాంతి కోసం అపుడపుడు కూర్చునేవారు. వారితో ఫ్రీచర్ కలిసి మాట్లాడే گی eNJ sی۔ aj వాడు. వాళ్ళ కష్టాలు చెప్పకునేవారు. కళ్ళలో అనంత విషాదంతో తడిపొడి మాటలతో చెల్లాచెదురైన కుటుంబాల గురించి చనిపోయిన వారి గురించి చెప్పకునేవాడు. "మేమందరం చనిపోతున్నాం" అన్నది వారి చివరి మూటగా ఉండేది. ఆ సమయంలోనే ఓదార్పు కావాలి. “ ఆ හීහ්ඡාභ చెప్పిన ఓదార్పు మాటలు మరచిపోలేం. రక్తదాహంతో నిరంతరమూ భూమి మీదకే చూచే భూతాల గురించి ఎవ్వరూ ఆలోచించలేనంతగా ఉన్నాయి ও గడురోజులు. తిండి కోసం భూతాలన్నీ కలిసికట్టుగా భూమ్మీద బ్రతికున్న అన్నింటినీ చంపెయ్యటానికి గుమ్మిగూడితే ఎవరు ఆపగలరు? వాటన్నింటినీ ఎవరు శాంతింపజేయ గలరు? మాదిగలలో ఉన్న సంప్రదాయాలు, దేవతలూ వీటిల్లో ఏ ఒక్కటైనా అన్నీ నడిపే హస్తం ఒకటుందని, అదే దయతో మార్గం చూపిస్తుందని వారిని ఓదార్చగలవా? నమ్మించ గలవా? ఆశ కల్పించగలవా? విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళతో కలిసి కూర్చున్నపుడు బోధకులు చెప్పారు. "మా దేముడు కష్టాలను కల్పించడు. ఎందుకంటే ఆయన మానవుల కోసం దాహారుడై ఉన్నాడు. ఇవి మన మీదకు రావటాన్ని ఆయన నిరోధించలేదు. ఎందుకంటే మానవులు తప్పలు చేస్తున్నారు. వారికి ముక్తినివ్వని దేవుళ్ళని పూజిస్తున్నారు. మన కోసం మరణించిన ఏసుక్రీస్తు మన కష్టాలన్నీ తన మీద వేసుకున్నాడు. ఆ తర్వాత బోధకులు తమ వద్ద ఎప్పడూ ఉంచుకొనే కొత్త నిబంధన తీసుకుంటుంటారు. అందులో వాక్యాలు చదువుతారు. అవి జనాల బాధాకృత హృదయాలకు కష్టాలకు చల్లని లేపనం పూసినట్లంటాయి. "నా వద్దకు రమ్మనీ బరువులను బాధలను కొనిరమ్ము నేను నీకు విశ్రాంతినిచ్చెదను" ఈ వాక్యాలు మరీ ముఖ్యంగా వారికి సేదదీర్చేవి. ఆ తర్వాత వారు పనికి తిరిగి వెళ్ళేవారు. కొంతసేపయాక అడిగేవారు. "నీ పవిత్ర గ్రంధంలోంచి ఆ పద్యం తిరిగి చదువు" వాళ్ల మతాలలో సంప్రదాయాలలో రామానుజ మతం కానీండి నజరయ్య మతం కానీండి అలాంటి వాఖ్యలు వారు ఎన్నడూ వినలేదు. వాళ్ళ పాత సంప్రదాయాల జ్ఞాపకాలను తవ్విపోస్తుంటే వాళ్ళ ఆలోచనలు స్తంభించిపోయేవి. వారి దుర్భర దుఃఖంలో స్వస్థతా స్పర్శ కోసం జీసస్ క్రీస్తు వైపు మరలారు. మూడు మైళ్ళ తవ్వకం ఒప్పందం ముగిసింది. ఎనిమిది నెలల పని ముగిసింది. వానలు వచ్చాయి. అనేక మంత్రాలతో విత్తులు నాటారు. కానీ అవి నేలమీదే కుళ్లిపోయాయి. తూర్పువైపు వరండాలో దొర నిలబడి వాళ్ళకుటుంబాలకోసం చెప్పలు కుడుతూ. కుడుతూ.N 785