Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. మతద్వేషి-అతని అంతం B9ল చిపూడి గ్రామ సంతలో ఓ కొసన చెట్టు నీడలో అనేకమంది శూద్రులు కూర్చుని మాట్లాడు కుంటున్నారు. మామూలుకన్న హెచ్చగా వాళ్ళ ఉద్రేకంగా ఉన్నారు. "వాళ్ళకి మన బడి అంత బడి ఉంది. చదువుకుంటే మన పని ఎలా చేస్తారు?" ఇంకొక శూద్రుడు అన్నాడు. *నాg ఎద్దుంది. చాలాకాలంగా జబ్బుగా ఉంది. అది చనిపోయింది. మాదిగలను పిలిచాక ఊరి బయటకు తీసుకు వెళ్ళారు. చర్మం ఒలిచారు. మిగిలింది కప్పెట్టారు. వాళ్ళ యివ్వాల్సిన చెప్పల కోసం అడిగాను. మునుపు యిచ్చినంత యివ్వమన్నారు. నేను మీకు మొత్తం ఎద్దుని యిచ్చాను గదా! అన్నాను. మీరు మాంసం ఎందుకు కప్పెట్టారు? అని కూడా అడిగాను, "ఆ కుళ్ళ మళ్ళీ మా వాడలోకి తీసుకెళ్ళం అన్నారు. వాళ్ళని ఏం చెయ్యాలి? తాత తండ్రుల నుంచి వస్తున్న ఆచారాన్ని వదిలేస్తున్నారు," అన్నాడు మరొకడు. గ్రామ మునసబు, బల్లవంటి దుర్గయ్య నాయుడు, అందాకా మౌనంగా ఉన్నాడు. పక్కనున్న కండువా అందుకున్నాడు. తలకి చుట్టాడు. వెళ్ళటానికన్నట్లు లేచాడు. "బాప్టిజం కోసం పదిమంది ఒంగోలు వెళ్ళారు. రానీండి. వచ్చాక వాళ్ళని పూర్వంలా చేస్తాను. గుణపాఠం చెపుతాను" అన్నాడు. దుర్గయ్య నాయుడు మహాక్రూరుడు. සී. පොංති භුජරඹීයක డంటే అంతుచూడకుండా వదలడు. మహా పట్టదల మనిషి. అతను లేవటం చూశారు శూద్రులు. వాళ్ళకి అందులో తప్ప కనిపించలేదు. వాళ్ళూ వాళ్ల తాత తండ్రులూ మాదిగలకి రక్షకులమని అన్నం పెడుతున్నామనీ అనుకునేవారు. "వాళ్ళు మనని అగౌరవించటం లేదు. ఆదివారం రాలేమన్నా వాళ్ళ మన కాళ్ళా వేళ్ళా పడుతున్నారు. మర్నాడు పనికి రానివ్వమని బతిమాలుతున్నారు. సాగదీస్తూ ఒకడు ಆನು. దుర్గయ్య నాయుడు మొహంలోని కోపాన్ని సరిగా పట్టించుకోకుండా ఒకడు అన్నాడు. 'ఇదెలా ముగుస్తుంది? మన పనికి మరొకరిని చూకోవాలి." మునసబు దుర్గయ్య నాయుడు కొన్నాళ్ళు పోయాక క్రైస్తవులైన పది మంది మాదిగ పెద్దలను పిలిచాడు. "మీరు ఒంగోలు వెళ్ళి క్రీస్తు పేరుతో నీటిలో మునిగారు. మీరు మైలపడ్డారు. మీరు యిక్కడ చెరువులో మునిగి ఆ మైలను కడుక్కుంటే తప్ప మిమ్మల్ని ఊళ్ళ అడుగుపెట్టనివ్వం" అన్నాడు. శూద్రుల ఊరికి మాదిగవాడకీ మధ్యన ఉంది చెరువు. గ్రామకరణం వచ్చాడు. ఏం ఆజ్ఞ యిచ్చినా అమలు చెయ్యటానికి తయారుగా ఉన్నారు వెట్టివాళ్ళ చాలామంది శూద్రులు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు. దుర్గయ్య నాయుడు తేలిగ్గా వదలడని వాళ్ళకు తెలుసు. ఆ పదమంది చుట్టాలూ స్నేహితులూ భయాందోళనలతో పరిగెత్తుకుంటూ వచ్చారు. భయంతో వణికిపోతూ కూడా మునసబు చెప్పినట్టు చెయ్యటానికి క్రైస్తవులు ఒప్పుకోలేదు. వాళ్ళ బోధకుడు తోడుగా నిలబడి ధైర్యం చెప్పాడు. గుంపు అంతా చెరువు వేపు నడిచింది. "వెళ్ళండి. నీటిలో మునగండి. ఒంగోలు మైల వదిలిపోవటం నేను చూడాలి" అన్నాడు దుర్గయ్యనాయుడు. వాళ్ళ ఒక్క అంగుళం కదలలేదు. వెట్టివాళ్ళని పిలిచి కర్రలు మెడలమీద పెట్టి నీటిలోకి తోసెయ్యమని అరిచాడు. వాళ్ళ ఏడుస్తున్నారు. వడ్డవద్దంటున్నారు. న్యాయం కాదంటున్నారు. "ముంచెయ్యండి! మైల వదిలిపోవాలి అరిచాడు. అందరూ బలవంతంగా వాళ్ళని నీట్లోకి తోసేసారు. అవమానాలకు కౌర్యం මී’ස්යභාරයි. మునసబుకి అది చాలలేదు. అంతకు ముందు పూజలను క్రైస్తవులచేత మొదలెట్టించాలి. ఆ చెరువు గట్టున పోలేరమ్మ రాతి బొమ్మ ఉంది. అరుపులు కేకల మధ్య ఓ గేదెని మేకని తీసుకువచ్చారు. విగ్రహం ముందు నిలబెట్టారు. వెట్టివాళ్ళ నరికారు. వెచ్చటి రక్తం విగ్రహాన్ని తడిపింది. రక్తదాహం ఎప్పటికీ తీరని ఆ దేవత చాలా సంతోషిస్తుందని అను కున్నారు. ଞ బలవంతంగా విగ్రహానికి మొక్కించారు. కొంచెం రక్తం తీసి నుదుట బొట్టు పెట్టారు. రాత్రంతా భయానకంగా గడచింది. వాద్యాలతో పోలేరమ్మ దేవత గాధలని గాయకులు పాడారు. సారా మత్తులో జనం విగ్రహం చుటూ ఆడారు. క్రైస్తవులని కూడా ఆడమన్నారు. లొంగిపోయారు. కాదంటే చావు తప్పదని వారికి తెలుసు. దొంగతనంలో ఇరికించి తాసిల్లారు ముందుకి లాక్కెళతానని మునసబు బెదిరించాడు. తము నేరం చెయ్యలేదని రుజువు చేసుకోటం కష్టం, అసంభవం అని ක"ටිෂි ෂිෆාහ. మాదిగవాడ నుంచి క్రైస్తవం తుడిచిపెట్టుకుపోయిందని శూద్రులు భావించారు. వాళ్ళ వాదించారు. “వాళ్ళలో ఎవరైనా కులాన్ని పోగొట్టుకుంటే పూజారి పూజలన్నీ చేసి నాలుక మీద బంగారం తీగతో కాలిస్తే అంతకుముందు చేసిన అపరాధాలు తొలగిపోతాయి గదా!" కులంలో వాళ్ళకి వర్తించే విధానాలు కులం నుంచి వెలివేయబడ్డ వాళ్లకి వర్తించటం చెప్పలు కుడుతూ. కుడుతూ.N 774