పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యింతా అంతా అని చెప్పడానికి వీలు కనపడదు. నేను బందరులో వుండేరోజులనాఁటికి ΟΟΟΟS9 లౌక్యవృత్తిలో వుండే పూర్వరీతివారుకూడా యేదో గుఱ్ఱబ్బందో, యొద్దు బండో యొక్కి వారివారి గమ్యస్థానానికి చేరడానికే యిష్టపడేవారుగాని దీన్ని యొక్కడానికి సంకోచపడేవారు. సుమారు రెండుమైళ్ల దూరాన్నుంచి హిందూ హైస్కూలుకు రావలసిన హెడ్మాస్టరుగా రొకరుండేవారు. ఆయన తఱచుగా నడిచే వచ్చేవారు. కొందఱు ఆయన్ని“మీరు సైకిలుమీంద వెళ్లరాదా?” అంటే?- “సైకిలుమీఁద నేను బయలుదేటితే అంతా నన్నుచూచి నవ్వుతారు" అని జవాబు చెప్పడం నేను యెఱిఁగిందే. ఆ రోజుల్లో దీన్నిగూర్చి వక అవధానంలో అడిగేటప్పటికి యీ పద్యం చెప్పాము శా. “నీరుం గోరదు గడ్డినద్ద దొక కొన్నే నుల్వలన్ వేండ దే వారే నెక్కినం గ్రిందం ద్రోయం దొకండుం బజ్జన్ భటుం డుంట కూరంగా వల దౌర! బైస్కిలునకున్ గోప మ్మొకింతేని లే దౌరా! వాజికిం (గుల్జానికి) దుల్యమైన యిది విశ్వామిత్ర సృష్టంబొకో?" (అప్పటికి సైకిలు అనేపేరు దీనికి వున్నట్టు నాకు తెలియదు. బైస్కిలు అనే వినడం.) దీన్ని విన్నవారిలో కొందఱు శంకించారుగదా! “యెందటో దీన్ని యొక్కేవారు పడడమూ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోడానికి పడివుండడమూ అనుభూతంగా తెలుస్తూవుంది. మీరీలా చెప్పారే?” మన్నారు. దానికి సమాధానం-అది దాన్ని యొక్కేవాళ్ల తెలివితక్కువగాని ఆసాధనం చేసే పనికాదని జవాబు చెప్పాము. యీ శంకల కేమిటి? చెప్పేవాండుంటే అడుగుతూనే వుంటారు. యింకా దీనిలో- “నీటిన్” అనక నీరున్ అన్నా రేమనికూడా ప్రశ్న మాత్రం యింతవఱకు యెవరూ అడగలేదు గాని అడిగే అవకాశమూ లేకపోలేదు. చెప్పడానికి జవాబున్నూ లేకపోలేదు. యింతకూ కాలినడక్కు కొంతమందికిన్నీ అశ్వాది సాధనాలకి బదులుగా కొంతమందికిన్నీ యిది విశ్వామిత్రసృష్టిగా బయలుదేటింది. అయితే యిది కొత్తరకం యీతిబాధల్లో కెందుకు చేర్చవలసివచ్చిందంటే? సామాన్య సంసారంలో ఆండవాళ్లుకాక మొగాళ్లు యెందఱయితే వుంటారో, అందఱికీ మనిషి వక్కంటికి వొక్కొక్కటి చొప్పన యిది వుంటేనేకాని కాలం గడవడం లేకపోవడంచేత యిదికూడా గృహస్టుకు వకయిూతిబాధే! దీన్ని వకపర్యాయం కొని పడేస్తే అంతతో తీరిపోదు. మధ్యమధ్య బోలెండు మరమ్మత్తులు. అయితే గుట్టానికి బదులుగా దీన్ని వాడుకొనే సంపన్న గృహస్తులకు కొంత దీనివల్ల లాభంవుందంటే వొప్పుకోవచ్చునుగాని ఆపూఁట కాపూCట యెట్లో కాలక్షేపం జరుపుకొనేవాళ్లకి మాత్రం యిది తప్పక వక యీతిబాధే. అన్నింటికీ మించింది యింకోటి కనపడుతూ వుంది. అది “సినిమా”. యీ సినీమా "యెనీమా"