Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాహసించి బహిరంగంగా ఆహ్వానం పంపితే దాన్ని తీసుకువచ్చినవాడు కోపగించిన మాదిగల చేతుల్లో తన్నులు ඊරඩ්”ඨ. మాదిగలు తనని చూసే అవకాశంలేని సమయం కోసం కోమటి నిరీక్షిస్తాడు. ధాన్యం కొలిచే ఇనుప పాత్రను తీసుకుని మాదిగవాడకు వెళతాడు. ఏదో ఓ యింటి వెనుక దాక్యుని పాత్రలో (కుంచంలో) నెమ్మదిగా గొణుగుతాడు. చిన్నవాళ్ళ ఇంట్లో (కోమట్ల) పెళ్ళవుతోంది. పెద్దింటి వాళ్ళ (మాదిగలు) లాూలి' కాని ఇది సరిపోదు. వివాహ సంబరానికి ముందు చేసే నిప్ప మాదిగ యింటి నుంచి వచ్చి తీరాలి. అడిగితే ఖచ్చితంగా తిరస్కరిస్తారు. మాదిగవాడలో ఈ కోరిక విన్నప్పుడు వారికి కోపం రావచ్చు ఏదో విధంగా పథకం వేసి, మాదీగలు నిరాకరించినా దొంగతనమైనా చేసి ఆచారం ప్రకారం వాళ్ళింటి నుంచే నిప్ప తేవాలి. ఈ ఆచారాల వెనుక ఏదో కారణం ఉండాలి. మాదిగలు వలసపోయిన ఎంతో దూరంగా దక్షిణంగా ఉన్న మైసూరు రాష్ట్రంలో కూడా మేజర్ మెకంజీ ఈ ఆచారాన్ని గమనించాడు. ఈ రెండు విభిన్నకులాలమధ్యసంబంధానికి పునాది మాదిగలు కోమట్ల ఒకే దేవతను పూజించటంటో ఉందని ఆయన అంటాడు. కోమట్ల కులదేవతగా కన్యిక అమ్మవారిని పూజిస్తారు. మరో కులానికి చెందినవాడవటం వల్ల ఒక రాజకుమారిడిని పెళ్లాడ్డం కన్న తన్ను తాను ఆత్మాహుతి చేసుకోవాలని కన్యక నిశ్చయించుకుంటుంది. వివాహాలప్పడు ఆమె దేవాలయం నుంచి ఒక పాత్రలో నీరు నింపి తీసుకువచ్చి ఇంట్లో మూలాస్థానంలో ఉంచి కన్యకగా పూజిస్తారు. మాదిగలు కన్యకను తమ దేవత అంటారు. మాతంగిగా కొలుస్తారు. కోమట్ల తీసుకువెళ్ళిపోవటాన్ని నిరాకరిస్తారు. ఇది నిస్సందేహంగా ఆ రెండు కులాలమధ్య సంబంధానికి కేవలం సామాజిక ఆచారాలే కాదు. ఒకేవిధమైన మత సంబంధాలకు కూడా నిదర్శనం. ఈ విషయాన్ని కొంచెం వివరించే కొంచెం వివరించే ఒక పురాణగాధ విన్నాను. అది ఒక కోమటి నాతో చెప్పాడు. అనేక భారతీయ గాథల్లాగే ఇందులోనూ అసంభవమైన అంశాలు ఉన్నాయి. పూర్వం ఒకప్పడు కుల కట్టబాట్లకు విరుద్ధంగా ఒక బ్రాహ్మణుడు ఒక మాదిగ స్త్రీతో ఉండేవాడు. అతనికి మంత్రాలు మాయలూ వచ్చు. అతను తన మాయ ద్వారా పగలు ఒక గేదెరూపంలోనూ, రాత్రిస్త్రీగానూ మార్చేవాడు. వాళ్ళకి పదకొండు మంది పిల్లలు కలిగారు. ఒకరోజు బ్రాహ్మణుడు పనిమీద బయటకు వెళ్ళారు. పిల్లలని పిలిచి గేదెని వాళ్ళకి అప్పగించి దాని కట్టుతాడు. విప్పి పొలాల్లోకి మేతకి తీసుకువెళ్ళమన్నాడు. ప్రతిరోజు జరిగే ఈ మార్పిడి గురించి పిల్లలకు తెలియదు. దాన్ని మేతకి తీసుకువెళ్ళారు. అది వాళ్ళ ఇష్టప్రకారం నడవకపోతే కర్రతో కొట్టారు. కాని గేదె ముసిలిది నీరసంగా ఉంది. అది కిందపడి చనిపోయింది. తండ్రి ఇంటికి వచ్చాడు. గేదె చనిపోయిందని పిల్లలు చెప్పారు. ఎలా చనిపోయిందని అడిగాడు. ఆ తర్వాత'అయ్యయ్యో- ఆ గేదే మీ తల్లిరా. మీ పాపానికి ప్రాయశ్చిత్తంగా వెళ్ళి ఆ గేదెను కోసి తినండి" అన్నాడు. ఈ పిల్లలకి కోమట్ల వారసులుట. సంవత్సరానికి ఓసారి కోమట్ల వరిపిండితో నాలుగు కాళ్ళ జంతువు రూపాన్ని గేదెకి చిహ్నంగా చేస్తారు. కుటుంబంలోని ప్రతీవారూ కొంచెం కొంచెం దాన్ని తింటారు. ఈ పండగని 'నబశనిముద్ద అంటారు. ఆ గాథకీ ఈ ఇంటి పండగకీ ఏదో సాధారణాంశం ఉంది. కోమట్లు రెండు వంశాల కలయిక వాళ్ళ కావటం అసాధ్యం కాదు. వాళ్ళ సమాచారం కోసం మాన్యూల్ ఆఫ్ అడ్మినిస్టేషన్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ"లో వెదికాను. వాళ్ళ ఉత్తరంగా ఏదో స్థలం నుంచి వలస వచ్చినట్లు చెప్పటం కనిపిస్తుంది, కొందరు అధికారులు పెనుకొండ అంటారు. అది విజయనగర సామ్రాజ్యంలో ఒక ముఖ్య ప్రదేశం. వాళ్ళ వచ్చిన ప్రాంతం గుఇరంచి ఎన్నో సందేహాలున్నావాళ్ళ పూర్వ ఫ్రాంతం ఖచ్చితంగా తెలియదు. వాళ్ళ వర్తక కులాలన్నింటి లోనూ స్వచ్ఛమైన వైశ్యులమని చెప్పకుంటారు. అనేక వంశాలుగా విడిపోయి ఉన్నారు. కోమట్ల గాని, మాదిగలు గాని తమ మధ్య సంబంధానికి సంతోషించరు. అయినా ఇది ఇంతకాలం నిలబడటం విచిత్రం. 攀 చెపలుకుడుతూ, కుడుతూ.N 724