పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/850

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

954

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ప్రతారించడానికి తప్ప ఆ వినయం అంతఃకరణశుద్ధి కలదిమాత్రం కాదని స్పష్టపడుతుంది, బాలుని క్కూడా.

గురు : నేను బోవుపోకడ లేవియు నీవు సమ్మతింప వనుకొందును. అందుకే ప్రతిమాటకు బదులు చెప్పచుందువు.

శిష్యు : అబ్బే? అలా వుంటుందా? మీ అమాయికత్వాన్ని మీ పరోపకార పరాయణత్వాన్ని వీట్ల నన్నిటినీ నేను శిరసావహించేవాణ్ణే. కొన్నిటిలో చాలా గడుసుతనంగానూ వెడతారు మీరు. కొన్నిటిలోనో? మిక్కిలీ పేలవంగా వుంటుంది మీ పోకడ.

గురు : ఇఁక శిరసావహింపనివేవి?

శిష్యు : వ్రాస్తే చాలా వ్రాయాలి. మీ మనస్సు నొచ్చుతుంది.

గురు : నొచ్చదుకొంచె మేకరువుపెట్టుము. యెవరిది వారికి తెలియదుకదా?

శిష్యు : వుదాహరణకి వకటి మనవి చేస్తాను. పట్టనక్షేత్రంలో మీకు భగవతి (కలలోనూ గిలలోనూ కాదు) సాక్షాత్తుగా ప్రత్యక్ష మైనట్లు హరికథలోనూ జీవితచరిత్రలోనూ కూడా వ్రాయించుకొన్నారు గదా! దీన్ని లోకమెలా భావిస్తూ వుందో ఆలోచించండి. యిట్టివే యెన్నో వున్నాయి.

గురు : ప్రత్యక్షము కాకూడదా?

శిష్యు : కావచ్చును, లోకం మాత్రం దీనికి గేలి చేస్తుంది. యీకాలంలో దీనిమీఁదెన్నో ప్రశ్నలు పుడతాయి. జవాబు సున్న

గురు : లోకములో నీకు లేవా? యిట్టి ప్రతీతులు.

శిష్యు : వున్నాయి. అవి నే నంగీకరించేవి కావు. అక్కడే మీకూ నాకూ తేడా. అమాయికులు నాయందుండే ప్రేమచే కల్పించిన వివి. వీట్లనే అపవాదలు, అనే వ్యాసం వ్రాసి ప్రౌఢభారతిలో ప్రకటించి యీ మధ్య తొలఁగించుకొన్నాను. అంతట్లో మీరు వేసిన, అపవాదలు తొలఁగించుకోవలసి వచ్చింది. మూడు వ్యాసాలు జాగ్రత్తగా వ్రాశాను. యెక్కడా మృదువు తప్పలేదు. అయినా మీ చిత్తాని కాగ్రహం వచ్చింది. దానిమీఁద వ్రాఁతకి దిగారు. అది పరస్పర విరుద్ధమై అబద్ధాలాడడానికి దిగినట్లు తోఁపిస్తూ వుంది లోకానికి. దీన్ని గుఱించి బోలెఁడుత్తరాలున్నాయి. గ్రంథవిస్తర భీతిచే వుదాహరింప లేదు.