Jump to content

పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/845

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురు శిష్య ప్రశ్నోత్తరములు

949

గురు : కోర్టులో ప్రమాణాలకా నీవు వాల్యూయిస్తూన్నావు? పోనీ దాని కేమి? శాస్త్రిగారి "క్షమాపణ" అన్నా వేమిటి?

శిష్యు : నేనన్నది "క్షమాపణ" అని మాత్రమే. శాస్త్రిగారి అన్నది పత్రికలవారు చేర్చినది. అందుకే వారు కొటేషన్ గుర్తు క్షమాపణకే పెట్టే రనుకుంటాను. శాస్త్రిగారంటే, వెం|| శా|| గారన్నమాటే.

గురు : చంకదుద్దేమిటి?

శిష్యు : అది నాదే. ఆమాట వాడడాని క్కారణం ఆ వ్యాసంలోనే వ్యాఖ్యానం చేసివున్నాను. యిక్కడ మళ్లాయెందుకు? -

గురు : నీ వ్యాఖ్యానముల కేమిలే. ముఖ్యముగా కొల్లాపురపు విషయములో నిజమే అనుకొమ్ము నాకు వ్యతిరేకాభిప్రాయ మీవచ్చునా?

శిష్యు : యివ్వకూడదు. విధిలేక యిచ్చాను. ముక్త్యాలవ్యాసంలో దీనికిని జవాబు కలదు.

గురు : నేను నీ మీఁద నెవరోవ్రాసిన శృంఖలము విషయమున నభిప్రాయ మడిగినపుడు చేసినది నీ వెఱుఁగుదువా?

శిష్యు : యెఱుఁగుదును. తిట్టి పంపినారు. యీ సంగతి గూఢంగా వ్యాసాలలో సూచించే వున్నాను. మీ రట్లు చేయకున్ననూ నాకు చిక్కులేదు. దీనికిన్నీ దానికిన్నీ చాలా తేడా వున్నది. ప్రస్తుతమో? అభిప్రాయ మిచ్చి తీరాలి, లేదా పక్షపాతి, అనే అప్రతిష్ట పడేనా తీరాలి. నా ప్రతిపక్షికి మీరు సదభిప్రాయమిస్తే వృథాగా మీరుత్తర వాదులు కావలసి వచ్చేది! ఆయనగతి యేమయిందో తృణీకరణంలో చిత్తగించండి.

గురు : ఎందుచేత? నీకభిప్రాయ మీయక తప్పింది కాదు.

శిష్యు : జమీందారయిన పెండ్లికొడుకును పెండ్లిపీఁటల మీఁద ఆశీర్వచించిన శ్లోకాలను మీరు అశుద్ధం, అమంగళం, అని తిట్టి పైఁగా తగలఁబెట్ట మన్నారు. యిది మీకిష్టమేనా? అంటే యేం చెప్పేది నేను?

గురు : ఆ శ్లోకాలు చెప్పిన పండితుఁడు నాకు చేసిన అపకార మెఱుఁగవా?

శిష్యు : చేశాఁడు, చేయలేదు. మీ తొందర హరిహరబ్రహ్మాదులకుఁగూడ సవరింప రానిదిగా నున్నది. నే నేం చేసేది? అభిప్రాయ మివ్వడం మానాలి. అంతతో మీకేం లాభం, ఆయన కేం నష్టం, యెందఱో యిచ్చారుగా? నాకు నష్టం