పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/856

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

960

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


(షరా) అయ్యా గురువుగారు ఆయాయి సందర్భాలు గుఱికి బారెఁడు హెచ్చుతగ్గుగా వ్రాస్తూవున్నారే కాని సప్రమాణంగా వ్రాయడం లేదని తమకు పైని ప్రశ్నోత్తరాల్లో చూపిన ఆధారాలవల్ల స్పష్టపడినట్లయితే దీన్ని ప్రకటించండి. నేను చూపిన ఆధారాలు సరియైనవి కావని మీ హృదయానికి తోస్తే ఆపివేయండి. నేను వారియెడల కృతజ్ఞుఁడనా? కృతఘ్నుఁడనా, అనే అంశం తేల్చుకోవడమే నాపనిగాని జయేచ్ఛ వగైరాలుకాదు. అవి యిదివఱకే తేలివున్నప్పటికీ, శ్రీవారికొమార్త కవిత్వ విషయం వగైరా కొన్ని సందర్భాలు లోకులకు అపోహను కలిగిస్తాయేమో అని దీన్ని వ్రాశాను కాని లేకపోతే వ్రాయను. కాఁబట్టి సర్వాధికారాలు మీ మీఁద పెట్టినాను. విక్రమ చెళ్లపిళ్ల, అనే వ్యాసం ఈ వివాదకి సందర్భించింది కాదుకనుక మొదలు పెడితే బాగుండునేమో? చెరలాటంలో వక మాటకూడా ప్రస్తుతానికి సంబంధించినట్టు నాకు తోఁచడం లేదు. మీకేలా తోస్తూవుందో,అన్యబుద్ధి యప్రత్యక్షము గదా? మీ యభిప్రాయానుసారము చేయఁగోరెదను.

★ ★ ★