రానివ్వను అంటోంది" అంది. "ఫరవాలేదు మనం మరోచోటు చూసుకుందాం" ప్రశాంతంగా అన్నాడు. నెమ్మదిగా యింటికి వెళ్ళారు. రాత్రి భోజనానికి ధ్యానం దంచుతోంది తల్లి పెద్ద కొడుకుని చూసింది. అతను తలగుడ్డ విప్పగానే కొప్పముడి లేకపోవటం గమనించింది. గొప్ప దుఃఖంతో అంది. "నిన్నుకన్నాను. పెంచాను. ముసలితనంలో నన్ను చూస్తా వనుకున్నాను. మనం వెళ్ళగూడని మార్గంలో నువ్వు వెళ్ళావు. నీ చేతి తిండి నేను తినను, పో! నువ్వు నాకు చచ్చిన వాడికిందే సమానం" రామయ్య జీవితంలో తన నిర్ణయాలతోనే ఇంతకాలం నడిచాడు. ఇప్పడు లొంగే అవకాశమే లేదు. ఇల్ల తనదే అన్నటు అతను ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతనితో కలగజేసుకునే ధైర్యం ఎవరికీ లేకుండాపోయింది. కాని కుల కట్కబాటు అతనికన్నా బలమైనవి. కుటుంబం భోంచేసేటపుడు వాళ్ళతో తిననివ్వలేదు. అతనికీ పెళ్ళానికి తిండి వేరేగా పెట్టారు. అతని మైల అంటుకుని అందరికీ రోగాలు వస్తాయి గనుక నూతిలో నీళ్ళ తోడనివ్వమన్నారు. తనకోసం ఓ నూతిని తవ్వకోవలసి వచ్చింది. నీళ్ళ వెంటనే పడ్డాయి. బరువుగా బాధగా గడిచాయి రోజులు. కాని తల్లి కఠిన నియమం నిలవలేదు. చిన్న కొడుకులు కూడా బాప్టిజం తీసుకున్నారు. జుత్తు కత్తిరించుకుని వచ్చినపుడు ఆమె వాళ్ళని శపించటానికి సాహసించలేదు. "ముసలాయన మంచాన పడ్డాడు. చావు దగ్గరవుతోంది. క్రీస్తు గురించి చెప్పే ప్రతి పదం కోసం తపిస్తున్నాడు. కాని భార్య తిడుతుందేమోనన్న భయంకొద్దీ తనకి శాంతి కలిగించేదేమిటో చెప్పటానికి ధైర్యం లేకపోయింది.అతను నజరేల్ యొక్క జీసస్ మీద విశ్వాసంతో చనిపోయాడు. రామయ్య ఒక తమ్ముడు ఒంగోలుకి స్కూలుకి వెళ్ళారు. மூஜ0ல் అమ్మకి సహాయంగా පුටසීයක්රී èsoå పోయాడు. బయటకు ఒప్పకోకపోయినా, ఎవరో ఒకరు యింటివద్ద ఉండిపోయి తనను చూసుకుంటే తల్లి ඝථෂ්ඨිරඩ්රයි. కొన్నేళ్ళ గడచాక ఆఖరాడు అన్నదమ్ములను చూడటానికి ఒంగోలు వెళ్ళాడు. అక్కడ ముగ్గురూ ఉండగా కొద్దిగా జబ్బుపడి తల్లి చనిపోయిందని కబురు వచ్చింది. ముగ్గురూ ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకున్నారు. ఒకరి ఆలోచన ఒకరికి తెలుసు. రెండు చేతుల్లోనూ ముఖం పెట్టుకుని రామయ్య ఏడిచాడు."నేను తనకి చచ్చిపోయినట్టేనని చెప్పింది. ముసలితనంలో నా చేతి తిండి తిననంది పిల్లలందరూ దూరంగా ఉండగా చనిపోయింది. తనన్నట్టే చేసింది." తల్లిని తలచుకున్నపుడల్లా రామయ్యకి అలవికాని బాధ కలుగుతుంది. తల్లి శాపం గురించి చెప్పినపుడల్లా అతని కళ్ళలో నీళ్ళ నిండుతాయి. శ్లో చెపలుకుడుతూ, కుడుతూ.N 763
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/63
స్వరూపం