పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిమద్యనిషేధం అవసరమే!

మద్యపానదోషాన్ని గుఱించి కొంత వ్రాస్తాను. యెందుకంటే కొన్నిసంవత్సరాల నుంచి ప్రతీ పత్రికలోనున్నూ దీన్ని మానిపించే ప్రయత్నాలు జరుగుతూ వున్నట్టు తఱుచు కనపడుతూవుంది. యిది చాలా సంతోషించ తగ్గవిషయం. మన పూర్వులు సప్తవ్యసనాలంటూ- "వెలCది జూదంబు పానంబు వేంట” ఇత్యాదిగా పేర్కొన్నవాటిలో పానాన్ని మూండోదాన్నిగా పరిగణించారు. కాని మహమ్మదీయులేమో అన్ని దుర్వ్యసన్గాలనున్నూ యిదే ప్రోత్సహిస్తుందని చెప్పి దీన్ని మొదటి దాన్నిగా పరిగణించి పూర్తిగా నిషేధించి వున్నట్టు ఆమతంలో వేత్త లైనవారివల్ల విని వున్నాను. పైగా యీ కథకూడా వారివల్లనే యెప్పడో విన్నాను-వొకానొక విజ్ఞాని మోక్షం పొందడానికి బయలుదేటినట్టున్నూ తీరా ద్వారాన్ని సమీపించాక అక్కడ నాలుతోవలు వేఱు వేఱుగా వున్నట్టున్నూ, అందులో వకచోట సర్వాంగసుందరి వొకానొక యావనవతి సర్వాభరణ భూషితురాలయి కూర్చుని యితణ్ణి చూచి లేచి అడ్డమయి “యెక్కడికి వెడతా" వని అడిగినట్టున్నూ, యీ ముముక్షువు "నేను మోక్షానికి వెడుతున్నానని చెప్పినట్టున్నూ, దానిమీద ఆ సుందరి-“సరే, వెడుదువుగాని నాతో యీరోజు మాత్రం శృంగారాన్ని అనుభవించితేనే తప్ప యీ మార్గాన్ని వెళ్లడానికి అవకాశంలేదని చెప్పినట్టున్నూ దానితో మనమోక్షగామి- “యీ పని చాలా తప్పకాబcట్టి నేనిందు కంగీకరించేది లేదు, మలో తోవను వెడతా" నని మళ్లీ మలో తోవను పోతూవుండంగా ఆ తోవలో వొకండు వొక మేకపోతునుచూపి– “యీ తోవను వెళ్లేటట్టయితే దీన్ని చంపి యీ మాంసాన్ని భక్షించి మటీ వెళ్లవలసిందని అడ్డగించినట్టున్నూ, దానిమీంద మన ముముక్షువు- “యిది జీవహింసతో చేరివుంది, కాCబట్టి ఈపని నేను చేసేదిలేదు, యింకోతోవను వెడతా"నని మళ్లీ మలో తోవనుపోతూ వుండంగా అక్కడ వొకండు జూదానికి సంబంధించిన పరికరాలన్నీ చూపించి “కొంచెంసేపు నాతో జూదమాడి వెడితే వెళ్లవలసిందే కాని లేనిపక్షాన్ని యీ మార్గాన్ని వెళ్లడానికి వల్లంగా"దని అభ్యంతరం చెప్పేటప్పటికి మన నిషధయోగ్యండు“జూదం ఆడడం చాలా తప్పపని, యీ దుష్కార్యం చేయడానికి నాకు బొత్తిగా యిష్టం లేదని చెప్పి మతో త్రోవను పోవడానికి మళ్లి వెడుతూవుండంగా ఆ త్రోవలో అలంకరించిన కల్లుకుండలతో వక మనిషి కూర్చుని - "అయ్యా వెడుదువుగాని, ఈలా రా కూర్చో