పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/853

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురు శిష్య ప్రశ్నోత్తరములు

957

గురు : నీతో నేనేమిని వాదించితినా! కార్డుమాత్ర మొకటి వ్రాసి విరమించినాను.

శిష్యు : ఆ కార్డుకూడా నేను దాఁచేవుంచాను. దీనిలో వున్నమాటలు కూడ గర్వస్ఫోరకములు. నేను గర్విష్ఠినే కనుక నాబోటివాళ్లు వ్రాస్తే నేమోతప్ప మీవంటివారు వ్రాస్తే బాగుండేవి కావు.

గురు : దానిలో గర్వమెక్కడ స్ఫురించు చున్నదో చూపించు.

శిష్యు : యిదుగో చిత్తగించండి. 91 అన్నాపిళ్లవీథి 2-4-23 మద్రాసు, ఆశీర్వచనములు....... ఇది నేను వ్రాయుచున్నానే మీ యభిప్రాయమైనట్లు సూచింపఁబడుచున్నది. నేను వ్రాసిన మీకును మీకును చోటుంచి వ్రాయనెంచను. నా భారతములో వ్రాసినయంతకును నే సమాధానము చెప్పఁగలను. అది తప్పనికాని, ప్రమాదమనికాని, చింత్యమని, తెలివిలేమియని కాని వ్రాసిన వ్రాఁతలు నిరస్తములు కాఁగలవు........... చేవ్రాలు. చూచితిరా? దీని శైలియెట్లున్నదో? శిష్యుఁడిపేర వ్రాసే వ్రాఁతకనక చిక్కులేదనుకోండి. వేఱొకరిపేరనే అయితేనో?

గురు : (తమలో) నిజమే యితఁడన్నమాట. పరస్పర విరోధము కనవచ్చుచున్నపుడు నేనా ప్రగల్భోక్తులు వ్రాయుట బిభీషికా మాత్రమే (ప్రకా) అంత పెద్దగ్రంథము వ్రాయునపు డామాత్రము విరోధముండుట సహ్యముకాదా?

శిష్యు : అట్లనడాని కెవఁడికి నోరొస్తుంది. అయితే “చింత్య" మని యెందుకు వ్రాయాలంటారేమో? నావాదంలో దాన్ని సమన్వయించవలసి వచ్చింది. యెదటివాళ్లు మీ గరువుగారే వ్రాశారు చూడండి, అనడానికి సిద్ధపడ్డారు. అప్పుడు నాయొక్క శాయశక్తులా యత్నించి తుదకు "చింత్యం” అనక తప్పిందికాదు. యథార్థమైనా అది కూడా మీకు కోపకారణమయింది.

గురు : ఏమైనను గురుశిష్యభావమున్నపుడు నావాదమునకు తోడ్పడుటయే యుక్తముకాని వ్యతిరేకోక్తులు వ్రాయఁగూడదు.

శిష్యు : అవకాశ మున్నంతవఱకు అలాగే కాలంగడిపాను. శిష్ట్లా వారున్నూ మీరున్నూ మేఘసందేశ విషయంలో వాదోపవాదాలు చేసుకుంటూ వున్నప్పుడు అభిప్రాయానికని నావద్ద కుత్తరాలొచ్చాయి. మెల్లిగా తప్పుకున్నాను. అవి