పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యేర్పడ్డదని వేటే వ్రాయనక్కఱలేదు. జ్యోతిష గ్రంథాల్లో "గర్భాధాన మరిష్ట మష్టమ విధౌ అంటూ యీ కల్పితప్పేరునే వాడుకొన్నారు. కాళిదాసుగారు “గర్భాల__ధానక్షణ పరిచయాత్' అన్నారు మేఘసందేశంలో, అప్పటికింకా ప్రజలకు దీనియందు లజ్ఞాకరత్వం ప్రసక్తించినట్లులేదు; యద్వా ప్రజలకు లజ్ఞాకరంగావున్నా దానిని కాళిదాసు లెక్కించనే లేదో? కాళిదాసు ప్రజల వ్యవహారానికి వ్యతిరేకంగా వాడిన పదం యింకొకటివుంది. అది "అవిధవే" అనేది; ఆ పదానికి మగడు బ్రతికివున్నదానా? అని అర్థం. యక్షుండు తన పెండ్లానికి తన క్షేమ వార్తను పంపుతూ మేఘుండిచేత ఆలా పిల్వమని చెప్పతాండు. ఆ పిల్పులో కలిగిన లాభం తనభర్త బ్రతికివున్నట్టు వెంటనే యామెకు తెలియడమే. వాల్మీకికూడ ఆంజనేయులచేత శ్రీరామమూర్తికి సీతామ్మవారి వార్త తెల్పడంలో యీలాటిసొగసే కనపఱిచాడంటూ వ్యాఖ్యాతలు చెపుతారు. ‘సీతాదృష్టా" అనక “దృష్టాసీతా" అన్నాడంట! ముందుగా సీతాపదశ్రవణం జరిగేయెడల నష్టావా భ్రష్టావా అని పరిపరివిధాల రాముడు ఆందోళన పడవలసివచ్చునంట? ఆయీ విశేషాలు వ్యాఖ్యానాలవల్ల తెలియ వస్తాయి. ఆంజనేయుడు కోఁతిగదా యింత తెల్వితేటల కవకాశం లేదనుకోకండి. మహాకవి, నవ వ్యాకరణవేత్త హనుమన్నాటక మంటూ వకటి స్వయంగా శ్రీరామాయణ గాథను పురస్కరించుకొని రచియించివున్నాండు. అందులోదే యీ శ్లోకం

శ్లో "కస్త్వం వానర! రామరాజభవనే లేఖార్థసంవాహకో
    యాతః కుత్ర పురాగత స్పహనుమా నిర్దగ్ధ లంకాపురః
    బదో రాక్షస సూనునే తికపిభి స్సంతాడిత స్తర్షిత
    స్పన్రీడా త్త పరాభవో వనమృగః కుత్రేతి నజ్ఞాయతే."

యిందులో ఆంజనేయుండు తన్నుగూర్చి యెంతో నైచ్యంగా వ్రాసుకొని వున్నాండు. అందుచేత యిది అతని కవిత్వమే అని విజ్ఞలంటారు. యిది అంగదరాయబార ఘట్టంలోది. యిది యిలా వుంచుదాం, వెధవ కానిదానా! అని యేపుణ్యస్త్రీనైనా మనం పిలిస్తే బాగుంటుందేమో చూడండి. కాళిదాసు నాcటికి గర్భాధాన పదంలాగే యీ సంబోధనకూడా హృదయంగమంగావుండే దేమో? అదంతా యిక్కడ చూపవలసివస్తే వ్యాసం చాలా చేదస్తంగా వుంటుంది. ప్రస్తుతం కాళిదాసుగారు “ఓ వెధవ ముండ కానిదానా" అనే అర్థంయిచ్చేమాట అవిధవే అని యక్షుండి పెండ్గాన్ని మేఘండిచేత సంబోధింపచేయడం ఆవిడకు భర్తృ క్షేమం తొలుదొల్తనే చెప్పినట్లనడాని కంటూ వ్యాఖ్యాతలు స్వారస్యాన్ని నిర్వచించడం యీ నిర్వచించడమయితే చాలా యుక్తియుక్తంగానే వుంది గాని వాల్మీకి “దృష్టా సీతా" అన్నచోట వున్న సొగసిక్కడ కనపడడం లేదని నాకు తోస్తుంది. యిక్కడ వక చిక్కుంది. యేమిటంటే? “ఓ వెధవముండకానిదానా!” అని కాళిదాసుగారు