పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సూచించాను. నాన్బ్రామిన్సులో కొందఱు నాగరికులు యీమాటలేమీ వాడక “మా ಅಲ್ಲಣ್ಣಿ తీసుకువస్తామని మాత్రమే వాడతారంటూ బందరులో చెప్పంగా విన్నాను. ఎంత శాస్త్రీయమైనదయినా ఎంత ఆవశ్యకమయినదయినా యీకార్యం అన్ని వర్ణాలవారూ అంతో యింతో లజ్ఞాకరంగానే భావిసూవున్నారు. రాజులలో యింకో ఆచారం వుంది. అదేమిటంటే? భార్య పుట్టింట వున్నప్పడు ముసలితనంలోనేనాసరే అత్తవారింటికి అల్లుండు వెడితే చాలాతప్ప. అందుచేత వెళ్లనేవెళ్లండు. వక్క గర్భాధానాన్ని గూర్చే యేకొంచెమో వ్రాశాను. కాని దీనిలాగే అనేకావతారాలెత్తిన వెన్నో వున్నాయి, అవి లజ్ఞాప్రయుక్తమైన మార్పులుకావు. వాట్లనిగూర్చి మటోమాటు ప్రసంగించుకొందాం. గర్భాధానం యెత్తిన అవతారాలలోనే “శోభనం” అనేదికూడా చేరుతుంది. సర్వశుభకార్యాలకున్నూ పర్యాయంగా వాడుకోవలసిన “శోభన" పదాన్ని యెన్నాళ్లనుంచి వాడుతూ వున్నారో పెద్దలు విడమరిచి చెప్పలేముకాని, ಓಲ್ಟು గోదావరి, విశాఖపట్నం, గంజాం జిల్లాలలో సర్వత్రా వ్యవహరిస్తూ వున్నారనిమాత్రం చెప్పనక్కఱలేదు. ఈ అంశం ప్రతివ్యక్తిన్నీ యెడిగిన విషయమే. కొందఱు విమర్శకులు యీపదముతో గర్భాధానాన్ని వాడడానికిన్నీ అనుమోదించరు కాని వారి మతంలో దామోదర పదాన్ని “దరిద్ర' పరంగా వాడిన కవుల వాడకం కూడా సమన్వయించదు. అలా వాడిన ప్రయోగాలు రెండు మాత్రం జ్ఞప్తిలో వున్నవి చూపుతాను.

(1) “ఆలుబిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగాని మొదలనుండియు నీవు దామోదరుఁడవె! చిత్రచిత్రప్రభావ!”

(2) “అవక్రవిక్రమ విరాజద్రాజదోర్టండమండిత సామ్రాజ్యవధూటి చేరంజనునే? నిర్భాగ్య దామోదరున్,"

యింకా వున్నాయి. యెంత పరీక్షించినా దామోదరపదానికి దరిద్ర పరమైన అవయవార్థం కనపడదు. కాని యేకారణంచేతో యీ అర్థంలో లోకంలో వాడుక కలిగింది. దాన్నికవులు గ్రంథాల్లోకి యొక్కించారు. సంస్కృత భాషాకవులకన్నయీలాటి విషయాలకు దేశభాషాకవులు మిక్కిలిగా స్వతంత్రిస్తారు. కవిత్వమనేది తన హృదయాన్ని యితరులకు విప్పి చెప్పే వుద్దేశంతో పుడుతుంది. అలా చెప్పడానికి నిఘంటువులు వగయిరాల వల్ల తెలిసేపదాలకన్న వ్యవహారంలో వుండే అగ్రామ్యపదాలు యొక్కువగా వుపకరిస్తాయి. గ్రామ్యపదాలున్నూ వుపకరిస్తాయి కాని అవి గ్రామ్యదోషాన్ని ఆపాదిస్తవి. యీ సందర్భం దేశభాషాకవులకు మాత్రమే కాదు; సంస్కృత కవులకున్నూ కనుకనే శాబ్దబోధోపకరణాలలో - వ్యవహారతశ్చ అని చేర్చివున్నారు. దాన్నిబట్టే మేము మా దేవీభాగవత పీఠికలో“కేవల గ్రామ్యపదముల నేవగించి, జనులు వాడెడి పదములు సమ్మతములు." అని