పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/841

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంధి మిచ్ఛంతి సాధవః

945


నేను కలగచేసుకోలేదు. తరువాత గురువుగారు నాశుశ్రూషను గుఱించి కేవలమున్నూ హైదరాబాదుకు వ్రాసిన వక వుత్తరం అక్కడ పత్రికలలో విశేషించి చర్చించి చర్చించి గందరగోళ పడ్డది. నిన్నమొన్న నాకు చేరింది. ఆ వుత్తరంవల్ల షష్టిపూర్తి కమిటీవారు ప్రచురించిన నా జాతకచర్యకు చిక్కు తటస్థించింది. దానిచే జాగ్రత్తగా వ్యక్తిదూషణ కలికానిక్కూడా రాకుండా వుండాలనే నియమంతో మూడువ్యాసాలు వ్రాశాను. దానిమీద కొంతబెడిదంగానూ కొంత శాంతంగానూ సమాధానం అంటూ గురువులు ప్రచురించారు. దానిమీద క్షమాపణం అనే శీర్షికతో వకవ్యాసం నేను వ్రాశాను. దానిలో వక్కమాటకూడా అసత్యం లేకపోయినా అది వారి చిత్తానికి మిక్కిలి కోపాన్ని రప్పించింది. ఆపైని తిట్టడమా? శపించడమా? అబద్ధాలాడడమా? వకటేమిటి నానాత్రోవలలోకి లేఖిని నడిపించి అంతతోకూడా మనస్సు శాంతించక నాకవిత్వంలో తప్పులు చూపడానికి ఆరంభించారు. తప్పులను గూర్చి సమర్థించవలసినది వుంటే సమర్ధనం ప్రచురిస్తాననుకోండి. లేదా? దిద్దుకుంటానని మనవి చేసుకుంటాను. దానికిచిక్కు లేదు. తిట్లకున్నూ, శాపాలకున్నూ ప్రతిక్రియ చేసేదిలేదు. వృథాగా నా వ్రాతలో మాటలకు వారు అపోహపడ్డవి కొన్ని వున్నాయి. వాట్లను మాత్రం కనపరుస్తాను. యింత జాగ్రత్తగా యెక్కడేమి చిక్కువస్తుందో అని భయపడుతూ వ్రాస్తూవున్న నా వ్రాతనుకూడా సమష్టిమీద మిక్కిలి దురుసుగా వున్న గురువుగారి వ్రాతతోపాటు జమకట్టిన మా మిత్రులు సుబ్బరామయ్యగారిని వక పర్యాయం మామా వ్రాతలు సవిమర్శంగా చదివి చూడవలసిందని ప్రార్ధిస్తాను. తాగుడు దగ్గిఱనుంచి పంచమహా పాతకాలదగ్గిఱనుంచి వారు నాకు ఆపాదించి వున్నారుగదా! నా వ్రాతలో అట్టి ప్రసంగం యెక్కడేనా మందుకేనా వుండదేమో! సదరు సుబ్బరామయ్యగారు పరిశీలించారుకారుగదా అనే దుఃఖం నన్ను బాధిస్తూ వుంది. గురువుగారు వ్రాశారంటే నాకు బాధలేదు. వారికి నావల్ల పెద్ద చిక్కు వచ్చి పట్టుకుంది. దాన్ని పోగొట్టు కోవడానికి వారు “వెంllశాII అల్లాటివాడు యిల్లాటివాడు, తాగుతాడు, తాళాలు వాయించుకుంటాడు, పొత్తర్లు కట్టుకుంటాడు" అని వ్రాయడం వారికి ఆవశ్యకమయింది. దాని వల్ల వచ్చే చిక్కువారికి వదలిపోతుంది. కనక వారట్లు వ్రాస్తారనుకుందాం. అట్టి మాటలు లేశమున్నూ నేను వ్రాయలేదే? లేనప్పుడు నా వ్రాత వారి వ్రాతతో సమష్టిమీదే అనుకుందాం సమానంచేసి వ్రాయడం నా మాటట్లుండగా లోకం మాత్రం సహిస్తుందా? అయితే మొత్తం వివాదం వద్దని వారి తాత్పర్యం అనుకుందామా? దాన్ని శిరసావహించని వారెవరు? తండ్రిమీద కొడుకు కోర్టులో దావాచేస్తాడు. దేనికోసం? ధన కనక వస్తు వాహనాల కోసం. దాన్ని తప్పుగా భావించడం నేటికాలంలో కనపడదు. ధనం యేలాటిదో కీర్తిన్నీ ఆలాటిదే. అందులో బాగా ఆలోచిస్తే ధనం కన్న కీర్రే యెక్కువగా గణించదగ్గది.