పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పాలుపోవడంలేదు. దీన్నిబట్టి చూస్తే ప్రపంచక స్వభావమే అనాదిగా యీలాగు వుందనిన్నీ అది యెవడు యెన్నివిధాల సంస్కరించినా స్వస్వభావాన్ని వదులుకోదనిన్నీ తేలుతుంది. కాని పాశ్చాత్యుల బుద్ధి చాకచక్యం మన భారతీయుల లాగ దేని స్వభావాన్ని దానికి వదిలిపెట్టి వూరుకునేది కాకపోవడంచేతానున్నూ, వారిగాలి పూర్తిగా సోఁకిన బుద్ధిమదగ్రేసరులు సంస్కర్తలుగా వుండడంచేతానున్నూ అస్మదాదులకు “యేటి కెదురీందడం” వంటిదిగా తోCచే సంస్కారాలు నెలకొల్పుతూ వున్నారు. వీట్లని కాదనడంకంటె ఆమోదించడమే మంచి పద్ధతి. మనలోకూడా-ఉ. "దైవమనంగ నెట్టిదగు దానిని జూచినవాఁ డెవండు? కార్యావసరంబు పట్ల నలసాత్ములు పల్కెడిమాట గాక!" అని దైవనిర్ణయానికి అనంగా ప్రకృతి శాసనానికి అన్యథాకరించే తలంపు కలవారు పూర్వమందుకూడా కొందఱున్నట్టు గ్రంథ ప్రమాణం కనపడుతుంది. కాని ప్రకరణాన్ని బట్టి ఆలా సాహసించేవారు అసుర ప్రకృతి కలవారుగా కనబడతారు. యింతేకాదు. దైవం మీఁద సమస్త భారాన్నీ వుంచి ప్రవర్తించే మహావిజ్ఞానులుకూడా అంతతోగత్వా-దైవం నిహత్యకురు పౌరుష మాత్మశక్త్యా యత్నే కృతే యది నసిద్ధ్యతి కోలి_త్రదోషః" అని పురుష ప్రయత్నానికే ప్రాధాన్యాన్ని యిస్తూ వచ్చారు. అనేక యీతిబాధలతో చేరివున్న యీ ప్రపంచ దురవస్థను చూచి శాంతి ప్రియులైన నారదాదులు యెప్పటికప్పుడే "కేనోపాయేన చైతేషాం దుఃఖనాశో భవేద్రువమ్ ఇతిసంచింత్య మనసా విష్ణులోక ముపా__ గమత్ (మనకు విష్ణులోకం అంటే లండనే అనుకోవాలి) అంటూ పురాణాల్లో యెంతో ప్రయత్నంచేసి వాట్ల శాంతికై వ్రతాలూ దానాలూ జపాలూ తపాలూ వుపదేశించినట్టు కనపడుతుంది. యిప్పడో? ఆ మార్గం బొత్తిగా ఆదరించేకాలంగా కనపడక కాంబోలు, యేయేవస్తువులు యీతిబాధాకారకాలుగా కనపడుతూ వున్నాయో, ఆయా వస్తువులు దొరకుండా చేయడానికి ప్రయత్నిస్తూ వున్నారు. అందులో మటీ ముప్పగా వున్నదాన్ని మొట్టమొదట యెత్తుకున్నట్టు తోస్తుంది. క్రమంగా నేనిందులో వుదాహరించిన బీడి, సిగరెట్లు, సినిమా లోనైనవాట్లకుకూడా యత్నిస్తారని వ్రాయనక్కఱలేదు. వక్కసిగరెట్లకే కోట్లకొలఁదిగా గృహస్టుల సొమ్మువమ్మవుతూ ವೊವ್ಲಿಲ್ಲು యేపత్రికలోనో చదివినట్టు జ్ఞాపకం. గాంధీ మహాత్ముని దృష్టిలో యివన్నీ యిదివఱకే పడివున్నాయి. అయినానేనిందులో వ్యాఖ్యానంచేయడం చూసూచూస్తూ వూరుకోలేక కాని మటో ప్రయోజనానిక్కాదు. పూర్వులు చూపిన యీతిబాధలకీ యిప్పడు నేను కొత్తగా చూపిన యీతిబాధలకీ కొంచెం భేదం కనపడుతుంది. యివి చేతులో ప్రభుత్వం వుందికనక యే కాంగ్రెస్సుమంత్రులో వారిస్తే వారింపఁబడతాయేమో? అని అనుకోవడానికి వీలుగా కనపడతాయి. అతివృష్టి వగయిరాలన్నీ కాకపోయినా అందులో కొన్ని బొత్తిగా మనుష్యప్రయత్నానికి లోCబడడానికి అవకాశం లేనేలేనివి. లేనివెంత |