లస్కర్స్ కూడా వచ్చారు. శూద్రులు అనేకమంది సమస్య ఏమవుతుందా అని చూడటానికి వచ్చారు. అప్పటి నుంచి అనేకమార్లు దొర దుర్గయ్య నాయుడికి ఆ ఉదయం ఏం చెప్పాడో చెప్పమని కూచిపూడి భోధకుడిని అడిగేవారు. అతను మరిచిపోతే వెనక నుంచి గురు చేయటానికి చాలామంది సిద్ధంగా ఉండేవారు. ప్రజల జ్ఞాపకాలలో ఈనాటికీ మిగిలిపోయిన మిషనరీ మాటలు ఇవి."నేను నిన్న రాత్రి నిద్రోయానని నువ్వనుకుంటే అది పొరపాటు, కొన్నినిముషాలు నిద్రోయాక లేచి కూర్చున్నాను. నీ గురించే ఆలోచించాను. నిన్న నీతో దయగా మాట్లాడాను. నువ్వన్నమాటను ఈ ఉదయం జవదాటావు. చేసిన పాపపు పనులకు ఆంగ్లేయ ప్రభుత్వం శిక్షిస్తుందని నీకు తెలియదా? నువ్వు కప్పలాంటాడవి. ఎద్దంత అవుదామని గాలి కొడితే పగిలిపోయిందా కప్ప నువ్వునీ ఉద్యోగం పోగొట్టుకోవచ్చు" మునసబు నిర్లక్ష్యంగా అన్నాడు. “పోతే నాకేం నష్టం"? దాంతో దొరకోపానికి హద్దు లేకపోయింది. అతని కళ్ళ నిప్పలు కక్కాయి. "జైలుకి వెళ్లే నీకు తెలిసొస్తుంది. ఒక నేరస్తుడిగా తట్టలతో రాళ్ళ మోస్తావు. రోడ్డు పనిచేస్తావు. ఆంగ్ల ప్రభుత్వం నిన్ను లేకుండా చేసి పారేయకపోయినా నువ్వు ఈ పాపపు పనులు మానకపోతే దేముడు నిన్ను తుడిచేస్తాడు. గద్దకోళ్ళను తన్నుకుపోయినటు నువ్వు క్రైస్తవులను నాశనం చేస్తున్నావు. నేను ఫాదర్ని, పాములా నాకు రెండు నాలుకలు లేవు. సత్యం చెబుతున్నాను. దేముడు చనిపోలేదు. ఇప్పడు నువ్వు ఆపకపోతే కొన్ని నెలల్లో నువ్వు గ్రహింంచేటట్టు చేస్తాడు" శూద్రులకి భయం పుట్టింది. దుర్గయ్యనాయుడితో అన్నారు. " ఈ ୱେବ୍ బాధపెట్టి ఏం ప్రయోజనం? వాళ్ళ మానాన వాళ్ళని వదిలెయ్యలేవా?" మాదిగవాడలో ఒక నుయ్యి ఉంది. మిషనరీ వెనుకే అందరూ అక్కడికి వెళ్ళారు. మునసబు ఆ నూతిలో తుమ్మచెట్ల తోయించాడని దొర విన్నాడు. ఆ చెట్ల వాసనతో నీళ్ళ తాగటానికి పనికి రాకుండా పోయాయి. దుర్జయ్యనాయుడిని వెట్టి వాళ్ళ చేత ఆ చెట్లని తీయించెయ్యమని అభ్యర్థించాడు. అవి తీసేసేవరకూ అక్కడే నిలబడ్డారు. ఆతరువాత చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెప్పలు కుడుతూ. కుడుతూ.N 779
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/79
స్వరూపం