ప్రస్తుతం చరిత్రకి ఉన్న నమూనాలలో మనం ఇతరుల కన్న అధికులమనే భావాన్ని రెచ్చగొట్టటానికే ఎక్కువ అవకాశం ఉంది. గతంలో తప్పిదాలు పునరావృతం కాకుండా మానవుడిని జాగరూకుడిని చేయవలసిన చరిత్రలో ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్న వారి గొంతు ప్రధాన స్రవంతి కాలేకపోయింది. ఈ పుస్తకంలో మనకి అంతగా తెలియని గతం ఉంది. అందులో కొంత మనకి మరీ అంత దూరంలో- కాలక్రమంలోలేదు. ఇటీవల మనం మన గతాలను తవ్వకునే పనిని భారీఎత్తున ఆరంభించాం. ఎందుకు మొదలైనా ప్రస్తుతం ఆ పని సాగుతోంది. కవిత్వానికి, కాల్పనిక సాహిత్యానికి ఉన్న నమూనాలలోనే చాలావరకు ఈ పని నడుస్తోంది. ఈ తవ్వకాలలో ప్రేరణా లక్ష్యమూ ఉద్వేగాలే అయినా ఇది చాలాకాలం సాగదు. ఈ పరిమితులనూ, నమూనాలను, ఉద్వేగాలను వదిలిపెట్టి గతం తవ్వకాలు భవిష్యత్సమాజపు ఆరోగ్యకర వ్యవస్థా నిర్మాణాలకు పనికొచ్చే విధంగా మన ప్రేరణలూ లక్ష్యాలూ మారే అవకాశం ఉందని నమ్ముతున్నాను - అలాంటి భవిష్యత్తులో సమాచారం కోసం ఈ పుస్తకం వినియోగపడవచ్చని నా ఊహ. అంతేకాదుఇందులో ఆనందయ్య కథ ఉంది: ఈ మాల పూజారుల విద్యావిధానమేమిటి? తెలుగు నేలమీద ఆంగ్ల విద్య అందించిన జీవికావసరాలను ఆనాటి "విద్యావంతులు' బ్రాహ్మణులు ఉపయోగించుకోగలిగినపుడు ఆనందయ్యలు వంటి విద్యావంతులు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? వారి రెండు విద్యల స్వభావాలలో తేడా ఉన్నదా? రెంటికీ సంస్కృతమే పునాదిలా కనిపిస్తున్నది గదా! ఇలాంటి ప్రశ్నలు మనకు కలుగుతాయి. బయట మనుషులుగా (Outsidersగా) మనం చేసుకున్న ఇలాంటి రికార్డ్స్ తప్ప లోపలి మనుషులుగా (Insidersగా) భారతీయులుగా, తెలుగువారిగా, ఒక ఊరు ప్రాంతపు వారిగా, ఒక కులస్తునిగా, తమ స్వానుభవాన్ని చెపుతున్న వానిగా మనం చేసుకున్న రికార్డ్స్ ఉన్నాయా? ఏమైనా పుస్తకాలు రాసుకున్నామా? చిట్టచివరగాఇలాంటి కొన్ని పుస్తకాలను ఆంగ్లేయులు వచ్చి వెళ్ళి మధ్యలో తెలుగునేల సాంఘిక జీవిత పార్యాల మీద ఏ కొద్దిపాటి వెలుతురు ప్రసరింపజేసేవయినా సేకరించి వాటిని తెనిగించి జనానికి అందుబాటులోకి తేవాలని మిత్రులు రాయుడు గారి ఆలోచనా, ప్రయత్నమూ ఈ పుస్తకం మనసు ఫౌండేషన్ ద్వారా వెలువడటంతో మొదలవుతున్నాయి. వీటిద్వారా ఆరోగ్యకరమైన అర్థవంతమైన చర్యలకూ ఆలోచనలకూ తెరతీయాలన్నది ఆశ ఈ పుస్తకాలను మనం సద్వినియోగం చేసుకోవాలన్న ఆకాంక్లతో. -వివినమూర్తి బెంగళూరు 16-2-2007. చెపలుకుడుతూ, కుడుతూ.N 7 v
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/5
స్వరూపం