ఈ మధ్యనే బాప్టిజం తీసుకున్నాడని విని రాజయోగి గురువుల పనికిమాలినతనం గురించి చెపుతాడని విని చూడటానికి బయలుదేరాడు. లక్ష్యయ్య స్నేహదరాలతో ఆహ్వానించాడు. పుల్లలు వెలిగించి స్నానానికి వేణ్ణిళ్ళ పెట్టాడు. ఆడవాళ్ళ చేస్తున్న రాత్రి వంట ఘమఘమలాడుతుంది. చింత చెట్టు కింద కూర్చున్నారు. ఆ సాయంత్రపు చల్లదనంలో ఇద్దరూ అనేకం మాట్లాడుకున్నారు. లక్ష్మయ్య అధికారయుతంగా మాట్లాడక తప్పదనుకున్నాడు. "నువ్వుక్రీస్తుని నమ్మవా?" అని అడిగాడు. అవునన్నాడు. రత్నం. “నువ్వు బాప్టిజం తీసుకున్నావా? “లేదు". అయితే ఈ నెలలోనే ఒంగోలు వెళ్ళ బాప్టిజం తీసుకో. లేకపోతే నువ్వు తొందర్లోనే చచ్చి నరకానికి పోతావు". ఆత్మలు, దెయ్యాలు, భూతప్రేతాలు నమ్మే మాదిగలలో ఆలోచించేవాళ్ళకి మరణానంతరం మంచి జరగాలని బలీయమైన కోరిక ఉంటుంది. క్రైస్తవ భావనలైన స్వర్గమూ, నరకమూ వాళ్ళకి సులువుగా పట్టాయి. ఒకటి దొరకాలన్న ఆశ మరొకటంటే భయమూ వారి నైతిక వర్తన మీద మతావేశం మీద బలమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఆ విధంగా లక్ష్మయ్య ఎక్కించడంతో రత్నం ఊగిసలాట ముగిసింది. ఒంగోలు మిషన్ ఎంచదగ్గ ఒక గొప్ప సేవకునిగా అతని భవితవ్యం రూపొందింది. రత్నం రూపంలోనే ఒక విధమైన మర్యాద ఉట్టిపడు తూంటుంది, అతని వాలకం సాధారణమైనదేనా గొప్ప రాజనం కనిపిస్తుంటుంది. ప్రతి ఉద్వేగమూ కళ్ళల్లో కనిపిస్తుం టుంది. అతను తదనంతరం జీవితంలో ఆదుర్గాకి అలవాటు పడ్డాడు. అది అతని జీవితంలోని కష్టాలకు గుర్తు. ఎవరైనా దయగా చూస్తే అతని వదనం అరుదైన చిరునవ్వుతో ప్రకాశ వంతమవుతుంది. ఆ దయకి బదులుగా అతనిలో భక్తి కనిపిస్తుంది. మొదటి సంవత్సరాలలో చుట్టపక్కల ఊళ్ళలో బోధించ టానికి వెళ్ళేపుడు తోడుగా భార్యని తీసుకు వెళ్ళేవాడు. ఇది అసాధ్యమైపోయింది. మతం మార్చుకున్నవాళ్ళ పెరిగే కొద్ది శూద్రులతో సమస్యలు పెరిగాయి. బోధకుడి మీద అతని భార్య మీద గొడవలు వచ్చాయి. "ఈ అవమానాలను ఎదుర్కోవడం ఆడాళ్ళకు అపాయం" అన్నాడు. అప్పటినుంచి ఒక్కడూ వెళ్ళేవాడు. ఒక చిన్నతరహా సాంఘిక విప్లవం ఆ రోజుల్లో నడుస్తుండేది, మాదిగ జనాభా తొందరగా క్రైస్తవంలోకి మారు తోంది. తత్ఫలితంగా శతాబ్దాలుగా మాదిగలని పట్టి ఉంచిన ఆర్థిక సామాజిక సంబంధాలు తెగిపోతున్నాయి. వారానికి ఒకరోజు విశ్రాంతి, దైవప్రార్ధన కావాలన్న క్రైస్తవుల కోరికలో ఒక కొత్తదనం ఉంది. చాలామంది మాదిగలకు వారంలో రోజులను గుర్తుంచుకోవటం తెలియని పని. ఎన్ని రోజులు గడిచిందీ తెలుసుకునీపాటి జ్ఞానం మానవులలో నైతిక వర్తనను అలవరచుకుందుకు అవకాశం యిస్తుంది. మాదిగల ఈ నూతన స్వతంత్ర భావన శూద్ర భూస్వాములకి నిరంతరం చికాకుకి కారణమవుతూనే ఉంటుంది, కావలిసొచ్చినపుడల్లా తన పాలేర్లను పనికి పిలవటానికి అలవాటు పడ్డాడు. రాత్రీ పగలూ, విత్తనాల టైము పంటల టైము ఎప్పడూ అతని పిలుపుకి సిద్ధంగా ఉండాలి. విశ్రాంతి పట్ల వారి కోరిక న్యాయబద్ధమైనదిగా భూస్వామి చూడలేదు. అధికారం మీద తిరుగుబాటుగా శూద్రునికి కనిపించింది. శూద్రుల బాధను కరణం పంచుకున్నాడు. అతనూ క్రైస్తవ వెట్టివారిని ఆదివారం పనిచేయమన్నాడు. దూరప్రయాణాలు ఆరంభించమన్నాడు. వాళ్ళ మర్నాడు వెళ్ళటానికి అనుమతించమన్నారు. ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వ్యాపించింది. ఎప్పడన్నా అమ్మవార్లకి, దేవతలకి పూజలు చెయ్యాల్సివస్తే తిరగబడుతున్న మాదిగలను ఎలా ఒప్పించాలన్న ప్రశ్న ఎదురయింది. గ్రామ సమాజానికి చేయవలసిన సేవలకు వాళ్ళ ఋణపడి ఉన్నారు. వాళ్ళ సేవలకు ప్రతిగా బలిచేయబడ్డ జంతువులు వాళ్ళకు ವಂದೆವಿ. రత్నం కింద ఉన్న గ్రామాలలో ఒకటైన బళ్ళపూడి గ్రామంలో ఈ తగువ తారస్థాయికి చేరింది. మాదిగలు పురాతన వ్యవస్థల మీద తిరగబడ్డారు. గ్రామీణ సామాజిక వ్యవస్థను వాళ్ళమీద ఉపయోగించారు. కుమ్మరి చేసే కుండలు పగిలిపోతూ ఉంటాయి. వాటిని తరచు మార్చాలి. అలాగే చాకళ్ళ గ్రామం అంతటికీ సేవ చేస్తుంటారు. వాళ్ళ యిళ్ళ க983 ఉంటాయి. చెరువు ఎండిపోతే తగినంత నీరు ఉన్నచోట్లకి గాడిదల మీద వేసి బట్టలు తీసుకెళ్లారు. అనేకరకాలుగా పరస్పరం ఆధారపడటం గ్రామీణ జీవితంలో ఉంది. మునసబు, కరణం గనక ఆజ్ఞాపిస్తే మాదిగలకి పరస్పర సహకార గ్రామ జీవితం ఉండదు. వాళ్ళ వెలి చాలా దుర్భరంగా ఉంటుంది. బల్లపూడి కరణం మరీ ధృడమైనవాడు కాదు. కాని పీడించే అధికారం తనకి ఉందని తెలుసు. తనే ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ దారి తప్పతున్న మాదిగలతో ఎలా వ్యవహరించాలో ఆ ప్రాంతానికంతటికీ చూపించాలనుకున్నాడు. చాకళ్ళని క్రైస్తవుల బట్టలు ఉతకవద్దని చెప్పారు. కుమ్మరిని కుండలు అమ్మవద్దన్నారు. అందరూ మేపుకొనే పోరంబోకు భూముల్లోకి వాళ్ళ పశువులని రానివ్వనీలేదు. శూద్రులు అందరూ చెప్పలు కుట్టడం వంటి చెపలుకుడుతూ, కుడుతూ.N 766
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/66
స్వరూపం