పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భాధానం

95


సంబోధింపజేసినట్టే మనంకూడా యేగృహస్టురాలినో సంబోధిస్తే యేలా వుంటుందో? పైంగా దానిమీంద మనకు జరిగే మర్యాద యెట్టిదో? ఆలోచించి చూడండి. నిషధయోగ్యుండుగా వుండే యేమర్యాదసుణ్ణినా మనం “అయోగ్యుండవు కాకుండా వుండే వో మహానుభావా!" అని సంబోధిస్తే యేలా వుంటుందో? ఆలోచించండీ? అయితే కాళిదాసంతవాండు ఆలా సంబోధింపచేస్తే, మనమా దాన్ని విమర్శించే వాళ్లమంటే చెప్పే జవాబు లేదు. శంక యుక్తంగా వందో లేదో సహృదయులు పరిశీలించాలి. కాళిదాసుగారు మటోచోటకూడా యీలాగే వాడివున్నారు. రఘువంశంలో-

“అపాంసులానాంధురి కీర్తనీయా" అని సుదక్షిణాదేవికి విశేషణం చేశారు. పాంసులా అంటే? కులట. తద్భిన్నురాలు, అపాంసుల, అనగా? లంజకానిది. అంటే? మహాపత్రివ్రత అన్నమాట. అట్టివారలలో అగ్రగణ్యురాలు సుదక్షిణాదేవి అని తాత్పర్యము. మహాపతివ్రత అని చెప్పడానికి ముందు లంజ పేరెత్తుకొని ద్రావిడ ప్రాణాయామం చేయడంలో వున్న విశేషమేమిటో నాకు బోధపడలేదు. యెవరేనా విజ్ఞలు తెలిపితే తెలుసుకో తగ్గస్థితిలో వున్నాను. పిడివాదానికి వుపక్రమించే ప్రకృతి నాది కాదని సహృదయులకు నమ్మికవుంటే తెలుపుతారని నావిశ్వాసము. యిది విషయాంతరం. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటూ వున్నది గర్భాధానాన్ని గూర్చి యీపదంలో స్త్రీలకు ముఖ్యంగా లజ్ఞాకరమైన అర్థం వున్నట్టు యిటీవలివారు భావించి దీనికి పర్యాయపదాలు కొన్ని కల్పించుకోవడం సర్వానుభవసిద్ధమే అయినా కొంచెం వ్యాఖ్యానం చేస్తాను. దానిలో మన దేశంలో వైదికకుటుంబాలల్లో బయలుదేటిన పదం, బహుశః ఔపాసన అనేదనుకుంటాను. గర్భాధానంరోజున పగలు అగ్నిహోత్రం వుంచి ఆ దంపతులచేత హోమాలు చేయించడం సుప్రసిద్ధం. అందుచేత ఈమాటలో దీనికి సుమారు పది పండ్రెండు గంటలకాలంలో జరగCబోయేదాన్ని వాడితే అంత లజ్ఞాకరంగా వుండదని ఆలోచించి అలా లాక్షణికపదంతో వాడడం మొదలెట్టారని తోస్తుంది. కాని క్రమంగా ఆపదం కూడా అవయవార్థజ్ఞాన శూన్యంగా లజ్ఞాకరమైన అర్థాన్నే యివ్వడం మొదలుపెట్టింది. అంతటో, ఆ పదాన్ని వదలుకొని "పునస్సంధాన" పదంతో ఆ గర్భాధానాన్ని వాడడం మొదలుపెట్టేరు. ఈ పదం వాడేవారి అభిప్రాయం యేలాటిదో. నేను బాగా నిశ్చయించలేను గాని తోcచింది వ్రాస్తాను. వివాహంలో అగ్నిహోత్రాలు వుంచి సంకల్పం చేయడంలో - “యావజ్జీవం హోష్యామీత్యావయో స్సంకల్ప" అని వుపక్రమించడమేకాని యే వొకరో తప్ప మళ్లా ఆ అగ్నిహెూత్రాలవిషయం తలపెట్టినట్టే కనపడదు. కాని గర్భాధానంనాండు మళ్లా, అగ్నిహోత్రం వుంచి హోమం జరిగిస్తారు. ఆ జరిగించడానికి ముందు చేసే సంకల్పంలో- “విచ్ఛిన్న మగ్నిం పునస్సంధాస్యే అని సంకల్పం జరుగుతుంది. దానికి అర్థం, వివాహానంతరం అనంగా