పోలేరమ్మ విగ్రహాన్ని చూశాడు. ఆ అవమానకరమైన దృశ్యాన్ని వివరించితే విన్నాడు. చాలా బాధపడ్డాడు. ఒక ఏడాదిపాటు క్రైస్తవులని సహించమని కోరాడు. వాళ్ళలోని విశ్వాసాన్ని ఆ ప్రాంతమంతా చూడనీయమన్నాడు. ఈ మధ్యలో దేముడు దుర్గయ్య నాయుడిని మారుస్తాడు. లేకపోతే దేముడు ఏదోలా జరిగినదానిని సరిదిదుతాడు. దాంతో వాళ్ళకి స్వేచ్చా స్వాతంత్ర్యాలు లభిస్తాయి. అని చెప్పాడు. ఆ పగలంతా ఉన్నాడు. సాయంత్రం గుర్రం మీద ఎక్కి కొడలూరు గ్రామంలో తరవాతి మకాంకి బయల్దేరాడు. డేరా వెళ్ళిపోయాడు. అతను ఉన్న తోపు ఖాళీ అయిపోయింది. మాదిగలకి ధైర్యం లేకపోలేదు. వాళ్ళ నరాలలో ఎన్నో తరాల క్రితం వీరుల నెత్తురు ప్రవహించిందని రుజువు చేస్తూ ధైర్యంగా ప్రవర్తించారు. దుర్గయ్య నాయుడి ముందు పారిపోయిన వాళ్ళఓ రోజు పదిహేను మైళ్ళలోని కొడలూరికి నడిచివెళ్ళి అక్కడ బాప్టిజం తీనుకుందామని నిర్ణయించుకున్నారు. వాళ్ళ పద్దెనిమిది మంది. వాళ్ళని చూసినపుడు మిషనరీ సంకోచించాడు. ఏం జరిగినా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ధృఢంగా చెప్పటంతో కాదనలేకపోయాడు. దుర్గయ్య నాయుడికి ఒక్క విషయం స్పష్టంగా తెలిసింది. చెరువు నీళ్ళతో క్రైస్తవ మతాన్ని కడిగెయ్యలేం. ఇష్టం లేని వాళ్ళ చేత గేదెల మేకల రక్తంతో బలవంతంగా పోలేరమ్మ పూజలు చేయించలేం. అతను మళ్లీ ఆ ప్రయోగం చెయ్యలేదు. శూద్రులకి, తమకి మధ్యనున్న పాత సంబంధాలు క్రైస్తవులు వదులుకున్నారు గనుక ఈ కొత్త పాలనలో శూద్రుడికి వాళ్ళ వల్ల ఎలాంటి అవసరమూ లేదని నిరూపించటానికి నిశ్చయించుకున్నాడు. గ్రామంలో శూద్రుల భాగం నుంచి మాదిగలకు ఎలాంటి సంబంధమూ లేకుండా చేశాడు. మామూలు రోడ్ల మీద నడిస్తే వెట్టి వారు అడ్డుకున్నారు. గ్రామ సంతలోకి రాబోతే పొమ్మన్నారు. కాదన్న వాళ్ళని చితకగొట్టారు. ఎవరూ పనిలోకి తీసుకోలేదు. తినటానికి ఏమీ లేకపోయింది. కొందరు శూద్రులు దుర్గయ్య నాయుడికి నచ్చజెప్పారు. కాని అతను శపథం చేశాడు. బండెడు రూపాయలు ఖర్చయినా సరే కూచిపూడిలో ఒక్క క్రైస్తవుడు కూడా లేకుండాపోయే వరకూ నేను నిద్రపోను, రెండు నెలల తర్వాత మిషనరీ ఒంగోలు చేరాడు. తొలి రోజుల పద్ధతి ప్రకారం అతను ఆసారి సుదీర్ఘమైన పర్యటన చేశాడు. ఈ రోజులలో పది మిషన్ స్థలాల పర్యవేక్షణలో ఉండే స్థలమంతా ఆయన ఆ రోజులలో తన స్థలంగా భావించేవాడు. క్రైస్తవులు ఉన్న 98 గ్రామాలను చూశాడు. 27 స్థలాలలో మకాం వేశాడు. 1067 భక్తులకు బాప్టిజం యిచ్చాడు. మిషన్ కాంపౌండ్లోకి వచ్చి పోయే వందలాదిమంది కూచిపూడి మత ద్వేషంలోని ఇటీవల పరిణామాల గురించి మాట్లాడుకోవటం మిషనరీ గ్రహించాడు. నెలవారీ సమావేశంలో అందరూ ఆ మతద్వేషం వివరాలు వినాలనుకున్నారు. దాదాపు వెయ్యిమంది ప్రేక్షులు ఆదివారం ఉదయం ప్రార్ధనా సమావేశంలో గూమిగూడారు. కూచిపూడి క్రైస్తవులు ఓ పది మందీ, బోధకుడూ ఆ కథ చెప్పటానికి అందరి ముందూ నించున్నాడు. కన్నీళ్ళతో మనసులో ఉన్న బాధంతా చెప్పారు. ఇంక భరించలేమన్నట్టు కనిపించారు. చాలామంది ఆకులు అలములూ తింటున్నారు. ఎదురుగా ఉన్న ఆకలికి వణికిపోతున్నారు. అనేకమంది పాత బోధకులకి దేముడు చెయ్యి విపరీతమైన శక్తితో కదులుతుందని, విశ్వాసంతో జరిపే ప్రార్ధన వృధా పోదని అనుభవరీత్యా తెలుసు. ఏదో ఊహాతీతమైనది జరగాలన్నట్టు భక్తితో ప్రార్థనలు చేశారు. కూచిపూడి మునసబు ఒక ఊరి క్రైస్తవులను ఆకలి మంటలలోకి నెట్టగలిగితే అన్నిచోట్లా శూద్రులు తమ మనసు రాయి చేసుకుని క్రైస్తవులను అలాంటి ఆపదతోకి Rంటూరా? అది అందరి సమస్యగా అర్థం చేసుకున్నారు. చందాలు వసూలు చేశారు. బాధితులకి కుటుంబానికి ఒక రూపాయి చొప్పన యిరవై ఏడు రూపాయలు పంపారు. వాళ్ళకోసం బజారు మూసేస్తే ఆ డబ్బేం చేసుకుంటారు? ఆ ప్రాంతంలో బోధకులు ఎవరినో ఒకరిని నియమించి క్రైస్తవులున్న గ్రామాలకి వెళ్ళి ధాన్యం పోగు చేయించమని అడిగారు. అందులో ఒకతన్ని నియమించారు. అతను పోగుచేసిన రెండు బళ్ళ ధాన్యంతో కూచిపూడి వచ్చాడు. ఒక కొత్త ఆదర్శం తాలూకు ప్రయోగం వేలాది నేత్రాల ముందు ప్రదర్శించబడింది. అణచివేయబడిన మాదిగలు సహోదర ప్రేమతో ఒకరికి ఒకరు తోడయ్యారు! ఏప్రిల్ 30వ తారీఖున కూచిపూడి వెట్టి వాళ్ళమునసబు బల్లవంటి దుర్గయ్య నాయుడు చితికి నిప్పంటించారు. అగ్ని అతని దేహాన్ని భస్మం చేసింది. మతద్వేషి చనిపోయాడు. ఒంగోలుకి లేఖ పంపారు. నువ్వు లొంగకపోతే దేముడు నిన్న లేకుండా చేస్తాడని దుర్గయ్య నాయుడిని ఆ దైవం ముందుగా హెచ్చరించలేదా? అనుకున్నాడు మిషనరీ, ఊరూరా వార్త పాకిపోయింది. బరువులు పట్టుకుని వెళ్ళే వెట్టివాళ్ళ దుర్గయ్య నాయుడి మరణం గురించి వార్తలు చెూశారు. ఆ ఉదయం పూట జనవరి 30వ తారీఖున మిషనరీకి చెప్పలు కుడుతూ. కుడుతూ.N 780
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/80
స్వరూపం