Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాషిణీ! నువ్వ రుషిత్వానికి కావలసిన అన్ని అవరోధాలూ దాటావు. అన్ని నియమాలూ పాటించావు. బ్రహ్మనందం పొందావు" అన్నాడు. ఆమె రాముడిని ప్రస్తుతించింది. "నీ సాక్షాత్కారంతో నన్ను కరుణించావు. నా తపస్సు ఫలించింది." అంది. మాతంగారణ్యాన్ని అతనికి చూపించింది. పంపానదీ తీరంలోని అనేక వన్యఫలాలని ఆమె ఆయన కోసం ఏరింది. అవి అతను స్వీకరించాడు. ఆమె కృషి ఫలించింది. తన దేహాన్ని త్యజించి ఆ మహరుల సాంగత్యం కోసం నిరీక్షిస్తున్నాని తెలియజేసింది. ప్రసన్నమయిన రాముడు ఆనందంతో అన్నాడు. " ఓ శబరీ! నీ కోరిక సిద్ధించుగాక" ఆ విధంగా రామునిచేత అనుజ్ఞ పొంది శబరి అగ్నిప్రవేశం చేసింది. సాయుజ్యం ඕ“රයිටයි. వెనకటి కథతో పోలిస్తే ఈ కథలో కొంత సహనం కనిపిస్తుంది. దక్షిణభారతంలో ఆర్యరుషులు వలసలు ఏర్పరచుకుంటూ రాజీ మార్గాలను చేపడుతున్న కాలానికి చెందినవాడు మాతంగ రుషి ఆయన తన శిష్యులతో ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. కాని వారు ఎవరినీ అంటకుండా ముట్టకుండా నివశించలేదు. రాముడు వచ్చేవరకూ ఆశ్రమ బాధ్యతను ఒక పరియా &ܦܶ అప్పజెప్పి గౌరవించారు. బ్రాహ్మణ రుషులు ఆశించే స్వర్గాన్ని కోరుకోవటం నేర్పారు. తిరిగి కొన్ని వందల ఏళ్ళ అనంతరం మనకి పురాణాలలో ఈ ప్రసక్తి కనిపిస్తుంది. పురాణాలు రామాయణం తర్వాత కాలానివి. ఇందులో మాతంగి ప్రస్తావన నేరుగా లేదు. అయినా కాలం తీసుకువచ్చిన మార్పులు ఇది స్పష్టం చేస్తుంది. ఆర్యదేవతని పూజించటం ఆదివాసి హృదయాలను అంతగా ఆకర్షించలేదని గ్రహించారు. అయినా సరే వారి ధార్మిక భావాలను నియంత్రించాలని ఆశించారు. అన్నింటిలోనూ దేవుళ్ళను చూచే ఆర్యుల విధానంలో తక్కువ రకం దేవుడు శివుడికి ద్రవిడుల దేవుళ్ళలో చూడానుకొనే ముఖ్యగుణాలన్నీ క్రమంగా ఆపాదించారు. ఇది శతాబ్దాల కాలంలో రూపొం దింది. శక్తిపూజ శివుని అర్ధాంగి పార్వతి రూపంలో ప్రకటిత మయింది. ఆమె అనేక రూపాలలో ఈనాడు పూజించబడు తోంది. అందులో మాతంగి ఒక రూపం, వలవిసు పురాణంలో ఈ గాథ కనిపిస్తుంది. పార్వతీ, ఆమె కుమారుడు కార్తికేయుడూ ఒక చెప్పగూడని రహస్యాన్ని బయటపెట్టారు. దానికి శిక్షగా వాళ్ళ అనంతమైన జన్మలు ఎత్తాలి. శిక్షను ఒకే ఒక జన్మగా మార్చమని పార్వతి వేడు కొంది. ఆమె కోరిక అంగీకరించబడింది. అదే సమయానికి పరవలరాజు త్రయం బళ అతని రాణి వరుణవల్లిబిడ్డలకోసం వ్రతాలు చేస్తున్నారు. నోములు నోస్తున్నారు. పార్వతి ఆ దంపతులకి బిడ్డగా పుట్టింది. ఆమె పేరు తిరిసేరు మదంతే. పార్వతి కొడుకు బ్రహ్మాండమైన చేపగా పట్టి సముద్రంలో విహరిస్తున్నాడు. దక్షిణం వైపుగా ఈదుతూ వెళ్ళి పరవల చేపల పడవల మీద దాడి చేశాడు. వాళ్ళ వ్యాపారాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆ చేపని పట్టుకున్న వాళ్ళకి తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేస్తానని రాజు ప్రకటించాడు. శివుడు పరవ రూపం ధరించి, ఆ చేపని పట్టుకొని తన భార్యను తిరిగి కలుసుకున్నాడు. ఆదివాసీలకు శివపార్వతులను దగ్గరచేసే ప్రయత్నమే ఈ గాథ. ఈనాటి తమిళ జాలరి తెగలలో పరవలు మొదటి తరగతివారు ఒకప్పడు బలమైనవారు. రాజ్యాలు ఏలారు. ఎల్లమ్మ గాథలో ఆర్యదేవతల పక్కనే ఈ ఆదివాసీ సంప్రదాయం ఉండటాన్ని వివరించేందుకు బ్రాహ్మణులు మరింత విపులమైన ప్రయత్నం చేశారు. ఆర్యుల భావనలో ప్రత్యేకంగా సృష్టించబడిన దేవుడు విష్ణువు. పరశురాముని రూపంలో ఎల్లమ్మ కొడుకుగా అవతారం ధరిస్తాడు. శైవ వైష్ణవాల సంగమం ఎల్లమ్మ రూపంలో కనిపిస్తుంది. ఆమె శివుని భార్య పార్వతి అంశ, విష్ణువు అవతారాలలో ఒకరికి తల్లి, ఎల్లమ్మ ఒక బ్రాహ్మణుని కూతురు. బాల్యం నుంచీ చాలా పవిత్రంగా జీవించడం వల్ల ఒక గొప్ప రుషి ఆమెను వివాహమాడాడు. ఆమెకి పరుశురాముడు మరి ముగ్గురు బిడ్డలు కలిగారు. ఆమె పాతివ్రత్య బలంతో భర్త యజ్ఞం కోసం కావేరీ నదీ జలాలను పెద్ద బంతులు చేసి దొర్లించేది. ఒకరోజు ఆమె దొర్లిస్తున్ననీటి బంతి మీద ఒక నీడ పడింది. పైకి చూసింది. ఆకాశంలో వెళుతున్న ఆమెకు గంధర్వులు కనిపించారు. వారి అందానికి ఆమె చకితురాలయింది, మరున టిరోజు జలం దొర్లటానికి నిరాకరించింది. "నువ్వెందుకు నీళ్ళ దొర్లించలేకపోతున్నావు?" అని రుషి అడిగాడు. "నిన్న నీటిమీద ఓ నీడను చూసాను. పైకి చూస్తే ఆకాశంలో వెళుతున్న గంధర్వులు కనిపించారు. ఇంతకు మించి నేనేపాపము ఎరుగను" అంది. “నువ్వునీ పాతివ్రత్యం కోల్పోయావు. పతివ్రతలు పైకి చూడరు. గంధర్వులను చూసి చకితులవరు" అన్నాడు రుషి. తన కొడుకులను పిలిచి ఆమె తల నరకమన్నాడు. "ఆమె మాతల్లి, మేం ఎలా నరకగలం?" అన్నారు వారు. పరుశురాముడు ఒక్కడే అంగీకరించాడు. తల్లిని వెదికి తెమ్మని పంపించాడు. ఆవిడ పరియాలను శరణు కోరింది. పరుశురాముడికి అప్పగించటానికి వారు తిరస్కరించారు. పరుశురాముడు పరియాలు అందరినీ చంపేశాడు. తల్లి తల చెపలుకుడుతూ, కుడుతూ.N 733