పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/846

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

950

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యేలా గంటారా, చూడండి యీయన పక్షపాతి, అని ప్రదర్శించడానికి పనికివస్తుందాయనకు. మీ ప్రమాద మేలాగూ సమర్ధింపఁబడదు కదా?

గురు : అదిగో? ప్రమాదమనికూడా ననుచున్నావు. నీ వట్లనుట మాత్రము తప్పుకాకపోదు. నీవు నావెంటనుండి నన్ను సమర్ధింపవలయునే కాని అన్యథాగా నుండఁగూడదు.

శిష్యు : కోప్పడకండి. మీ రెప్పడూ యిట్టి అనాలోచిత కార్యాలే చేయుచుండడం సహజం కదా. నేను కూడా మీతో చేరితే నాకున్నూ మీవంటిపేరే వస్తుంది గదా?

గురు : నా పేరు కంటె నీకు మంచిపేరున్నదా? లోకములో !

శిష్యు : అది నన్నడిగితే యేం తేలుతుంది? లోకాన్నే అడగండి. పెండ్యాలాయన్ని ముందస్తిగా శ్లేషించి వ్యక్తిదూషణ చేయడమెందుకు? తరవాత ఆయన తోఁకతొక్కిన తాఁచులా లేచి మిమ్మల్ని యేదో శ్రౌతసంప్రదాయాన్నాధారం చేసుకొని అడ్డమైన దుర్భాషలూ ఆడడమెందుకు? అంతతోనేనా సమసిపోకుండా కేసెందుకు? ఆయినా విషయాలలో మీకు నాబోటివాని సలహావుంటే అంతదాఁకా ములుఁగుతుందా?

గురు : అగుచో పెండ్యాల విషయము నాదేలోటని కూడ ననెదవుకదా? పరిశీలించినమాటేనా?

శిష్యు : "దోషావాచ్యా గురోరపి" కనక మనవి చేస్తారు. లోఁటా? లోఁటున్నఱా? తప్పా? తప్పున్నఱా? యిప్పుడు దాని జోలి మనకెందుకులెండి. చెరలాటంలోసంగతులను గూర్చి యింకా యేమేనా అడగండి అడగవలసుంటే.

గురు : ముక్త్యాలలో నేదో నన్నుఁగూర్చి ప్రయత్నము చేసితివి గదా? సంతోషమే. రమ్మన్నప్పు డేల రాలేదు?

శిష్యు : నా ఆరోగ్యం బొత్తిగా నెవ్వరిముల్లువాటంలోకి వచ్చి అప్పటికి చాలాకాల మయిందని తామెఱిఁగిన్నీ అట్లా నెపపెడితే నేనేం మనవి చేసుకోను?

గురు : ఆయేఁడే మదరాసు కేలా వెళ్లఁగలిగితివి?

శిష్యు : అదిన్నీ స్వేచ్ఛాప్రారబ్ధం కాదు. పరేచ్ఛా ప్రారబ్ద మనుకోండి. ఆ మదరాసు ప్రయాణమే కదా? కొంపతీసింది. అప్పుడు చెడ్డ ఆరోగ్యం సుమారు