Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంచారు. మూడో దానిలో కొత్త మాతంగిని కూర్చోబెట్టారు. ప్రతీ మూలలోనూ ఒక చిన్ని కుండను ఉంచారు. దానిమీద కాషాయం, ఎరుపు చుక్కలు పెట్టారు. వాటిని మజ్జగతో నింపారు. వాటికి తాళ్ళ కట్టి పైకీ కిందకీ పక్కలకీ నాలుగుసార్లు తిప్పారు.

ఈ ప్రారంభపు పనులు ముగిశాక, జైనూరుడు ఎల్లమ్మ కథను తన వాయిద్యంతో అందుకున్నాడు. ఆ స్త్రి మీదకి అవాహన జరిగింది. కానీ ఆమె లేవలేదు. ఆడలేదు. ఆమె అలాగే కూర్చుని అంతా తనలోనే ఉంచుకోవాలి. ఆమె అలా చేయలేకపోతే ఆమెకు అర్హత ఉండదు. ఆమె కదిలితే పైనుంచి వేలాడుతున్న చల్లకుండలు పగిలి చల్లకారిపోతుంది. ఈ లోగా బైనూరుడు శాంత వచనాలు చెపుతూంటే ఆవాహన నెమ్మదిగా దిగిపోతుంది. 

జనం గుంపులుగా చేరి చూశారు. కొత్త మాతంగి పరీక్షకి నిలబడి తన స్థానాన్ని హుందాగా నడపగలనని రుజువు చేశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి వృద్ద మాతంగిలా ఆమెని అలంకరించారు. కొత్త బట్టలు కట్టారు. మెడలో వేపాకుల దండ వేశారు. ఆమె స్థానానికి గుర్తింపుగా ఆమె ఎడం చేత ఒక తట్ట ఉంచారు. కుడిచేతిలో ఒక కర్ర ఉంచారు. రెండు మూకుళ్ళలో ఒకదాన్లో పసుపు ఇంకోదాన్లో కుంకుమ వేశారు. ఆ రెండూ ఆమెకు సహాయకురాలైన ఒక ఆడమనిషి పట్టుకుంది. అందరి మధ్య నిలబడింది. మజ్ఞగను నోట్లో తీసుకుంది. వేప మండలమీద దాన్ని వేసింది. అది అక్కడ నించున్న వారందరి మీద జల్లింది. మాతంగి స్పర్శకి కూడా శక్తి ఉందనుకోవటం వల్ల అలా జల్లబడిన వారందరూ ప్రక్షాళితులవుతారని శుద్ధి చెందుతారని నమ్మకం. ఆ రాత్రి రెడ్డి భార్య కొత్త మాతంగి మేక మీద కలిసి కూర్చున్నాడు. తిరిగి పాముని పూజించారు. ఆ తర్వాత రోజు పెద్దసంతర్పణ జరిగింది.

ఆ తర్వాత కొత్త మాతంగి భర్తతో కలిసి చుట్టుపక్కల ఊళ్ళలో మాతంగి గుడి సంబరాలు జరిపించింది. ఆమె భర్తచాలా గౌరవంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే పురుషులు ఎవ్వరూ మాతంగి స్థానాన్ని సంపాదించుకోలేరు.

నాతో చెప్పిన మాతంగి ఉపదేశం కథ అది. మాతంగి సంప్రదాయం గాథలు గురించి నేను ఆరా తీశాను. ఒక గాధలో కొంత కొత్త సమాచారం లభించింది.

ఒకానొకప్పుడు ఓ రాజు ఉండేవాడు. అతని పేర దుందగేరి రాజు, ఆయన భార్య జమీలాదేవి. ఓ రోజు ఆయన కొలువుతీరి ఉన్నప్పడు ఒక అందమైన కన్య ప్రత్యక్షమయింది. ఆమె శివుని భార్య పార్వతీదేవి అవతారం. రాజు తన కుడిచేతిని చాచి అందుకోబోతే ఆమె దూరమయిపోయింది.ఆయనా ఆ ప్రజలూ ఆమెని వెతుక్కుంటూ వెళితే ఆమె సూక్ష్మరూపం ధరించి ఒక చీమల పుట్టలో దూరి మాయమయిపోయింది. రాజు తవ్వే వాళ్లను పిలిపించాడు. అనేక బహుమానాలిస్తానన్నాడు. వాళ్ళు తవ్వటం ఆరంభించారు. చీమలపుట్ట రాయిలా ఉందని తెలుసుకున్నారు. రాజు రాళ్ళ కొట్టేవాళ్ళని పిలిపించాడు. రాణి వాళ్ళకు యింకా పెద్ద బహుమానాలు ప్రకటించింది. వాళ్ళ వల్ల కూడా పని జరగలేదు. రాజుకి కోపం వచ్చింది. తన ఈటెను తీసాడు. దానితో చీమలపుట్టలో పొడిచాడు. ఆ ఈటె ఆ కన్య తలని చేర్చేసింది. రాజు ఈటెను బయటకు లాగాడు. ఆ పిల్ల మెదడు బయటకు వచ్చింది. రక్తం ప్రవహించింది. రాజు అతని అనుచరులూ దాన్ని చూసి మూర్చపోయారు.

ఆపిల్ల చీమల పుట్ట నుంచి విశ్వరూపంతో బయటకు వచ్చింది. ఆమె ఎడమచేతితో ఆకాశాన్ని పట్టుకుంది (ఈనాడు తట్ట దానికి గుర్తు) కుడి చేత్తో ఆదిశేషుడిని పట్టుకుంది. (కర్ర ఈ రోజు పాముకి బదులయింది) సూర్యచంద్రులను పళ్ళాలుగా పట్టుకుంది. ఒకదాన్లో చిందిన రకాన్ని యింకో దాన్లో ముక్కలయిన మెదడుని ఉంచింది. మూర్చలో ఉన్న జనం నుదురులమీద మెదడుతో ఒక బొట్ట, రక్తంతో మరొ బొట్ట పెట్టింది. కాబట్టి ఈ రోజు మాతంగికి రెండు పళ్ళాలున్నాయి. ఒకదాన్లో పసుపు ఒకదానిలో కుంకుమ వాటితో ఆమె జనం నుదుట బొట్లపెడుతుంది. ఆమె బొట్ల పెట్టాక మూర్చలో ఉన్న వాళ్ళంతా తేరుకున్నారు. కన్య రూపంలోని దేవతను చూసారు. రాజూ రాణి ఆమెనీ తమ యుంట్లోకి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఆమె జమదగ్ని మహర్షిని వివాహమాడి అయిదుగురు బిడ్డలను కంది.
వూతంగి సంప్రదాయాన్ని శక్తి పూజలో ఒక భాగమనుకోవటం సబబే కాని దాని ప్రాధాన్యతను అది పూర్తిగా వివరించదు. శక్తిత్వం (శాక్లేయం) ప్రకృతిలోని స్త్రీ శక్తిని ఆరాధించడం. దానికి వివిధ రూపాలు ఉన్నాయి. అయినా అన్నీ శివుని అరాంగి పార్వతి నుంచే ఆరంభమవుతాయి. దీన్ని కేవలం ఆర్యుల నుంచే ఆరంభమయిందనలేం. రుగ్వేద శ్లోకాలలో భూమ్యాకాశాల సంగమంతో ముడిపెట్టలేం. స్త్రి ఆరాధన సూత్రం లక్షణాలు ప్రత్యేకించి స్మితియన్ మూలాలవే అని చెప్పలేం. ప్రకృతి ఆరాధనలో ఒక అంతర్గత భాగంగా ఉండే ఇటువంటి వూజారూపం కనుమరుగవుతున్న అనేక జాతులలో కనిపిస్తుంది. మాతృస్వామ్య వ్యవస్థ నాటి పురాతన మాతృపూజలోనే ఈ మాతంగి సంప్రదాయానికి వేళ్ళ ఉన్నాయి. ఈనాటి శాక్లేయంలో ఆనాటి మతకాండలు కొన్ని