ద్రవిడులు స్మితియన్ జాతివారని ఆయన వాదిస్తారు. ఏమైనా ద్రవిడుల జాతి మూలాలు పూర్తిగా నిర్ధారించబడలేదు. ఇండో ఆర్యులు శుద్ధంగా కాకేషియన్ జాతివారని పండితులు అంగీకరించారు. బహుశా క్రీ.పూ 3000 ప్రాంతంలో ఇండో జర్మన్ జాతిలో సంస్కృతం మాట్లాడే ఒక శాఖ ఉత్తరం నుండి భారతదేశంలో ప్రవేశించారు. ఉత్తర భారతంలో యుద్దాలు, దండయాత్రలు వారిని ముందుకు నడిపాయి. పురాతన ఋషులు ఋగ్వేద శ్లోకాలలో వేదాలలోని యుద్ధదేవుడిని 2ელy9 ਹੇ -'ఓ ఇంద్రా! నీ ఆయుధం మాటలేని దస్యులను ఛేదించుగాక! సరిగ్గా మాట్లాడలేని ప్రజలను యుద్ధంలో వధించుగాక." ఆ తరువాత కాలంలో ఇండో-ఆర్యలు దక్షిణంగా వెళ్ళడం మొదలయినపుడు వారి చేతుల్లో ఆయుధాలు లేవు, పెదాలపై ఇంద్రునికి ప్రార్థనలు లేవు. వాళ్ళు శాంతి జితులను ఉపయోగించారు. ఆర్య ఋషులు దక్షిణపు అరణ్యాలలో నివాసం ఏర్పరచుకున్నారు. ద్రవిడులకి శిక్షకులుగా, స్నేహితులుగా అయారు. పురాతన ద్రవిడుల గురించి తెలుసుకోటానికి ఈ ఆర్య ద్రవిడ సంబంధాలకు ముందు ఎలాంటి ఆధారాలు లేవు. ద్రవిడులకు గల అనేక వనరుల కారణంగా గర్విష్ణులైన ఆర్యులు వారిని నిర్లక్ష్యం చేయలేకపోవటమన్నది సందేహాతీతమైనది. అపారమైన సంపద ఉంది. భద్రమైన నగరాలలో నివశిస్తున్నారు. ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు. రాజులు పరిపాలిస్తున్నారు. అంతస్సంబంధాలు గల నాలుగు భాషలను ధ్రవిడులు మాట్లాడేవారు, అవి తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం. ఆర్యుల ప్రభావం పదకముందు వారికి సాహిత్యం ఉందా అన్నది సందేహాస్పదం. శుద్ధమైన భావాలలో వారు వెనకబడి ఉండవచ్చుగాని, మిగిలిన అన్ని రకాల భావాలను వ్యక్తీకరించ టానికి తగినన్ని సాధనాలు వారి భాషలకు ఉన్నాయి. వారు అనుభవంమీద ఆధారపడ్డ ప్రజలు. వలస వచ్చిన ఆర్యులు ద్రవిడ భాషలను నేర్చుకోవలసి వచ్చింది. స్థానిక భాషలలో సంస్కృతపదాలను ప్రవేశపెట్టడంతో తృప్తిపడవలసి వచ్చింది. ఈ రెండు జాతుల సామాజిక వ్యవస్థలలో చాలా అంతరం ఉంది. ఉత్తరాదికి చెందిన ఆర్యులు దక్షిణాది వలసలు ఆరంభించకముందే కుల వ్యవస్థ ఆర్యులలో పాదుకొంది. హెచ్చుతగ్గులకు సంబంధించి ద్రవిడులకు తెలిసిన భేధం ఒక్కటే, పాలకులు, ప్రజలు. ఈ భేదం అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉన్నదే. బలమై బ్రాహ్మణ వారసత్యం ఆర్యలదైతే ద్రవిడుల పూజారులు స్వతస్సిద్ధంగా తమ మంత్ర తంత్రాలతో అందరి మన్ననలనూ పొందినవారు. ఆర్యులు చనిపోయిన వారిని దహనం చేసేవారు. విధవలలో పునర్వివాహం నిషేధించారు. మాంసాహారాన్ని రక్తం చిందటాన్ని అసహ్యించుకునేవారు. అందుకు బదులుగా ద్రవిడులు చనిపోయినవారిని ఖననం చేసేవారు, విధవలు పునర్వివాహం చేసుకొనేవారు. అన్ని రకాల మాంసాలు తినేవారు. రక్తం చిందకుండా, మద్యం విరివిరిగా వాడకుండా వారి పండగలు జరిగేవికావు. ఈ రెండు జాతులూ కలుసుకున్న కొత్తలో వారి ధార్మిక విధానాలలో శతృత్వం ఉండి ఉండవచ్చు. కొత్తగా నివాసాలు ఏర్పరచుకొన్న బ్రాహ్మణీయులు అతిశయోక్తులు నిండిన ప్రాచీనభాషలో ఈనేక నిందలు వేశారు. " ఆస్తికులు సర్వసంగ పరిత్యాగులు అయిన ఋషుల చెవులలో భయంకరమైన శబ్దాలు చేసిన అవిశ్వాసులైన ప్రాణులు అన్నారు. ఆశ్రమ ప్రాంతాలలోని దట్టమైన అడవులలో దాక్కుని ఈ భయానకమైన ప్రాణులు భక్తులను భయపెట్టడంలో ఆనందించేవారు యజ్ఞాలు చేసేటప్పడు వచ్చేవారు, భాండాలని, పుష్పాలని, సమిధలని ఎత్తుకుపోయేవారు. యజ్ఞ సామాగ్రిని మైలపరిచేవారు. రక్తంతో ఆహారాలను ప్రసాదాలను కలుషితం చేసేవారు- అన్నారు. తెగలు, జాతుల కలయిక, సంప్రదాయాలు మత పద్ధతుల సమ్మిశ్రణంతో కూడిన ఆధునిక హిందూత్వానికి అది శైశవ దశ, అప్పుడు మాదిగలు వారి వంతు వారు అనుభవించారు. వారి మాతంగి సంప్రదాయంతో వారు బాగా వెనుకబడి పోయారు. వృత్తి ద్వారా చర్మకారులైన మాదిగలు అస్పృశ్య (పరియా) తెగలలో చిట్టచివరివారయిపోయారు. అయినప్పటికీ ఈనాటి వారి ధార్మిక సామాజిక ఆచార వ్యవహారాలలో వేలాది సంవత్సరాల భారతదేశపు వేళ్ళ కనిపిస్తాయి. కనక క్రైస్తవానికీ, ఈ ప్రాచీన తెగకీ తొలికలయిక చాలా ప్రత్యేకమైనది. శ్లో చెపలుకుడుతూ, కుడుతూ.N
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/13
స్వరూపం