పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్యనిషేధం అవసరమే!

103

ముఖ్యంగా నిమ్నజాతులకు రెండే మందులు ವೊನ್ಸಿಟ್ಟು కనపడతాయి. అందులో వకటి నల్లమందు, రెండోది తెల్లమందు. తెల్లమందంటే? రసకర్పూరం. నిమ్నజాతుల్లో చాలామంది రెండేసియేళ్లకూ మూండేసి యేళ్లకూ యేరోగము లేకుండానే రసకర్పూరం వేసుకుంటూ వుండడం యీ దేశంలో చాలామంది యెఱిఁగిన విషయమే. వాళ్ల ఆయుర్దాయాన్ని కాపాడడం యీ తెల్లమందుమీందే ఆధారపడివుందని ఖండితంగా చెప్పవచ్చును. యిదంటూ లేనిపద్ధతిని యిప్పటికాలంలో వైద్యులు చేసేబిల్లు యిచ్చుకోతగ్గవాళ్లు వాళ్లల్లో వొకళ్లున్నూ వుండరని వేటే చెప్పనక్కఱలేదు. వాళ్లు కూలీ నాలీ చేసి యావజ్జన్మమూ సంపాదించిన సంపాదన వొక్కసారి జ్వరమో గిరమో వచ్చినప్పడు డాక్టరుచేసే బిల్లుకుcగాని విజిటింగుచార్టీకిఁగాని ఎన్నో వంతుకున్నూ రానేరాదు. అదిన్నీ కాక సంపన్న గృహస్టులమీఁదకి వచ్చినంత త్వరగా చొరవచేసి వాళ్లమీందకి ఆయావ్యాధులు తఱుచు రానేరావు - దానిక్కారణం వాళ్లు తప్పనివిధిగా పొట్టకోసంచేసే శరీరపరిశ్రమమే అని అందఱూ యెటింగిందే. యెప్పడేనా అనారోగ్యం కలిగితే తెల్లమందే వాళ్ల కాధారం. కొన్నింటికో? నల్లమందు. యీ రెంటితోటిన్నీ నూటికి తొంభై మంది జీవిస్తూవున్నారు. యీనల్లమందు కొన్ని సామాన్య క్షత్రియకుటుంబాలవారు తగిన హేతువు లేకుండానే వుగ్గుబాలతోపాటు పిల్లలకుకూడా తమతోపాటు వాడుకచేయడం క్వాచితంగా కనపడుతుంది. యీ కారణంచేతనే “భోజనం చేశారా?" అని అడగడానికి బదులు వారిలో - “నల్లమందు వేసుకొన్నారా?" అని అడగడం ఆచారమయింది - బ్రాహ్మణులలో దేవతార్చన అయిందా - శివపూజ అయిందా?” అని భోజనానికే పర్యాయపదంగా వాడడం యిదివఱలో వుండేది. క్రమంగా కాలదెర్భాగ్యంవల్ల ఆ ప్రశ్నలకు అవకాశం చాలా వఱకు నశించింది. యిది విషయాంతరం. మొత్తం, యే చైనా దేశంలోనో తీరి కూర్చుని నల్లమందు బెత్తికలకు బెత్తికలే తెలకపిండి అచ్చులమాదిరిగా తినడాన్ని గూర్చి నేనుచెప్పలేనుగాని మనదేశంలో మాత్రం దీనిని వాడేవారు వ్యాధిగ్రస్తులే అని ధ్రువంగా చెప్పవచ్చును - యీ మద్యపాన నిషేధంతోపాటు నల్లమందునుకూడా నిషేధించేయొడల యెందటో ముసలివాళ్లు మిక్కిలి చిక్కులో పడతారు - యీ నల్లమందు ఆనాcటికానాండు ధర పెరిగిపోతూ వుండడంచేత రోగగ్రస్తులుగా వుండే బీదలు ఇప్పుడే మిక్కిలి చిక్కుపడుతూవున్నారు - దీన్ని యిజారాపాడేవాళ్లు వొక్కొక్కచోట మటీ ధర హెచ్చించి బాధిస్తూవున్నారు. యీనిషేధం నల్లమందు క్కూడా వస్తే వైద్యులకుతప్ప యితరులకు యిది దొరకడం కష్టసాధ్యమవుతుంది కాంబోలునని కొంచెం నల్లమందుతో అవసరమున్న నేను భయపడుతూ వున్నాను. పత్రికల్లో దీన్ని కూడా నిషేధించినట్టే కనపడింది. గాంధీగారు ద్వంద్వాతీతులు. యెంతటి ద్వంద్వాతీతుండున్నూ కాకపోతే మోంకాలు దిగని