పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



గర్భాధానం

దీన్నిగుఱించి నాలుమాటలు వ్రాస్తునా? "యేమంత నూత్నవిషయం యిది, దీన్ని గుఱించి వ్రాయడాని" కనుకుంటారేమో? చదువర్లు. అందఱూ యెఱిఁగిందిన్నీ అనుభూత మయిందిన్నీ అయినప్పటికీ యిది రానురాను యెన్ని విధాల వ్యవహరింపఁబడుతూ వచ్చిందో, ఆలా నానావిధాల వ్యవహరింపఁబడడానికి కారణమేమిటో సర్వసాధారణంగా అందఱికీ అవసరమైనా కాకపోయినా కవిత్వం చెప్పకొనేవాళ్లకు మాత్రం చాలా అవసరం అందుచేత వ్రాయవలసివచ్చింది.

కొన్ని మాటలు పృథివి పుట్టేటప్పటికి యేలా వున్నాయో? యిటీవలకూడా ఆలాగే వున్నాయి, వుంటాయికూడాను. కొన్నో పాశ్చాత్య వైద్యంలాగ దేశాటనం చేసేవాళ్ల మనోభావాలలాగ క్షణేక్షణేమాఱుతూ వుంటాయి. అందుకువుండే కారణాలు కొంతవఱకు అక్కడక్కడ సూత్రప్రాయంగా వివరించే వున్నాను. దాన్నే యిందులో విస్తరించతలంచి యీ వ్యాసానికి ఆరంభం చేశాను. గర్భాధానం మొదలైనపదాలు మాఱడం అంటే తత్సమతద్భవాలలాగ కాదు. చాలా దూరదూరంగా మూల9డానికి మొదటికారణం సిగ్గు ఆంపడానికి సరిగా అర్థం చెప్పవలసివస్తే గర్భ = కడుపు యొక్క లేక - గర్భమందువుండే వొకానొక జంతువుయొక్క ఆధానం అంటే? చేయడం యిది వ్యాకరణశాస్తానికి లోపం రాకుండా “కర్తృకర్మణోఃకృతి" అనే సూత్రప్రకారం చెప్పే అర్థం. యింక సామాన్యంగా చెప్పేపిండితార్థమో? "కడుపుచేయడ" మనియ్యేవే. యీఅర్థం స్త్రీలకే కాదు పురుషులక్కూడా లజ్ఞాకరంగానే కనపడుతుంది. యిట్టిలజాకరమైన మాటను వుచ్చరించి వూట్లో పిన్న పెద్దలని ఆహ్వానించడానికి & పురుషాదులు బాజాబజంత్రీలతో బయలుదేఱడం నానాంటికి హేయంగా తోంచడంచేతనే కాcబోలును! క్రమంగా గర్భాధానపదానికి దాదాపుగా వుండే యితర పదాలతో ప్రస్తుత శుభకార్యాన్ని వ్యవహరించడం మొదలు పెట్టినట్టు తోస్తుంది. వైదిక పదంమాత్రం అనాదిగా గర్భాధాన మనియ్యేవే. గర్భాధాన ఖండ లోనైన వుదాహరణాలు “గర్భాధానాఖ్యం కర్మ కరిష్యమాణః" అని సంకల్పంకదా! అయితే యింకొకటి కల్పి తప్పేరు తప్ప దీనికి ప్రత్యేకించి పేరు పుట్టినట్టులేదు. నిషేకమనేది వకటి వుంది గాని అది రజస్వలాత్పూర్వం జరిగే నూత్నదంపతుల సమావేశానికే రూఢంగా మా వైపున వాడడం. గర్భాల_లి_ధాన పదం గర్భ + ఆధానం. అని రెండిటి కూడికవల్ల