పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/835

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గురువుగారు వట్టి అమాయికులు

939


మాకున్నూ, వెంllరాII లకున్నూ వచ్చిన వాదానికిన్నీ ప్రస్తుత వాదానికిన్నీ ముడిపెట్టాలని గురువులు మిక్కిలీ శ్రమచేస్తూవున్నారు. దాని కిన్నీ దీనికిన్నీ లేశమున్నూ పోలికలేదు. యీ అంశం గురువు లెఱుఁగనిదికాదు! యెఱుఁగుదురు. యెఱిఁగే లోకవంచన చేస్తున్నారు. యీ అంశాన్ని నేను మొట్టమొదటి వ్యాసంలోనే సూచించి వున్నట్లు జ్ఞాపకం. అసత్యములతోనూ అపప్రమాణాలతోనూ నిండివున్న ఆయీ తమ వ్యాసాలను పుస్తకంగాచేసి చెరలాటం అనే పేరుతో వుచితంగా పంచిపెట్టిస్తూవున్న గురువుల అమాయికత్వం మిక్కిలీ వర్ణనీయం.

నేను; గురువుగారు నా కవిత్వంలో చూపిన దోషాలలో కొన్నింటికి పూర్వభారతాదులలో నుంచి వుదాహరణాలుచూపి, కొన్నిటికి గురువుగారి భారతప్రయోగాలే తుట్టతుదను అనుబంధంలో వుదాహరించి వున్నాను. గురువుగారు యేమాత్రం న్యాయపథాన్ని తొక్కేవారైనా అంతతో వూరుకొని “సరే! మిగిలినవాటి కేంసమాధానం చెపుతా" వని ప్రశ్నించడం తప్ప యింకోరీతిగా యేమాత్రం వ్రాసినా అది పిడివాదంలోకే చేరుతుంది.

గురువుగారు మిక్కిలీ సాహసులు. కొల్లాపురపు విషయాన్ని యీ గోదావరిజిల్లాలో వుండే మహామహులైన విద్వాంసులూ కవులూ అందఱున్నూ నిరసించివున్నప్పటికీ, వారి నందఱినీ యేవో మాటలతో నిరాకరిస్తూ మళ్లా వాదానికి ఆరంభించారు. ఆ వాదం పేరే "దురుద్ధర దోషశృంఖలం" దాన్ని మూడేళ్లు కాఁబోలును కొంత పస్తాయించి అచ్చువేసికూడా దాఁచిపెట్టివున్నారు. నాకేమో వంచనమని ఆలోచించి కాఁబోలు యిప్పుడు బహిర్గతం చేశారు. కాని అందులో మొట్టమొదటి అచ్చులో వున్న “తద్దినంబెట్టేవాఁడి తమ్ముడులాగా" అనే మాట, లోనగు నింద్యోక్తులు చాలావఱకు తగ్గించారు. యీమాట 82 వత్సరాల వయస్సులో యిప్పుడున్న వక మహాకవినిగూర్చి గురువులు వాడివున్నారు. యిప్పటి ప్రకటనలో కొందఱిని అసలే తగ్గించారు. యెవరిని తగ్గించారో వారినే మొదటి అచ్చులో విశేషించి దూషించి వున్నారు. యీ తగ్గింపువల్ల ఆ దూషించడం తప్పని యిప్పటికేనా వారి చిత్తానికి గోచరించినట్లు స్పష్టపడింది అని నేను సంతోషిస్తూవున్నాను. నన్ను గుఱించి మొదట యెంత దూషించారో అంతా యిప్పుడున్నూ ప్రకటించివున్నారు. యిలా మార్పు చేసి తుట్టతుదకు వ్రాస్తారు చూడండి.

“ఇవియే పండితుల యభిప్రాయములపై నేను వ్రాసిన వ్రాతలు. ఇవియే పండితులను తిట్టితి నని మన శతావధానిగారు పలుకగల్గిన పంక్తులు ఇందులో నెట్టి తిట్లున్నవో?......."

మార్చడం వల్ల కొన్ని తిట్లు తగ్గినాయని మనవిచేస్తాను. అవసరమైనపుడు నాచేతికి చిక్కిన పుస్తకంలో వున్న దుర్వాక్యాలు ప్రకటిస్తాను. మొదట తొందరపడినప్పటికీ