పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తరకం ఈతి బాధలు

87


పరిణమించిందో చూడండి. యీ యాజమాన్యాలు “మూణాళ్ల ముచ్చట్లు" దీనిలో యిన్ని వికారాలు, వేదాధ్యయనానికి వుపనయనం కావాలాయెు. ఆ వుపనయనం ఆబ్రాహ్మణ చండాల పర్యంతమూ జరగcదగ్గదిగా కనిపించడం లేదాయె. “లేకపోయేదేమిటి? చేసుకుంటే - వుంటుందని చేసుకుంటారా? చేసుకోండి, ఉత్తమత్వప్రాప్తికికదా! యవరేపని చేసుకున్నా అట్టివత్తమత్వం అశాస్త్రీయ కార్యాలవల్లకూడా కలిగేయొడల సంతోషమే. కానివ్వండి" అంటే తీరిపోయే దానికి కొందఱు బ్రాహ్మలు యేదో పుట్టి మునిఁగినట్టు దీనికోసం పరితపిస్తారు. అదిన్నీకాక యెవరికి అధికారంవుందో వారిలో యెందఱు వేదం చెప్పకుంటూ వున్నారు? వేదం దాఁకా యెందుకు? అధమం సంధ్యావందనమేనా చెప్పకుంటూ వున్నారా? అట్టిరోజుల్లో యీవిధినిషేధాలెందుకు? యీ వేదశాస్త్రాలు ద్విజులవల్ల యేలాగా కాపాడబడేటట్టులేదు. ద్విజేతరులవల్లనేనా కాపాడCబడతాయేమో? అని బ్రాహ్మలు ఆలోచిస్తే యేమయ్యేదోగాని ఆలా ఆలోచిస్తూ వున్నట్టు కనపడదు. బాహాటంగా హరిజనులక్కూడా వేదశాస్తాలు చెప్పడానికి ఛాందసులు సిద్ధపడేటట్టయితే యేమవుతుందో? చూడాలని నాకు యెంతో కుతూహలం వుంది. యీలాటి ఆలోచనలవల్ల కాదుగాని కొందఱు కడుపుకక్కుర్తివల్లమాత్రం అక్కడక్కడ ద్విజేతరులకు చెపుతూ వున్నారేమో? అన్నట్లు చెప్పడమెందుకు? అచ్చుపుస్తకాలుండనే వున్నాయికదా! వాట్లవల్లనే ఆ వేదాన్ని వారు సాధించవచ్చు ననుకుంటాను. అయితే అది శ్రుతికదా! అది శ్రవణంవల్ల సాధించవలసివుంటుందే? అవన్నీ యెవరిక్కావాలి? ఏదోవిధంగా సాధించడమేకావలసింది. - శాస్తాన్ని వుల్లంఘించి చేసేపనికి మళ్లా ఈ విషయంలో శాస్త్ర ప్రతిబంధక మెందుకు? ఆ పక్షంలో యెవరికీ వచ్చేదీలేదు యేమీలేదుగాని ఆవేదం మాత్రం చెడుతుంది. దీన్నిబట్టి ఆలోచిస్తే ఈమూమెంటు వేదంపాలింటికి యీతిబాధగానే కన్పిస్తుందిగదా! ప్రస్తుతకాలంలో దేన్ని పడితే అదే యీతిబాధగానే కన్పిస్తుందే! పూర్వం విశ్వామిత్రసృష్టి అంటూ చెప్పకోవడం. అవి యివే అంటూ ఆకాశంమీంద యేవో కొన్ని నక్షత్రాలు కనపరచేవారు. భూమిమీంద ఆ విశ్వామిత్ర సృష్టిబాపతు పదార్థాలేవో వివరంగా తెలియదు. ఆవులకు గేదెలనిన్నీ, హింసకు పావురాలనిన్నీ పెద్దలు కొన్నిటిని చెపుతారు. మిరియాలకు మిరపకాయలు విశ్వామిత్ర సృష్టిగానే చెపుతారు. యిటీవలికాలంలో జరిగిన విశ్వామిత్రసృష్టి చాలావుంది. దానిలో కాళ్లనడక్కి బదులు సైకిళ్లనడక వగయిరాలు. వీట్లవల్ల యెన్నో వుపకారాలయితే లేకపోలేదుగాని గజానికీ అరగజానికీ కూడా దీనిమీదేగాని సొంతకాళ్లతో నడవడం యెఱంగనివాళ్లను చూస్తే యేమిటో యిబ్బందిగా కనపడుతుంది. దీనివల్ల కొన్ని వ్యాధులు పుడతాయంటారుగాని పుడితే పుట్టనివ్వండిగాని దీని వుపయోగం, అందులో వైదీకంలో తుట్టతుద జరిగే కర్మ చేయించేవారికి పట్నవాసాలలో వున్న వుపయోగం