పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

పాపంగా కనపడవు- అందుచేత వాటిని వారు ఆచరిస్తూనే వుంటారనుకోవాలి. యెక్కువ ప్రాజ్ఞతకలవాళ్లతో ప్రసంగిస్తే మాత్రం మతవిషయంలో వుండే విశేషాలు కొన్ని కర్మ కాండబాపతు తప్ప యితరాచారాలలో మనకున్నూ వారికిన్నీ అంతగా భిన్నాభిప్రాయాలు కనపడవు-దయా సత్యశౌచాలు మూcడింటిలోను మూండవదానిలో వారికిన్నీ ఆర్యులకున్నూ చాలా భేదం కనపడుతుంది - ప్రస్తుతం మనక్కావలసింది పానాన్ని గూర్చిన నిషేధం - నేను వుదాహరించిన యితిహాసాన్ని బట్టిచూస్తే మహమ్మదీయులు పానాన్ని పూర్తిగా నిషేధించేవారే - మన ఆర్యులలో యెప్పడో యిక్ష్వాకుల కాలంలో ఈపానం బ్రాహ్మణులు కూడా మంచి నీళ్లతో పాటు ఆమోదించినట్లు కనపడుతుంది. కాని దీనివల్ల వచ్చే నష్టిని స్వానుభవంచేత కనిపెట్టి శుక్రాచార్యులు నిషేధించినట్టున్నూ భారతంవల్ల స్పష్టమవుతూ వుంది

క. "భూసురు లాదిగంగల జను లీసుర సేవించిరేని యిది మొదలుగcబా
పాసక్తిఁ బతితు లగుదురు చేసితి మర్యాద దీనిఁజేకొనుండు బుధుల్

యిందులో వున్న “ఇది మొదలుగ" అనే పదంవల్ల అంతకు ముందు మద్యపానం మహాపాతకాల్లో చేరలే దనుకొందామా? అయితే మహాపాతకాలు నాలుగే కావలసి వుంటుంది. కాCబట్టి ఆపదానికి అంత @ಮಿಭ್ಯಂ యివ్వడానికి వల్లపడదు. యీ కథలన్నీ అర్థవాదాలు. మొత్తం మద్యపానం నిషిద్ధ మనియ్యేవే మనం తెలుసుకోవలసింది. కాని రాజరు లనిపించుకొనే కుటుంబాలల్లో జన్మించినవారుకూడా శృంగారరసానుభవానికి హంగుగా దీన్ని ఆమోదించినట్లు మహాకవుల గ్రంథపోకడలు విశదపఱుస్తూవున్నాయి. కాని సంసారు లనిపించుకొనే సంపన్న గృహస్టులు దీన్ని ఆమోదించినట్టు కనపడదు. సంపన్న గృహస్టుల శృంగార రసానుభవానికిన్ని తదితరుల శృంగారానుభవానికిన్ని రతిరహస్యాదిగ్రంథాలు యెంతో భేదం కనపరచివున్నాయి- "పురుషభావవషట్కృతి వర్ణితం వనితయా నిజయా సు కృతీ కృతీ, మణితహీనరతోత్సవమాచరేత్” వగయిరా శ్లోకాలు చూడందగు- మద్యపానం చేయడం తప్పనే బ్రాహ్మణజాతి మనదేశంలో దానిస్థానంలో మటోవస్తువును సేవిస్తూ వున్నట్టు అంతగా కనపడదు, గాని ఉత్తరదేశంలో భంగుపానం చేయడం సర్వసాధారణంగా కనపడుతుంది. భంగు పుచ్చుకొనేవారికేనా చిలుములో గంజాయి వంచి పొగం బుచ్చుకోవడం చాలా దూష్యంగా ఆదేశంలో కనపడుతుంది. దీని స్థానంలో నల్లమందు కొన్ని దేశాల్లో వాడతారని వినడమైతే వుంది కాని మనదేశంలో నల్లమందు వాడడం మాత్రం యేదో వ్యాధిని పురస్కరించుకొనియ్యేవే కాని వినోదార్థం తీరికూర్చుని వాడడం కనపడదు. సంపన్న గృహస్టులకు తప్ప యితరులకు అందులో