పుట:Cheppulu Kudutu Kudutu....pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. ఒక పురాతన తెగ

ఇరవై ఏళ్ళ క్రితం దక్షిణ భారతదేశంలోని ఒంగోలు పట్టణంలో ఒకే ఏడాది పదివేల మంది మాదిగలు క్రిష్టియన్లుగా మారారు. దానికి కారణాలేమిటా అన్న ప్రశ్న వచ్చింది. ఒకేరోజు రెండు వేల రెండు వందల యిరవై రెండు మంది బాఫ్టిజం తీసుకున్నపుడు (శ్రద్ధాళువులు పండగ చేసుకున్నారు. ఆశ్చర్యముతో కృతజ్ఞతతో నిండిపోయారు.

అయితే దానికి దారితీసిన పరిస్థితులను గురించి శ్రద్ధగా చర్చించినవారు, ఈ క్రిస్టియానిటీ మార్పిడి ఉద్యమానికి ముందుగా వచ్చిన కరువు గురించి తెలునుకొని, అదే అనలు కారణమని సరిపుచ్చుకున్నారు. మలమల మాడ్చే ఆకలికి క్రైస్తవ మతానుభవం మీద కాంక్షకూ అనులోమానుపాతమని భావించారు. కరువు గడచిపోయిన చాలాకాలం తరువాత కూడా క్రిస్టియానిటీ ప్రజా ఉద్యమం కొనసాగింది. అరవైవేల మంది మాదిగలు క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు. తెలుగుదేశంలో ఒక ప్రాంతంలోని మాదిగ వారందరూ కైస్తవులయ్యారు.

ఈ తెలుగు మాదిగల గాథలను క్రైస్తవులూ, క్రైస్తవేతరులూ చెపుతూంటే వింటూ గడిపిన కాలంలో ఈ పెంటకోన్ట్‌ సంఘటనను మరోవిధంగా చూసేవారి ప్రశ్నలను నేను పట్టించుకోలేదు. మానవ హృదయంమీద భగవంతుని ప్రత్యక్షమహిమ కోనం వెదికాను. అది నాకు కనిపించింది. అదే నమయంలో క్రైన్తవం వైవు మూకుమ్మడి మార్పిడిని సాధ్యం చేసిన ప్రత్యేక పరిస్థితులను వరిశోధించడం పట్ల కూడా శ్రద్ధ వహించాను. నాకు అవీ దొరికాయి.

జనబాహుళ్యం మనసుమీదా, మేధ మీదా దేవుని ఆత్మపనిచేసే పద్ధతిని తెలుసుకోటానికి కేవలమూ చారిత్రక విమర్శనా పద్ధతులు సరిపోవు. విశ్వాసాల పరిధికి చెందిన వాటిని వివరించటానికి, విశ్లేషించటానికి హేతువు మాత్రం సరిపోదు. “దైవశక్తి" అన్నది ఒకటి ఉంది. అలా అనుకోవటంలో భగవంతుని నిగూఢ లీలల మీద విశ్వాసం గలవాడు తృప్పిపడతాడు. అయితే సామాజిక దృష్టి కోణం నుంచి మాదిగల ఈ మతాంతరాన్ని చూసేవాడు. ఆ విధంగా తృప్తి పడడు. అధి భౌతిక శక్తులను పక్కన పెట్టినా, విశ్లేషణకూ విమర్శకూ అందని ఏదో ఒక అంశం, పరిసరాలకు నంబంగించిన (వతి ఒక అంశాన్ని తీనుకొన్నవ్చటికి మిగిలిపోతుంది. ఆ అంశం క్రీన్తు నువార్తలో నిబిడీకృతమైన దైవశక్తి.

మాదిగ పల్లెల్లో ఉన్న సంప్రదాయాలతో విసుగెత్తిన వారు హిందూ గురువుల బోధనలతో ధార్మిక నత్యాన్వేషణ కొనసాగించారు. మిషనరి ఒంగోలుకు రాకముందే అలాంటి వారు ఒంగోలు మివన్‌కు కేంద్రబిందువులయ్యారు. ఈ అంశం గమనించాక నాకు విషయం అర్ధమైనట్లు అనిపించింది. వారి యోగి గురువుల నుంచి తెలుసుకున్నదానితో బహుదైవత్వాల నుంచి ఏకైక దైవత్వం వయిపు తొలి అడుగులు వేశారు. ఇది వారి ఉన్నతమైన ఆధ్యాత్మిక కాంక్షకు నూచనే కాని, అంతకన్న ముఖ్యమైనదేంటంటే, అంతటితో వారి ఆసక్తి, దాహం చల్లారలేదు. క్రీస్తు నువార్త వారికి చేరినప్పుడు వారి హృదయాలలోని కృతజ్ఞత క్రైస్తవ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చింది.

మాదిగలను క్రైస్తవం వైపు ఆకర్షించటంలో బాగా ప్రభావితం చేసిన మరో పరిస్థితి వారి బలమైన కౌటుంబిక బంధం. వారి పునాదులను శతాబ్బాలుగా కరువులు, కాటకాలు, యుద్దాలు తుడిచివేనినా మాదిగలు ఒక తెగగా తమ ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. అస్పృశ్యులు (పరియాలు)గా నెట్టివేయబడినా భారతీయ సామాజిక జీవితంలోని అనేకానేక బృందాలలో వారు ఒక బృందంగా ఉండటం ఈనాటికీ మనం గమనించవచ్చు. మాదిగ సంప్రదాయం అనే విశిష్ట నంప్రదాయం వారికి ఉంది. వారి వాడలలో స్వయం విచారణాధికారం తెగపద్ధతులకు నంబంధించినది.

ఒంగోలు మీషన్‌ తొలి దినాలలోకి వెళ్తే ఈ ప్రభావం వ్యాపించిన అనేక కేంద్రాలను నేను కనుగొన్నాను. అవన్నీ కుటుంబ కేంద్రాలే. ఈ విచిత్రమైన కొత్త మతం సంగతిని మొదటిసారి తీనుకువచ్చిన మనిషి ఫలానీ ఫలానీ మాదిగ కుటుంబానికి చెందినవాడుగా అతనిని గౌరవించి ఆలకించేవారు. ఆ తరువాత కుటుంబమంతా కలిసి ఈ మతం సత్యమైనదా, సరయినదా అని చర్చించేవారు. ఆ తర్వాత వచ్చే చిన్ని చిన్ని మత ద్వేషాలను కలిసికట్టుగా ఎదుర్శొనేవారు.

జీసన్‌ క్రీన్తును తెలుసుకొని, ఇంటికి వెళ్ళి, కుటుంబం చేత వెలియేయబడి, కొత్త మతానికి ప్రచారకులయిన వారు కూడా ఉన్నారు. వీరు తమ కుటుంబం తమతో రావాలని నిశ్చయించుకున్నవారు. కౌటింబికబంధం వారిమీద ఎంత బలమ్రైనదంటే విడిగా జీవించటమనేది అస్వాభావికంగా భావించబడేది, అరుదుగా జరిగేది.

ఇటువంటి కుటుంబ సంబంధాల ద్వారానే క్రైస్తవం తొందరగా వ్యాపించింది. సాంఘిక జీవితంలో అభివృద్ది చెందుతామన్న భావన కూడా ఇలాగే వ్యాపించింది. క్రైస్తవం వారి సామాన్య సామాజిక జీవితాలను మార్చివేయటంలో ఎంత శక్తిమంతమైనదో శూద్రులు గమనించారు. అది తెగ మొత్తానికి సామాజిక విముక్తి అని వారు అనుకున్నారు.

"ఈ మతం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. మనమూ పిల్లలను చదివించి గౌరవం నంపాదించుకోవాలంటే మనకూ ఆ మతం


చెప్పులు కుడుతూ..కుడుతూ..తెలుగు మాదిగల గాథలు

6