2. దైవదర్శనాకాంక్ష లూరి వారి కుటుంబం కీర్తి నలుదిశలా వ్యాపించింది. వాళ్ళ ధనాన్ని బట్టి కాదు. గొప్ప గొప్ప పనులు చెయ్యటంలో ముందున్నందుకు కాదు. వాళ్ళ భక్తి తత్పరతే దానికి కారణం. గురువు పోలయ్యకి పదహారు రూపాయల విలువైన ఆవుని వారు ఇచ్చారు. ఒక గురువుకి యిచ్చే కానుక లలో ఇది చాలా గొప్పగా భావించబడింది. మతపరమైన అంకితభావానికి ఆ కుటుంబం ఖ్యాతి సంపాదించుకుంది. చిన్నపూడి పోలయ్య పూర్తిగా నిరక్షాస్యుడైనప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆదరాన్ని సంపాదించుకున్న మనిషి అయుం టాడు. అదే అతన్ని తతిమ్మా వాళ్ళ కన్నాభిన్నమైన వాడుగా చేసి గురువుని చేసింది. అతను ధ్యానముద్రలో ఉండేవాడు, స్వప్నాల స్వాప్నికుడు. ఓరోజు తెలివిగా ఓ ప్రశ్నలేవదీశాడు "కోటప్పకొండ స్వామితతిమ్మాస్థలాలలోని స్వాములూ, జనం యింతగా పూజ చేస్తున్నారు గాని, మనుషులు తయారుచేసే వాళ్ళే ఈ మనుషులు చేసిందెవరు? భూమ్యాకాశాలను చేసిందెవరు? దేవుని చూడకుండా నేను చనిపోవాలా?" అతని తండ్రి నజరయ్యను అనుసరించినవాడు. నజరయ్యను చూడటానికి అతని తండ్రి నజరయ్యను అనుసరించినవాడు. నజరయ్యను చూడటినికి అతని తండ్రి త్రిపరంతకం తీసుకు వెళ్ళటం ఆ పోలయ్య తొలి జ్ఞాపకాలలో ఒకటి. బీదరికంలో సన్యాసిలా బ్రతికి ఎవరితోనయినా ఎప్పడైనా దేముడు ఒకడే అన్న తన ముఖ్యసిద్ధాంతం గురించి మాటలాడటానికి సిద్ధంగా ఉండే నజరయ్యను ఆ బాలుడు పోలయ్య ఏనాడూ మరచిపోలేదు. ఆ బాలుడి మనసులో విగ్రహారాధన పట్ల వ్యతిరిక్తత, భగవంతుడిని చూడాలన్న అవిశ్రాంత కాంక్ష నజరయ్య నాటాడు. ఉలూరి కుటుంబానికి గురువైన పోలయ్యకి తన ఉపచారాలలో తన అజ్ఞానాన్ని గంభీరమైన గురుత్వంలో ఎలా కప్పిపెట్టుకోవాలో బాగా తెలుసు. వాళ్ళకి మంత్రాలూ శ్లోకాలూ చెప్పేవాడు. రాజయోగి ప్రజల వేదాంతంలో ఇక్కడో ముక్క అక్కడో ముక్క నేర్చాడు. ప్రత్యేక సమయాలలో తన జ్ఞానాన్ని కొంచెం ప్రదర్శించేవాడు. అతను తనకి మించిన లోతులకి వెళ్తున్నానని తెలియగానే వెనక్కి తగ్గి ఒక రహస్యమయ వాతావరణాన్ని కల్పించేవాడు. అది సరళ స్వభావులకీ చాలా అద్భుతంగా అనిపించేది. మరోసా8 యింకా ఎక్కువ చెపుతానని మాట యిచ్చేవాడు. ఆవిధంగా వారిలో కుతూహలాన్ని రేకెత్తించి తిరిగి వచ్చినపుడు ఏం చెపుతాడా అన్నకౌతుకంతో ఎదురు చూసేటట్టు చేసేవాడు. దేముడిని చూపిస్తానని చెప్పటం తన శిష్యులకి పోలయ్య యిచ్చిన వాగ్గానాలలో వాళ్ళని పట్టి ఉంచిన వాటిలో ఒకటి. ఆ కుటుంబంలో వయసు మీదబడిన తండ్రికి దేముడికి చూడాలన్న బలీయమైన కోరిక కలిగింది. అతనంటే అందరికీ గౌరవం. కొడుకులు తండ్రి కోరికని శ్రద్ధగా పట్టించుకున్నారు. వాళ్ళ పోలయ్యను సంప్రదించారు. అతను పదిహేను రూపాయలు ఇమ్మన్నాడు. వాళ్ళు ఇది చాలా ఎక్కువ అనుకున్నారు. ఆ తాంత్రిక రహస్యాన్ని సంపాదించుకోటానికి తాను ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నడీ మైనంలా కరిగిపోయేలా అద్భుతంగా వర్ణించాడు. తన ప్రయత్నాల ద్వారా ఆకుటుంబంలో ఒక్కరు దేముడిని చూడగలిగితే మొత్తం కుటుంబానికి నిస్సందేహంగా ముక్తి దొరుకుతుందని నొక్కి చెప్పాడు. చివరికి పోలయ్య పదకొండు రూపాయలకి ఒప్పకున్నాడు. ఆ ప్రయత్నం చేసే రాత్రి నిశ్చయమయింది. పదిమంది ఆడామగా దేముడిని చూడాలన్న కాంక్షతో విశ్వానంతో అర్ధరాత్రి వేళ ఉలూరి వారి ఇంటిలో కూర్చున్నారు. గోడకున్నగూటిలో రెండు చిన్న నూనె దీపం బుడు వెలుగుతున్నాయి. అక్కడ కొద్దిపాటి వెలుతురిని యిస్తున్నాయి. గురువు మధ్యలో కూర్చున్నాడు. శిష్యులు చుటూ వృత్తాకారంలోకూర్చున్నారు. నజరయ్య మతం తాలూకు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. అతని హడావుడి భయంకరంగా ఉంది. చూస్తున్న వాళ్ళంతా ఊపిరిబిగబట్టారు. కదలకుండా ఉండిపోయారు. చిట్టచివరికి ఆ క్షణం వచ్చేసింది. అందరినీ పొమ్మని సంజ్ఞ చేశాడు. ఆ ముసలతనిని మాత్రం కూర్చోమన్నాడు. మరిన్ని మంత్రాలు చదివాడు. మరిన్ని విచిత్రమైన బొమ్మలు గీశాడు. ముసలతను ముక్కుచెవులూ, కళ్ళ మీద అంతకు ముందు పోలయ్య చెప్పినట్టగా వేళ్ళ పెట్టుకున్నాడు. బాహిర ప్రపంచంతో ఆ విధంగా సంబంధాలు తెంచుకుని అంతరేంద్రీయంతో భగవంతుడిని చూడాలని అతనికి ఆర్థమయ్యింది. కొంత సమయం గడిచింది. పోలయ్యచెవిలో గొణిగాడు. నీకేమైనా కనిపిస్తోందా అని. "అంతా ఎర్రగా పచ్చగా కనిపిస్తోంది. మధ్యలో ఏదో మనిషి బొమ్మ ఉన్నట్టు కనిపిస్తోంది" అన్నాడు ముసిలతను, "అదే దేవుడు. నువ్వు చూశావు" అన్నాడు పోలయ్య ఆశ్చర్యంతో సంభ్రమంతో ముసిలాయన పిల్లలని కలిశాడు. మనవలు చుటూ ఆడుకుంటుండగా ఇంటి పట్టున కూర్చుని, అనేక రోజులు దాని గురించే ఆలోచించాడు. జనం వస్తున్నారు. వెళుతున్నారు. అంతా ఎలా కనిపించిందీ చెప్పలు కుడుతూ. కుడుతూ.N 754
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/56
స్వరూపం