పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/828

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
932
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
 


నేనెక్కడికీ వెళ్లలేకున్నా వచ్చేరాబడి యింట్లో వున్నావస్తూనే ఉంది. మీ దర్శనం నేనెప్పుడూ చేసుకోలేదు. లేకపోయినా మీరునన్ను ప్రేమించి మీ గ్రంథంలో నన్ను యిరికించి శాశ్వతుణ్ణిగా చేసినందుకు మిమ్ము అభినందిస్తూ వున్నాను. నా గ్రంథాలవల్ల నాకు పేరునిలుస్తుందో నిలవదోకాని మీ గ్రంథం వల్ల నేనుకృతార్థుఁడైనాను. వక సలహాయిస్తూవున్నాను, అంగీకరిస్తే అంగీకరించండి. లేదా తోసివేయండి. మీకున్నూ మాకున్నూ వివాదంవుంటే మఱియొకలాగు తీర్చుకోండి. మమ్మల్ని దానిలోకిదింపి రంజస్సు చేయడం ఆలోచనపనికాదు. యెన్నో విద్యావివాదాలు వచ్చాయి కానీ మీలాగు సాహసించిన వారింత వరకున్నట్లు నేనెఱుగను. మీ సాహసం వర్ణనీయం. నేను వృద్ధుడనేకాని గురువులకన్న నాలుగేండ్లు చిన్నవాణ్ణి. మీ కల్పన సమంజసమో కాదో ఆలోచించుకోండి. క్షమించండి.

★ ★ ★