పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తరకం ఈతి బాధలు

91


సాధ్యపడతాయో వున్నవీ అంతే సాధ్యపడతాయని, కొందఱయితే అంటారు. కాని అట్టనిచూస్తూ వూరుకోవడం ప్రాజ్ఞలలక్షణంకాదు. శంకరాదులు వారి జీవితమంతా పారమార్థికంలో వినియోగించుకొన్నారు. సరే అంతతో తృప్తిపడి వూరుకోలేదుకదా! లోకకల్యాణం కోసమని వారివారి అభిప్రాయాలు గ్రంథరూపంగా స్థిరీకరించికూడా ప్రయత్నించారు. దానివల్ల అంత ప్రపంచమూ కాకపోయినా యేకొంతో అప్పడే కాకుండా యిప్పడుకూడా పారమార్థికాన్ని నేర్చుకుంటూ ఉంది. ఆలాగే యిప్పటి సంస్కర్తల ప్రవృత్తులున్నూ యేకొంతమందికో వుపకరించి తీఱతాయని చెప్పకతప్పదు. కేవలమూ శంకరాదులలాగ నీతిబోధచేయడం మాత్రమే కాక ప్రభుత్వం చేతులో వుండడంవల్ల దాన్నికూడా దీనికి జోడించిపనిచేస్తూ వున్నారు కనక– “దండం దశగుణం భవేత్" అనే అభియుక్రోక్తి సార్థకమై పూర్వపు సంస్కర్తల ప్రయత్నంకన్నాయిప్పటి సంస్కర్తల ప్రయత్నం యొక్కువగా జయప్రదమై లోకకళ్యాణ దాయకం అవుతుందేమో అని తోస్తుంది. శంకరాదులుకూడా దుర్నీతినివారణానికి అప్పటి ప్రభువుల తోడ్పాటును కైకొన్నట్టే చరిత్రజ్ఞలు చెపుతూవుంటారు. విద్యాధికుల విషయంలో చేసే సంస్కారాల కంుతే దండోపాయ సహాయ్యంతో పని వుండదుగాని తదితరులను సంస్కరించవలసి వస్తే కేవల నీతివాక్యోపన్యాసాలు పనిచేయవని వ్రాయనక్కఱలేదు. అప్పుడే మద్యనిషేధం ప్రారంభించిన సేలం జిల్లాలో యెందటో తాగుబోతులు ఆదురలవాటుమాని దానిఫలితాన్ని గ్రహించి తమతమ అభినందనాలు సంస్కర్తలకు తెలుపుతూ వున్నట్టు పత్రికల వల్ల నైతే తెలుస్తుంది గాని యీ పత్రికల వ్రాఁతలు వారివారి పక్షగతాభిప్రాయాన్నిబట్టి వుంటూ వుండడం ప్రాయశః కనపడడంచేత పూర్తిగా విశ్వసించడానికి అవకాశంలేదు. వ్యతిరేకాభిప్రాయం కల వకపత్రిక వకమద్యపాయి యింకా నిషేధం అమల్లోకి రాకపూర్వమే ఆత్మహత్యవల్ల ప్రాణాన్ని గోల్పోయినట్టురాసిన రాంతకూడా చదివాను. భవతు. దానికేమి? యేమైనా పూనినపూనికి మంచిది. యిది నెగ్గితే మటి కొన్నింటికి వారు పూనడానికి వారికి వుత్సాహం కలుగుతుంది కనక దీన్ని నెగ్గించవలసిందని లోకం భగవంతుణ్ణి ప్రార్థించవలసివుంటుంది. యేలాగో పడమటిగాలిద్వారా మన భరతఖండంలో యీ శతాబ్దంలో వ్యాపించిన యీతిబాధలు తొలంగితే తప్ప సామాన్యగృహస్టులు జీవయాత్ర గడపడం పొసంగనే పొసంగదనే నిశ్చయంతో నేను ఆయాయి యీతిబాధలను యిచ్చట పేర్కొనవలసివచ్చింది. యిందులో కొన్నిగాని, అన్నీగాని ఆహ్లాదకరాలంటూ వాదించే వారుంటారనిన్నీ యెఱుంగుదును. ఆలా వాదించే ఎడల మద్యంకూడా ఆహ్లాదకరమే అని అంగీకరించవలసి వస్తుందికదా! లోలంబరా జీయం అనే వైద్యగ్రంథంలో దుఃఖనివారణకు మందేమిటంటూ ప్రశ్నించుకొని దానికి మద్యపానాన్ని మందుగా వ్రాశాఁడు గ్రంథకర్త. కూసుమతం అనే \