పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భాధానం

97


ఆశ్చర్యపోయాము. అప్పడు "ఎూదేశంలో యీ పదంతో దీన్ని వాడడంలేదని వారు చెప్పేటప్పటికి యేదేశంలో వుండే రాజుకు మేం కృతిపెడుతూన్నామో, &9 దేశస్టులకు తెలిసేపదం- “ప్రయోజనం" అనేదాన్ని వుపయోగించడమే యుక్తంగా వున్నప్పటికీ తీరా మా దేశంలోనికి వచ్చాక యెవరేనా- “యీ ప్రయోజన మేమిటి తిథిప్రయోజనమా?" అని ఆక్షేపిస్తారేమో? అని అమంగళార్ధవ్యంజకమైన ఆ ప్రయోజనపదాన్ని కూడా వదలుకొని మటోమోస్తరుగా సద్దుకున్నాము. ప్రయోజనంతో దీన్ని వాడేవారి తాత్పర్యం వివాహానికి గర్భాధానం ప్రయోజనం కనక ఆలా గోప్యంగా వాడుకుంటూ వున్నారని తేలుతుంది. యేమైనా మనకంటె కొంత అనాగరికమైన దేశమైనప్పటికీ గర్భాధానపదం ఆదేశంలోకూడా క్రమంగా మార్పునే చెందిందిగాని నిలిచివుండలేదనేది యిక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం. ఆయీ మాటలన్నీ రజస్వలా త్పూర్వం జరిగే వివాహాలను పురస్కరించుకొని పుట్టినవే. రజస్వలాత్పూర్వమందు జరిగే వివాహాలవారిలో నాగరిక ముఖ్యులుగా వుండే వెలమ జమీందారులు వగయిరాలు యీ శుభకార్యాన్ని “నగరుcబెండ్లి అనేపదంతో వ్యవహరిసూ వున్నారు. ఆయీ సందర్భాన్ని బ్రాహ్మణేతరులు అంతప్రధానంగా పరిగణిస్తూవున్నట్లే కనపడదు; అంటే, పీంటల మీఁద దంపతులను కూర్చోపెట్టడం వగయిరా తంతు జరపడం లేదన్న మూట. షోడశకర్మలలోను ΟΟΟΟ గర్భాధానం ప్రథమకర్మగా పరిగణింపC బడవలసిందే. అయినను పూర్వకాలంలో “నాన్ బ్రామిన్సు అంతగా లెక్కించినట్లు లేదు. కాని ప్రస్తుతం కేవల బ్రాహ్మణులు యే వొక్కరో తప్ప తక్కిన యావన్మందిన్నీ సంధ్యా వందనానికి సమేతు స్వస్తిచెప్పడంచేత ధర్మశాస్త్రప్రకారం వారికి శూద్రత్వం వచ్చితీరుతూవుంది కనక వారికిన్నీ అనcగా కర్మలోపశూద్రులనcబడే Q9 నామమాత్ర బ్రాహ్మలకిన్నీ జన్మశూద్రులకున్నూ భేదంలేదంటూ యీ మధ్య సద్ర్బాహ్మణ పురోహితసభలో నెవరో ముచ్చటించిన మాటలను నేను మిక్కిలిగా అభినందిస్తూ వున్నాను. බීඋසී బ్రాహ్మల యెడల ఆ సద్ర్బాహ్మణులు ఆపాదించినదోషము సర్వవిధాలా పడుతూ వున్నది. కాcబట్టి నిజమైన హృదయంకలవా రెవ్వరున్నూ నేంటివారు పైయాక్షేపణకు అభిమాన పెట్టుకోంగూడదని తలుస్తాను. “యీ వక్కటికేనా మీరు అభినందనాన్ని తెలిపేది" అని యెవరేనా శంకిస్తారేమో? ఆ సద్ర్బాహ్మణులు నా అభినందనాన్ని అభిలషించరు కనక ఆ విషయాన్ని విస్తరించనక్కఱలేదు. వారి ప్రచారం వకవిధంగా నేంటి బ్రాహ్మణ నామధారులకు వుపకరిస్తుందేమో అనుకుంటే కాలదెర్భాగ్యం అందుకుకూడా వొప్ప కుంటుందని తోంచదు. యిది విషయాంతరం. యిప్పటికి గర్భాధానం యెన్నో అవతారా లెత్తినట్లయింది. కొన్నిటికి వివరించడం అయింది. దీనికే రజస్వలాత్పూర్వం జరగవలసివస్తే నిషేకం అంటూకూడా యింకో మాట వాడుతూవున్నారు- అనే సందర్భం యిదివఱకే \