Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2. ఆరుగురు గురువుల వరస పా శ్చాత్య నాగరికత భాషలో పల్లికూరి లక్ష్మయ్యని 'ఎ ఫాస్ట్ యంగ్మాన్' అని ఉండేవారు. చెవి పోగులు, కంకణాలు, నడుముకు పట్టీలతో వాటి విలువ కన్న మెరుగులతో అందరినీ ఆకటుకునే వాటితో, అలంకరించుకునేవాడు. ఎర్ర తలపాగ,తెల్లటి అంగీలు పెట్లో వాడకానికి సిద్ధంగా ఉండేవి. ఎక్కడ ఆట, పాట పండగ ఉన్నా అక్కడకి తిరుగుతుండేవాడు. పాపమూ కామమూ పెరిగిపోయాయి. అతని ఆత్మలో ఈ మొత్తం పరిస్థితి మీద విరక్తి కలిగేవరకూ అవి కొనసాగేయి. వీటితో విసుగెత్తి పోయాడు. ఎప్పడు వచ్చిందో ఒక ఆలోచన ఒక రోజు అతనికి కలిగింది. నేను చనిపోతే? ఆ సమయంలో యోగి వీరబ్రహ్మం సంచార శిష్యులలో ఒకరు ఆ ఊరికి వచ్చాడు. లక్ష్మయ్య ధృష్టి అతని మీదపడింది. అతని సంపాదన అంతా ఆ గురువుకి దక్షిణలు దానాలు యివ్వటంతో ఖర్చుపెట్టాడు. అతనికి ముక్తిమార్గాన్ని చూపించేది ఏదైనా కనుక్కోవాలనిపించింది. మరణానంతరం ఆత్మకి ఆనందమిచ్చేస్థితిని కోరుకున్నాడు. రోజులు గడిచాయి. అతనికి నిశ్చయమైనదేదీ ත්‍රිස්කයිපීඪ. සී. ඊශ්‍ය పొద్దుటే గురువు తన శిష్య బృందంతో మరోచోటకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి యింకొకరు వచ్చారు. లక్ష్మయ్య అతని చుటూ తిరిగాడు. గురువుకి తినబెట్టడంలో తనవంతు తను యిచ్చాడు. యిద్దరూ కలిసి తాగారు. దొర్గారు. కొన్ని నెలల తర్వాత అతనూ తన దోవన వెళ్ళిపోయాడు. తన జ్ఞానం ఏ మాత్రమూ పెరగలేదని లక్ష్మయ్యకి తెలిసింది. ఆ విధంగా ఆరుగురు గురువులనీ లక్ష్మయ్య కొందరినీ వారాలు, కొందరినీ నెలలూ పోషించాడు. మాదిగ సమాజంలో వదంతులు వ్యాపించాయి. శుభ్రమైన బట్టలు, అలంకారాల మీద ఆసక్తి పోయి రాజయోగి గురువుల పాదాల ముందు కూర్చుంటున్నాడని చెపుకోసాగారు. ఈ పరిస్థితిని వాడుకోటానికి చుట్టాలమని చెప్పకుంటూ ఒకరితర్వాత ఒకరు రాసాగారు, అతను దీక్ష తీసుకున్నప్పడు నేర్చుకున్న మంత్రాలు, శ్లోకాలు గురించి అడుగుతూ అతనికి అతిథులయారు. అప్పటికి ఉన్న గురువుకి పరిచయం చేయటం, వాళ్ళు అవీయివీ అడగటం తెలుసుకోవటం, అందరిలోనూ ఆసక్తి పెరగటం జరిగాయి. కొందరు స్నేహితులు మాటిమాటికి వచ్చేవారు. బంగారపు తాతయ్య కూడా ఒక్కోసారి వాళ్ళ మధ్య ఉండేవాడు. ముఖ్యంగా బండికట్ల వీరమ్మ వెళ్ళిపోయాక వీళ్ళదగ్గరకి వచ్చేవారు. వారందరి మధ్య ఓ సంఘిభావం ఏర్పడి కొన్నేళ్ళ నిలబడింది. ఈ బృందంలోని దాదాపు ప్రతి సభ్యుడూ తరువాత సంవత్సరాలలో Sść ప్రచారంలో బలమైన శక్తులుగా మారారు. ఏదైనా చిత్తశుద్ధి గల సత్యాన్వేషణ వృధా అవదు. సామాన్య మాదిగల మూఢనమ్మకాల నుంచి లక్ష్మయ్య అతని స్నేహితులూ పైకి ఎదిగారు. అంతకన్నా మెరుగైనదానిని ఆశించారు. అంటే చిన్నతనపు విశ్వాసాల నుంచి బయటపడ్డారు. ఆత్మకి కలిగే ఆకలిని తృప్తిపరుచుకోటానికి ప్రతీ ఒక్కడూ యోగి చెప్పినవన్నీ ప్రయత్నించాడు. ఎవరెవరు ఏం సాధించారో తెలుసుకోటానికి వారి మధ్య స్నేహమూ, ఏకఫలాపేక్షా వారిని కలుపుతూండేవి. ప్రతి ఒక్కడూ ఎవరి దోవలో వారు నిరాశచెందారు. ఒకరూ ఒకరూ తోలు వ్యాపారం కోసం ఉత్తరాదికి వెళ్ళారు. రెండు సంవత్సరాల పాటు గురువుగా ఉన్న బల్లి సోమయ్య దగ్గర లక్ష్మయ్య ఉండిపోయాడు. సోమయ్య శూద్రులతో కలిసి ఊళ్ళ ఉన్నప్పటికీ అతని ప్రధాన పోషకుడు లక్ష్మయ్య దాంతో అతని దగ్గర ఉన్నదంతా కరిగిపోసాగింది. అప్పల్లో పూర్తిగా మునిగిపోయాడు. అతనికి అప్ప యిస్తుండే కోమటి చక్రవడ్డీలు వసూలు చేసేవాడు. అతని స్నేహితులకీ సహా అన్వేషకులకీ యిచ్చిన ఉచిత ఆతిథ్యం ఖర్చు అతని ఆస్తిని మించిపోయింది. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఓ వదంతి వచ్చింది. వాళ్ళంతా ఉత్తరాదిని మళ్ళీ కూడారుట. ఇంగ్లీషు వాళ్ళ దేశం నుంచి వచ్చిన ఏదో మతం గురించి ලීෆාහත්‍රීටර්හබ්ඩුරාඩ්. లక్ష్మయ్య ఉత్తరాదికి వెళ్ళి నాలుగు పైసలు కనిపిస్తున్న తోలు వర్తకం చేసి అప్పలు తీర్చాలని నిశ్చయించుకున్నాడు. అయితే వదిలి వెళ్ళాలనుకొన్నా గురువు బల్లి సోమయ్యని ఏం చెయ్యాలి? నేనింక నిన్ను పోషించలేనంటే ప్రమాదం వస్తుందేమో చెప్పకుండా అతని కర్మకి అతనిని వదిలేసి వెళితే శపిస్తాదేమో? అన్న ప్రశ్నలు, రోజురోజుకి గురువు సోమయ్య ఉండటం ఇబ్బందికరంగా తయారయింది. చిట్టచివరికి అతన్ని వదిలించుకోవటానికి ఓ దారి దొరికింది. గురువు తాలుకు అన్నదమ్ములు ఉత్తరాది జిల్లాల్లో ఉంటున్నారని లక్ష్మయ్యకి తెలుసు. "నీ శిష్యులంతా ఉత్తరాదిన ఉన్నారు. బోల్టంత సంపాదిస్తున్నారు. నా అప్పలు పెరిగిపోయాయి. నేనూ వెళ్ళాలి. నువ్వూ నాతో వస్తే అక్కడ ఏదో ఆధారం నీకు దొరుకుతుంది." అని చెప్పాడు. అలా వారి ప్రయాణం ධීතාඨළුඨරයි. పాత శిష్యులు ఉంటున్న చిన్ని నివాసానికి వెళ్ళేసరికి, చెప్పలు కుడుతూ. కుడుతూ.N 744