Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1.ఒక గొప్ప సంక్షోభం 1876-78 ల మధ్య కరువులో జీవించిన అనేక మంది నాకు తెలుసు. ఆ రోజులోని పిల్లలో చాలా మందికి సరైన ఎదుగుదల లేకపోయింది. కొందరి ముఖాల మీదకి అకాల వృద్ధాప్యం వచ్చేసింది. అయితే ముసలివాళ్ళ ఒక కరువుని గుర్తు చేసుకొనేవారు. బహుశ అందులో అసాధారణమైన భయానక దృశ్యాలు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కరువులో మనుషులు మనుషులను తినేవారు అని అందరూ అనేవారు. నాకది నమ్మబుద్ధయేది కాదు. 1876-78ల మధ్య వేలాది మంది మరణించినా, ఆకలి కరాళ నృత్యం మనుషులని భీతావహం చేసినా ఎలాంటి నరమాంస భక్షణా చిహ్నాలనీ తను చూడలేదని నా భర్త చెప్పేవారు. దాంతో 1836 కరువు మనుషుల్ని తిన్నకరువుగా ఎవరైనా నాతో అంటే అది చూసిన వాళ్ళెవరైనా నీకు తెలుసా అని అడిగేదాన్ని ఒకామె నాతో చెప్పింది. ఆమె తల్లి పొరుగింటి మనిషి, ఒక ఆడమనిషి తన బిడ్డను కుండలో పెట్టి ఉడకబెట్టడం చూశానని చెప్పిందట. ఇది నాతో చెబుతున్నప్పడు ఆమె గొంతు చిన్నదయిపోయింది. ఇది చెప్పటానికి కూడా వీల్లేనంత భయానకమైనది. మాదిగలలో అధికశాతం ఏడాది పొడవునా ఆకలితో మాడారు. పంటలు పోయిన మొదటిసారే వాళ్ళ గడపలో ఆకలి ప్రవేశించింది. విత్తనం మొక్కవటానికి తగిన తడిని యివ్వకుండానే మరో వానాకాలం గడిచిపోయేసరికి వారి కష్టం ఇనుమడించింది. మాదిగలు శూద్రుల సహాయం కోసం వెళ్ళారు గాని పంచుకోవటానికి వాళ్ళ దగ్గర ఎలాంటి పంటా లేకపోయింది. వాళ్ళకే తిండానికి లేదు. బంగారమూ వెండీ తిండి కోసం అమ్ముకోడం ఆరంభించారు. కాని ఆకలి దప్పులతో పశువులు చనిపోతున్నాయి. ఆకలితో బక్కచిక్కిన ఆ పశువుల దుమ్ములని అంటుకొని ఉన్న మాంసంతో మాదిగలకి అప్పడప్పడు తిండి దొరికేది. కలబంద మొక్కల ఎర్రటి పళ్ళ తిండి అయ్యాయి. చాలామంది ఆకులూ అలములూ తినసాగారు. "బోర్డు, సన్నటి సీసా, లోపలి మట్టి" దగ్గరికి నిత్యం ఒంగోలు మిషనరీ రాక అతననుభవిస్తున్న ఆందోళనకి గుర్తు, దగ్గరవుతున్న కల్లోలాన్ని ఎదుర్కొనేందుకు అతను అనేక పద్ధతులను యోచించాడు. ఒంగోలుకి అతను వచ్చి పదేళ్ళయింది. అతను తన వాళ్ళని 3269 మంది క్రైస్తవులుగా లెక్కించాడు. దాదాపు అందరూ మాదిగలే పంటలు సమృద్దిగా ఉన్నపుడే వాళ్ళ ఎంత పేదవాళ్ళ దిక్కులేనివాళ్ళి అతనికి క్షుణ్ణంగా తెలును. అంతగా అతను వాళ్ళలో ఒకటయిపోయాడు. నానాటికి ఆ మిషన్ కాంపౌండ్లో పెరుగుతున్న శుష్కదేహాలు అతను వరండాలో కనిపించినపుడల్లా మేం చచ్చిపోతున్నాం. చచ్చిపోతున్నాం. అని అరవటం అతనిని ఏదో ఒకటి చేయమని వెన్నాడుతోంది. బోధకులు అరిగిపోయిన వాగ్యానాలతో వచ్చి వెళుతున్నారు. మిషన్ బంగ్లాలో జరుగున్నది వాళ్ళకి కొంత తెలుసు. అమెరికాకి సహాయార్థం నివేదికలు పంపారు. మద్రాసులోని ప్రభుత్వంతో లేఖలు నడుపుతున్నారు. చిట్టచివరగా వాళ్ళని ఓ కబురుతో పంపించారు. తవ్వకానికి మిషనరీ ఒక కాంట్రాక్ట్ తీసుకుంది. రాజుపాలెంకి వస్తే కూలి సంపాదించుకుని తగినంత తిండి తెచ్చుకోవచ్చు. ఆంగ్ల ప్రభుత్వం అనేక సహాయ చర్యలు చేపట్టింది. మద్రాసు నుంచి ఉత్తరంగా బెజవాడ వరకూ తూర్పు తీరంలో బకింగ్హోమ్ కాలవ నిర్మాణం ద్వారా పెద్ద ఎత్తున సహాయ చర్యలు ఆరంభించింది. ఈ కాలవలో మూడు మైళ్ళ భాగం తవ్వటానికి ఒంగోలు మిషనరీ కాంట్రాక్ట్ తీసుకుంది. ఒంగోలుకి పదిమైళ్ళ తూర్పున సముద్రం ఒడ్డుకి దగ్గరగా రాజుపాలెంలో సహాయ శిబిరం ఏర్పాటయింది. ఇరవై మంది కూలీలను తోడు తీసుకుని ప్రీచర్స్లో ఒకరిని కాంప్ నిర్మించటానికి ముందుగా పంపారు. గుడిసెల వరస ఎక్కడ వెయ్యాలో వీధులని ఎక్కడ చెయ్యాలో మిషనరీ వచ్చి చూపించాడు. వెదుళ్ళ, తాటిచెట్ల సముద్రపు ఒడ్డున విస్తారంగా ఉన్నాయి. గ్రామస్తులతో తాటాకులు, వెదురు వాసం కోసం మాట్లాడటానికి పంపారు. అంత లోతు లేకుండా నీటిమట్టం పైకి ఉండటం వల్ల నూతులు తవ్వారు. చుట్టుపక్కల కుమ్మర్లకి కుండల కోసం బయానా ఇచ్చారు. ఓ రాగి డబ్బుకి కుండలు కొనుకుని, ఎక్కడ పడితే అక్కడ దొరికే పుల్లలు ఎండుటాకులతో నిప్ప చేసుకుని ఆకలితో మాడుతున్న జనం వంట చేసుకోటానికి ఏర్పాట్ల జరిగాయి. అనుకున్న సమయానికి అనేక మంది క్షుధారులతో దూరదూరాల నుంచి ఫ్రీచర్స్ ఒంగోలుకి వచ్చారు. బస్తాలతో కోమట్లని రాజుపాలెంకి ముందే పంపాడు మిషనరీ. అక్కడ ఉన్న ఫీచర్ కి ఒంగోలుకి వచ్చారు. బియ్యం బసాలతో కోమట్లని రాజుపాలెంకి ముందే పంపాడు మిషనరీ, అక్కడ ఉన్న ఫ్రీచర్కి మధ్యాహానికి చాలామంది జనం వస్తారు. తయారుగా ఉండమని కబురంపాడు. రెండు గంటలలో జనం రావటం మొదలెట్టారు. అక్కడున్న బోధకునికి అతని సహాయకులకీ వస్తున్న జన సమూహం ఒక పెద్ద చెపలుకుడుతూ, కుడుతూ.N 783