Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిప్రాణగా ఉంది. ఆ తరువాత డాబు చెయ్యబోయాడు. కాని చేతులు వణికాయి. మనిషి పట్టు దప్పాడు. కొంచెం కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు. అంతకు ముందెప్పడూ అలా జరగకపోవడం వల్ల ఏం జరుగుతుండా అని సందేహించాడు. సగం మంత్రాలు కూడా చదివలేకపోయాడు. అలవాటుకన్న ముందే యింటికి బయల్దేరాడు. రాత్రికి ఉండమన్నారు ఊరివాళ్ళ కాని ఒప్పకోలేదు. చిన్న క్రిష్టయ్యకి చాలా విచారంగా ఉంది. ఇంటికి వెస్తన్నప్రడు అన్నాడు. "అన్నయ్యా! నువ్వు కూడా ఆ మతంలోకి పోతున్నట్టున్నావు. అపుడు నేను රසායෂ්ඨිෂ්ථ හිමිකාවේ. ශූරැස්ෙස්ත්‍රීය వాళ్ళిద్దరిలాగే మనమూ కలిసే ఉందాం" అని ఓదార్చాడు. ఆ తర్వాత రాత్రి అనుభవం గురించి పెద కృష్ణయ్య చెపుతుంటాడు. నా మనసులోకి ఇద్దరు ప్రవేశించారు. తెల్లవారీ దాకా పెద్ద యుద్ధం జరిగింది. మంచి ఆలోచనలు వచ్చాయి. చెడ్డ ఆలోచనలు వచ్చాయి. నువ్వు క్రీస్తుని విశ్వసిస్తే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. అంది ఒక గొంతు. "నీకేం దొరుకుతుంది? నీ పూర్వీకలుకి స్వర్గం దక్కలేదా? ఈ మతం నించి నువ్వు ఏం ఆశిస్తున్నావు?" అంది మరో గొంతు, రాత్రంతా నిద్ర లేదు. నేను ప్రార్ధించలేకపోయాను. నాలో నేను మాత్రం అనుకున్నాను. " ఓ దైవమా! నా పాపాలు తొలగించు. స్వర్గాన్ని ప్రసాదించు." తెల్లారేక ఇంటి చూరులో ఆనందయ్య ఏమైనా పుస్తకాలు ఉంచాడా అని చూశాను. తీసుకుని చదివాను. శాంతి కలిగింది. పెద కృష్ణయ్య గందరగోళం ముగిసింది. కాని ఈ మధ్యలో ఆనందయ్య ఏడి? ఆశ కోల్పోతే హృదయం రోగగ్రస్తమౌతుంది. సుదీర్ఘ నిరీక్షణలో అలసట, సహన భారమూ అతని శరీర ఆరోగ్యాన్ని దెబ్బకొట్టినట్టున్నాయి. అనారోగ్యంగా ఉన్నాడు. సమీప గ్రామంలోని కొందరు మితృలతో ఉన్నాడు ఆనందయ్య వారు కూడా అతని ద్వారా క్రీస్తుని నమ్ముతున్నారు. గాని ఇంకా బాప్టిజం తీసుకోలేదు. "ఆనందయ్య ఎక్కడున్నాడు" అని తల్లిని అడిగాడు. చెప్పింది. ఆమె గొంతులోని మౌన తిరస్కారం అతనికి గుచ్చుకొంది. ఆనందయ్య వచ్చే దోవలో బయల్దేరాడు. కొంచెం దూరంలో తన వాళ్ళతో కలిసి వస్తుండటం చూశాడు. ఆనందయ్య వచ్చే దోవను తరచుగా వదిలేసే పెద్ద కృష్ణయ్య ఇప్పడు అతనివేపు నడిచాడు. పలకరించాడు. ఆనందయ్య కదలకుండా నిలబడిపోయాడు. అతనివేపు నడిచాడు. పలకరించాడు. ఆనందయ్య కదలకుండా నిలబడిపోయాడు. అతనివేపు చూశాడు. ఆశ్చర్యం! అతని చూపులో కఠినత్వం లేదు. అతనిని కావలించుకుని అడిగాడు. "అన్నయ్యా! దైవం నీ మనసుని ఎలా మార్చాడు? ఈ మంచి మార్గంలోకి వచ్చే మంచి బుద్ధిని ఎలా ఇచ్చాడు? ఒకరినొకరు గాఢంగా కావలించుకున్నారు. ఇన్నాళ్ళూ అణచబడ్డ సోదరభావం చిట్టచివరకి నెగ్గింది. ઉ9 పద్దెనిమిది බිපළු ප්‍රංපට ‘යටිරඩ් ఈనాడు పెదకృష్ణయ్య అంటాడు. నాలో ఏదో భూతం ఆవహించింది. ఆనందయ్యకి తన అనుభవమంతా చెప్పాడు. వెంకటేశ్వరుడి విగ్రహాన్ని కుక్క ఎత్తుకుపోవటం, పూజ చెయ్యలేక చేతులు వణకటం, గడచిన రాత్రి తన మనసులో ఇద్దరి యుద్ధం గురించి చెపుతూంటే కన్నీళ్ళు ధారగట్టాయి. ఆనందయ్యకి కూడా చెప్పవలసిన సంగతి కొంత ఉంది. పదిరోజులలోగా పెదకృష్ణయ్య క్రీస్తుని అనుసరిస్తాడని తోటి మిత్రులతో ప్రార్థనా సమయంలో చెపుతున్నాడు. "అన్నయ్యా! ఎనిమిది రోజులుగా నీకోసం ప్రార్ధిస్తున్నాము. పొద్దుట లేచాక నేను ఉండలేకపోయాను. నీలో మార్పు వచ్చిందేమో చూద్దామని వెంటనే బయలుదేరాను. కలిసి ఇంటికి వెళ్లారు. "నీ భార్యని తీసుకురా. చదువు కుందాం. ప్రార్థిద్దాం" అన్నాడు. ఆనందయ్య అతను పిలుస్తున్నప్పుడు ఆమె వాకిలి తుడుస్తోంది. వెంటనే తన చీపురు పారేసి ఆనందంగా పరుగెత్తుకు వచ్చించి. తల్లి వచ్చింది. అలాంటి తల్లల అవ్యాజ్య ప్రేమే కుటుంబాలను కలిపి ఉంచుతుంది. వెంకటయ్య వచ్చాడు. ఇన్ని నెలలు వాళ్ళ అంత బాధపడుతూ కూడా తననెంత సహించిందీ పెదకృష్ణయ్య చూశాడు. వాళ్ళ నేర్చుకున్న క్రైస్తవ గీతాలలో ఒకటి పాడుతూంటే తనూ గొంతు కలపబోయాడు. మాధ్యూ ఏడవ అధ్యాయం ఆనందయ్య చదువుతుంటే విన్నాడు. అతను ప్రార్ధించలేకపోయాడు గాని ఆనందయ్యప్రార్ధిస్తుంటే పక్కనే మోకరిల్లాడు. ఆ తర్వాత కుటుంబమంతా మాట్లాడుకుంది. “బంగారపు తాతయ్య ఇటు నుంచే నెలవారీ సమావేశానికి ఒంగోలు వెళతాడు. మనమూ అతనితో వెళ్ళి బాప్టిజం తీసుకుందాం" అన్నాడు ఆనందయ్య పెద్దక్రిష్టయ్య సిద్ధంగా లేడు. "మీరు వెళ్ళండి. నేను చేసిన పూజలకి ఇక్కడా అక్కడా ధాన్యం రావాలి. అదంతా తెచ్చుకుంటాను. ఓ నెల అయాక నేనూ వస్తాను" అన్నాడు. ఆనందయ్య దీనికి ఒప్పకోలేదు. అన్నతో వాదించాడు. చిట్టచివరగా ప్రశ్నించాడు. "ఈ ధాన్యం పోగేయటంలో నువ్వు చచ్చావనుకో. నువ్వు ఎక్కడికి వెళతావు?" పెద్దక్రిష్టయ్య అంగీకరించాడు. ఒక మాల పూజారిగా తనకి రావలసిందంతా వదిలేసాడు. పౌరోహిత్యం నుంచి తప్పకున్నాడు. ఇంకా కుటుంబమంతా ఒక్కటవలేదు. చిన క్రిష్టయ్య చాలా బాధపడ్డాడు. ఆ రాత్రి వేరేగా పడుకున్నాడు. పగలు ఒంటరిగా ఉన్నాడు. అన్నదమ్ములను వదిలేసి ఇతర మాల చెప్పలు కుడుతూ. కుడుతూ.N 774