Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెపతున్నాడు. ఆ ముసిలాయనకి అదో గొప్ప తృప్తిని కలిగించే విషయమయింది. అంతా డబ్బులు ఖర్చుపెట్టినందుకు పిల్లలు విచారించలేదు. కొన్నేళ్ళ గడిచాయి. పశిగోపు బసయ్య తన తోలువని పరికరాలను పదునుపెట్టించుకోటానికి ఒకరోజు మదులూరు వచ్చాడు. అతను ఉలూరి వాళ్ళ కుటుంబానికి స్నేహితుడు. ఇంటికి బయల్దేరే ముందు వాళ్ళని చూడటానికి వెళ్ళాడు. అదీ యిదీ మాట్లాడుకుంటున్నారు. కొత్త మతాన్ని ఒక దొర ఒంగోలుకి తీసుకువచ్చాడు. విన్నారా అని అడిగాడు. దాన్నంతా మంచి మతం అనుకుంటున్నారు. అని చెప్పాడు, వివరాల కోసం వాళ్ళ అడిగారు కాని బసవయ్య వాళ్ళకి తృప్తి కలిగించలేకపోయాడు. ఈ మతాన్ని నమ్మినవాళ్ళని జీనస్ క్రీస్తు రక్షిస్తాడు, ఆయనే పూజించాలి, మిగిలిన స్వాములు అందరూ తరువాతే అని మాత్రం బసయ్యవిన్నాడు. అంతేకాక అనేకమంది ఈ మతం పుచ్చుకున్న మాదిగలు ఆదివారం పనిచెయ్యరు. చచ్చిన గొడ్డ మాంసాన్ని వాడలోకి తీసుకురారు అని ఓ వెట్టి బసయ్యతో చెప్పాడు. బనయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రయాణంలో అలసిపోయిన ఓ మనిషి అతని ఇంటివద్ద చెట్టకింద కూర్చుని ఉండటం కనిపించింది. అతను మాదిగల పెద్ద గురించి అడిగాడు. వస్తాడని చెప్పారు. మాదిగల పెద్దగా బసయ్య కొత్తవాళ్ళని ఆహ్వానించటం, వాళ్ళ కష్టసుఖాలు విచారించటం, తన పెద్దరికంతో ఏదైనా సాయం కోరితే చెయ్యటం అతని విధులు తన ఎదురుగా ఉన్న బద్దేపూడి కన్నయ్యక్రైస్తవుడని తెలుసుకుని చాలా సంతోషించాడు. అతని అవసరాలు చూశాడు. కన్నయ్య బాధ్యత అంతా తీసుకున్నాడు. క్రైస్తవ ప్రచారానికి భారతీయ గ్రామీణ సమాజంలోని తెగ పద్ధతి ఆ విధంగా ఒక వాహిక అయింది, మర్నాడు කියඨභ්‍යා-ප්‍රිජි వెళ్ళారు. అతిథులుగా వారిని ఆదరించారు, కన్నయ్య ఎందుకొచ్చిందీ బసయ్య చెప్పాడు. అతను చెప్పేది వినటానికి ఒప్పకున్నారు. ఆ వేళ ఎక్కువేం చెప్పలేదు. వచ్చినవాళ్ళ వెళ్ళాక ఈ మతం గురిచి మళ్ళీ వినటానికి వాళ్ళని మళ్ళీ పిలుద్దామను కున్నారు. అలాగే పిలిచారు. ఇద్దరు మనుషులు వెళ్ళి పిలిచారు కన్నయ్య వచ్చాడు. అతనికి ఆ రోజు, మంచి అవకాశం దొరికింది. అందరూ వినటానికి సిద్ధమయ్యారు. పిల్లలు పడుకున్నారు. కుక్కలు మాత్రం అప్పడప్పుడు రాత్రి శబ్దాన్ని బద్దలు చేస్తున్నాయి. క్రీస్తు మరణగాథ విన్నారు. క్రైస్తవుల పద్ధతిలో కన్నయ్య ప్రార్ధించాడు. ఇలాంటిది వాళ్ళంతకు ముందు ఎప్పడూ తెలియదనుకున్నారు. "మనమెందుకు ముందుకు వెళ్ళకూడదు? మనం చేస్తున్న దానిలో ఎలాంటి ముక్తి లేదు? అనుకున్నారు. ఆ తర్వాత రోజులలో, ఉలూరి వాళ్ళ కుటుంబంలో చిన్నవాళ్ళ తోటివాళ్ళతో ఈ కొత్తమతం గురించి చర్చించారు. దోవన పోతున్న ಪಟ್ಟಿವ್ಜು మదులూరిలో విచిత్రాలు జరుగుతున్నాయని చెప్పాడు. ఉలూరి వాళ్ళ ముసలి తండ్రి ఆ విషయాలను ఆలోచించి పట్టించుకోమని సలహా యిచ్చాడు. వాళ్ళకి దైవభక్తి ఉందని గుర్తుచేశాడు. త్రిపురాంతకంలో నజరయ్య సమాధిని చూడటానికి కుటుంబమంతా వెళ్ళలేదా? బియ్యమూ, మేకా యివ్వలేదా? పాటలు పాడుతూ నజరయ్య సమాధిమీద పూదండలుంచలేదా? పూజలకి పోలయ్య గురువుకి ఆవుని యివ్వలేదా? అన్నింటికన్నా కొన్నేళ్ళక్రితం అర్ధరాత్రి తమ తండ్రికి దేముడుని చూపించలేదా? అంతేకాక ఈ మాదిగ కుటుంబపెద్దకి ఉక్కమ్మ అనే కూతురు ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రేమాదరాలతో ఆమెను చూసుకునేవాడు. పదేళ్ళ వయసులోనే ఆమె విధవ అయింది. ఆర్య హిందూ ఆచారాలని అనుసరిస్తూ పసితనంలోనే వాళ్ళకి బాగా తెలిసిన కుటుంబంలోని ఓ యువకుడికి యిచ్చి పెళ్ళి చేశారు. అత్తారింటికి పంపే రెండో కార్యక్రమం జరగలేదు. బ్రాహ్మణ విధవలాగే ఈ చిన్న మాదిగ కన్య మళ్ళీ పెళ్ళాడ రాదు. మాదిగల పద్ధతికి అది చెందకపోవచ్చు. రెండుసార్లు పట్టే బ్రాహ్మణులను అనుసరించటం మంచిదనుకున్నారు. ఏళ్ళ గడుస్తున్నాయి. ఉక్కమ్మనజరయ్యశిష్యులు చెప్పిన మత వీధులలో మునిగిపోయింది. ఆమతం పాటలని పాడటాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆమెకి తోడుగా వెళ్ళేవారు. క్రమంగా ఉక్కమ్మకి నలభై ఏళ్ళ వచ్చాయి. ఆ ఊరు ఈ ఊరు పాడటానికి ఆడటానికి పిలిచేవారు. ఆమెని చాలా గౌరవించేవారు. "ఆమె అందరు ఆడాళ్ళలాంటిది కాదు. భగవంతుడిని సేవిస్తోంది" అనుకునేవారు. కొన్నాళ్ళకి ఆమె వేలు విడిచిన సోదరి కూడా భర్తని కోల్పోయింది. ఇద్దరు ఆడవాళ్ళ అప్పటినుంచి కలిసి తిరుగుతుండేవారు. వాళ్ళ ఏ వూరు వెళ్ళిపాడినా ఉట్టి చేతులతో పంపేవారు కాదు. వాళ్ళ చేతుల్లో డబ్బు పోగయింది. కొంత నజరయ్య గుడికి యిచ్చారు, కొంత తల్లిదండ్రులకు యిచ్చారు. ఉక్కమ్మ దూర గ్రామంలో ఉండి కుటుంబంలో అందరి కన్నా దైవభక్తిగలది కనుక ఏ ముఖ్యనిర్ణయం తీసుకోవాలన్నా ఆమెను సంప్రదించాలని తండ్రి గట్టిగా చెప్పాడు. "పెద్ద కొడుకు కొండయ్యకు ఆ తర్వాత రోజులలో నిద్రపట్టలేదు. "ఉక్కమ్మ రావటంలేదు. నేనే వెత్తాను. అన్నాడు. రెండు రోజులు ప్రయాణం చేశాడు. అక్కకళ్ళమెరిసాయి. "ఇంటి దగ్గర అందరూ బాగున్నారా"? అని అడిగింది. ఆ వాడ వాళ్ళందరికీ తన తమ్ముడు వచ్చాడని చెప్పింది. మాదిగ పెద్ద చెప్పలు కుడుతూ. కుడుతూ.N 757.