Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజకుమారుడు ఉత్తమ కులాన్ని పొందిన ఆ కన్యను పరిణయమాడాడు. బ్రాహ్మణీయ కల్పనలతో అతిశయోక్తులతో నిండిపోయిన ఈ కథలలో నిజజీవితం అనిపించే సూచనలు లేకుండా పోలేదు. ఆర్యులకుండే రాజు అనే భావనకీ ఆదివాసుల తెగ నాయకునికీ మధ్య తేడాను మృగాంకదత్తరాజు అర్ధం చేసుకున్నట్లు లేదు. అందుకే అడవిలో జంతువుల్లా బ్రతుకుతున్నా మానవులలో ఎవరినో ఒకరిని రాజుగా గుర్తించే కోరిక ఉంటుందంటాడు. దుర్గ పిశాచ రాజుకి ఆర్యరాజుల్లా వన్నులు వేయటానికి జీవన్మరణ విషయాలను నిర్ణయించటానికి, ఏకాంత వైభోగంలో జీవించటానికి అధికారంలేదు. మాతంగ తెగకి నాయకునిగా బహుశా బోల్టంత భూమి, నౌకరు తగినంత ఆదాయం ఉండి ఉంటుంది. యుద్ధరంగంలో అతడు తన తెగని నడిపిస్తాడు. పరిపాలనా విషయాలతో కుటుంబ పెద్దలని సంప్రదిస్తాడు. దుర్గ పిశాచరాజు బ్రాహ్మణీయ విశ్వాసంతోకొంతవరకూ అసహజంగా బూటకంగా చూపించబడినా, మాదిగల పితామహుడు ఆదిజాంబవని పోలికలు కనిపిస్తాయి. * చెపలుకుడుతూ, కుడుతూ.N 78