పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/849

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురు శిష్య ప్రశ్నోత్తరములు

953


శిష్యు : నే నొప్పుకోకపోవడం లెక్కేమిటి? లోకమే వప్పుకోదు. ఆయన స్వభావం చాలామంచిది. ఆయన నిర్నిమిత్తంగా ద్వేషించఁడు. నన్ను మాత్రం ఆయన వదలి పెట్టేఁడా యేమిటి. డింకీపందెపు కోడిపుంజుగా చిత్రించాఁడుకాఁడూ? గుంటూరి పోట్లాటరోజుల్లో ఆనవాలు కోసమని నా పెద్దరుద్రాక్ష తావళం కూడా ఆపుంజుమెడలో తగిలించాఁడు. ఆయనకృత్యాన్ని ఆయన నెఱవేర్చుకున్నాఁడను కున్నాను.

గురు : తిరిగియు బందరు వీడుకోలు సందర్భములో మిక్కిలి అభినందించి ప్రశంసించినాఁడు కదా?

శిష్యు : “అవస్థా పూజ్యతే రామ" అన్న విషయం తమకు విశదమే కదా? గర్హించవలసివచ్చింది, గర్హించాఁడు, అర్హించవలసివచ్చింది, అర్హించాఁడు. అదే ఆయనకృత్యం. "కొట్టితే కొట్టాఁడు కొత్త కోకెట్టేఁడు."

గురు : బాగున్నది నీకు క్రొత్తకోక పెట్టుటచే నీవు సంతసించితివి. నన్నుకొట్టుటేకదా చేసి మిన్నకున్నాఁడు.

శిష్యు : అవసర మింకా రాలేదు వస్తే మీకున్నూ కొత్తకోక బహుమతీ దొరుకుతుందేమో?

గురు : ఇంతకును, ఆయన యెంతచేసిన నంతే అని నీ యభిప్రాయమనుకొందును. “విస్సన్న చెప్పినదే వేద” మన్నట్లు.

శిష్యు : ఆయనే కాదు పరిశీలించి ప్రవర్తించే ప్రతి పత్రికాధిపతి వాక్కు నందున్నూ వుంటుంది యీ వాల్యూ.

గురు : మరల "పరిశీలించి" అని విశేషణ మొకటిచేర్చితివే?

శిష్యు : చేర్చకపోతే చిక్కుగాదూ? ప్రతీ అవ్యక్తుఁడి రాఁతకున్నూ కట్టుబడవలసి వస్తుంది. అది భావ్యంకాదు గదా?

గురు : నేను చెరలాటములో “అందఱికి శిష్యుఁడను" అని వ్రాసికొన్నాను. దీని కాయన చాలాసంతోషించు ననుకొందును.

శిష్యు : యీ వినయోక్తి పనిచేయదు. యేమంటారా? అంత వినయవంతులకు సార్వభౌమ బిరుదధారణ ప్రయత్నమెందుకని వెంటనే ఆశంక వస్తుంది. దానిమీఁద వేంకటశాస్త్రివలె నేను గర్విష్టిని గాను సుమండీ, అని లోకాన్ని