3. గాథలలో కథలలో మాతంగి మా సంప్రదాయం గురించి మాదిగలు చెప్ప గలిగినదంతా సేకరించాను. తంతులు, ఆచా రాలు అర్ధం చేసుకోటానికి, ఈ సంప్రదాయం ప్రాచీనతకు తిరుగులేని సాక్ష్యం కోసం గ్రంథాలు తిరగేసాను. ప్రొఫెసర్ విల్సన్, సర్ మోనియర్ విలియమ్స్ ఇద్దరూ శక్తిరూపాల జాబితా యిచ్చారు. వారి ప్రకారం ఆ పేర్లు 'కాళి, తార, పోదశి, భువనేశ్వరి, భైరవి, చిన్న మస్తక, ధనపతి, వగల, మాతంగి (అంటే భంగీ కులానికి చెందిన స్త్రీ) కమలతిక వీటిలో ఎల్లమ్మ పేరు వదిలేశారు. మాతంగికి పది గొప్ప శక్తులలో స్థానం లభించింది. నేను సేకరించిన సమాచారంతో ఇదిసరిపోదు, ఎందుకంటే ఇవన్నీ దక్షిణ భారతానికి కాకుండా ఉత్తర భారతానికి సంబంధించిన పేర్లయి ఉండొచ్చు. దక్షిణ భారతదేవతలకి సంబంధించిన మరో పుస్తకంలో శక్తులకు సంబంధించి మరో జాబితా కనిపిస్తుంది. 'మారియమ్మ, ఎల్లమ్మ, అంకాళమ్మ భద్రకాళి, ఏదరి, చాముండి దుర్గ, పరడై, పదకలై, గొప్ప శక్తులలో స్థానం ఎల్లమ్మకి యిక్కడ లభించింది. ఇందులో మాతంగికి స్థానం లేకపోవటానికి కారణం ఆమె ఇందులో ఉన్న ఒకే ఒక పరియా కావటమూ అప్పడప్పడూ ఆమెను ఎల్లమ్మ ఆవహించటమూనూ. కొంతవరకూ తిరుగులేని సాక్ష్యాన్ని నాకు యిచ్చిన రచయిత డెన్మార్క్ మిషనరీ జీగెన్బగ్ 1713లో ఆయన 'ది గాడ్స్ ఆఫ్ మలబార్ రాసి జర్మనికి ప్రచురణకు పంపాడు. ఆయన పుస్తకాన్నివారు ప్రచురించమని చెప్పారు. ఆయనని భారతదేశానికి పంపినది 'విగ్రహారాధనను పెకిలించి వేయటానికే గాని, ఆ చెత్తను తీసుకెవెళ్ళి యూరప్లో వ్యాపింప చేయటానికి కాదు" అన్నారు. ఆ గొప్ప మిషనరీ మహా పండితుడు. 1867 వరకూ ఆయన పుస్తకం ప్రచురణ కాలేదు. తెలుసుకోదలచిన వాడికి మరెక్కడా దొరకని సమాచారం ఆ పుస్తకంలో එඩීහූරයි. మాతంగి సంప్రదాయానికి వివరణ నాకు ఎక్కడా దొరకలేదు. కాని అనేక గ్రంధాలలో ఈ పేరు కనిపిస్తుంది. ఒక విధంగా ఇదే ఒక కొండ గుర్తులా పనికొస్తుంది. చుట్టు ప్రక్కల పరిస్థితులన్నీ ఒకే విధంగా ఉండటం వల్ల ఈ పేరు తిరిగి తిరిగి ప్రస్తావించబడటం చాలావరకూ తృప్తినిస్తుంది. మాతంగ అన్న పురుష నామమూ మాతంగి అన్న స్త్రీ నామమూ కనిపించినప్పడల్లా ఒక మత అభిలాష దాంతో బూటు చండాల అంశం కనబడతాయి. మహాభారతంలో మొట్టమొదటిసారి మాతంగి అన్నపేరు కనబడుతుంది. ఈ సంస్కృత ఇతిహాసానికి స్పష్టమైన కాలనిర్ణయం చేయటం సాధ్యం కాదు. ఇందులో కొన్ని భాగాలు అత్యంత పురాతనమైనవి. మాతంగ మహర్షి సంప్రదాయం బహుశా ఆ పురాతన భాగాలకి చెందిన దయింటుంది. తక్కువ పుట్టుకకు చెందిన భారతదేశపు పురాతన ప్రసిద్ధ ఋషులు కొంతమందిలో ఆయన ఒకడు. మాతంగుడు తనను తాను బ్రాహ్మణ తల్లిదండ్రులకు పట్టాననుకుంటాడు. ఓ రోజు ఏదోలా అతని జన్మరహస్యం తెలుస్తుంది. గాడిదల బండిలో ప్రయాణం చేస్తున్నాడు. అవి నెమ్మదిగా నడుస్తున్నాయి. అసహనంతో అతను ఓ గాడిదను కొట్టాడు. ఆడ గాడిద "బండిలో ఉన్నది చండాలుడు. అతని క్రూర ప్రవర్తన అతని జన్మని తెలియబరుస్తోంది" అంది. మాతంగుడు అది విన్నాడు. వెంటనే తన పుట్టకను తెలియజెప్పమని ఆడగాడిదను అడిగాడు. తల్లి బ్రాహ్మణు రాలని, తండ్రి చండాలుడని తెలుస్తుంది. ఏమైనా బ్రాహ్మణ త్వాన్ని పొందాలని మాతంగుడు తపస్సు ఆరంభించాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయాడు. చండాలునికి పట్టావు గనుక నీకు అంత ఉన్నతస్థానం లభించదని అతని కోరికను నిరాకరించాడు. వంద ఏళ్ళ తపస్సు ఫలించలేదు. కాలిబొటన వేలిమీద నిలబడి మరో వంద సంవత్సరాలు తపస్సు చేశాడు. కామరూప శక్తిని (కోరిన రూపం ధరించే శక్తి) ఆకాశ గమనాన్ని (పక్షిలా ఆకాశంలో విహరించే) శక్తిని (కోరిన రూపం ధరించే శక్తి) ఆకాశ గమనాన్ని (పక్షిలా ఆకాశంలో విహరించే) శక్తినీ యిచ్చేటంతగా ఇంద్రుడు ప్రసన్నమయాడు. ఈ గాథ స్వచ్ఛమైన బ్రాహ్మణపుట్టుకలేని వారిని బహిష్కరించే బ్రాహ్మణ వారసత్వపు పట్టని సూచిస్తుంది. శతాబ్దాలు గడిచాయి. మనం తిరిగి ఒక మాతంగ రుషిని చూస్తాం, అత్యంత ప్రాచీనమైన భారతీయ ఇతిహాసం రామాయణంలో ప్రస్తావిస్తారు. ఆ ఇతిహాస కధానాయకుడు రాముడు దండకారణ్యంలోకి ప్రవేశించినపుడు మాతంగ మహర్షిగురించి వివరిస్తారు. “చివరకు ఏనుగులైనా, ఎన్నున్నప్పటికి ఆశ్రమ సరిహద్దులను దాటవు" మాతంగుదు అతని శిష్యులూ స్వర్గానికి విమానాలలో వెళ్ళిపోయారు. "శబరి పేరుగల ప్రసిద్ధ సన్యాసిని రాముని రాకకోసం నిరీక్షించమని వెళ్లేముందు ఆదేశించారు. ఆయన రాకతోనే ఆమెకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందని చెప్పారు. రాముడు వస్తాడు. ఆ స్త్రీ సన్యాసినితో మాట్లాడతాడు. జడలు కట్టిన జుత్తుతో, చినిగిన బట్టలతో, తొడుగులా ఉన్న చర్మంతో ఆమె ఆయన ముందు నిలబడుతుంది. "మృదు చెపలుకుడుతూ, కుడుతూ.N 732
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/32
స్వరూపం