పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/827

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది"

931


నిట్టితిట్లు వ్రాయవలసిన యవసరమేరికి కలుగుతుంది? వకవేళ నేనిచ్చిన ప్రత్యుత్తరం బాగులేదని తోస్తే బాగుగా లేదని స్వంత వ్రాల ప్రకటింపవచ్చునుగదా! యోగ్యులే అయితే అందులో తప్పేముండును? కాఁబట్టి యీపన్నుగడ సదరు విమర్శకులదియే. ముమ్మాటికిన్నీ విమర్శకులదియే. దీని గురించిన్నీ యీయన మళ్లా భారతిలో వ్రాసిన దానికిన్నీ వేరొకప్పుడు వ్రాస్తే వ్రాస్తాను. ప్రస్తుతం మనకు కావలసింది కొందఱు వాదోపవాదాలలో ప్రకృతాన్ని విడిచి తిట్టడంకూడా వుంటుందనేది. అట్టితిట్లకు నేను ఏవగించుకొనేది లేదనేదిన్నీ యింకోకర్మం, తాము యీలాగ స్వహస్త పరహస్తాలతో తిడుతూ ఎంతో జాగ్రత్తగా ప్రధాన విషయాన్నే వ్రాసేవాళ్లనుకూడా తమ్మును తిడుతువున్నారని వ్రాయడం వకటి. యివన్నీ నిష్ప్రయోజనాలు. లోకానికి విమర్శించే తెలివితేటలు లేకపోలేదు. తనకుకూడా నాకువచ్చినట్లే బహిరంగలేఖ వచ్చిందన్నంతలోనే లోకానికి తెలియదా? దానిలో గంధర్వలోకము అనే పదమెందుకు పడిందో ముందు తెలుపుతాను. ప్రస్తుతం నన్ను తిట్టించక నాకోసం మరొకరిని తిట్టించడం భావ్యంకాదనే నేను గురువులను ప్రార్థించేది. నాకేమి సంబంధమంటారా? సంబంధంవున్నట్టు మీ వ్యాసంలో వాక్యాలే చెపుతాయని మనవి చేసుకొంటాను. సేలువుల ప్రసంగంకన్న కావలసిందేమిటి? అభిప్రాయం యిచ్చినంతలో అనుమానానిక్కారణం వుండదు. యేమోఁ పుస్తకంచూచి యివ్వడం వుంటుంది. చూడక యివ్వడం వుంటుంది. చూచియిచ్చినా చూడకుండాయిచ్చినా బాగుందనేకదా? ఆ గ్రంథకర్తగారు నన్ను అభిప్రాయం అడగలేదుగాని అడిగితే నేనున్నూ యిచ్చేవాణ్ణేమో. మరికొందఱు ప్రముఖులిచ్చారా? లేదా? వారందఱూ సాంగంగా చూచేయిచ్చారనుకోఁగలమా? చూచేయిచ్చినట్లయితే, యిది దూషణాత్మక గ్రంథం : వారికీ వారికీ వుండే ద్వేషంమీఁద వ్రాసుకుంటే వ్రాసుకుంటారు మనకెందుకని వుపేక్షించేవారనే నేననుకుంటాను. అందులో వకరు బలవంతంమీద అంగీకరించినట్లు కొద్దిగా సూచించినారు. భవతు! దానికేమి? తుదకు గురువుగారున్నూ బాగానే వున్నారు. శిష్యుఁడుగారున్నూ బాగానే వున్నారు. “వీరిసెట్టి తిట్టులు తింటూ వున్నట్లుంది". “వూరిపిడుగు" సామెతకాక మరేమిటిది? గురువుగారే వెం|| శా|| కృతఘ్నుడనో కృతజ్ఞుడనో వకటి రెండుమాటలలో వ్రాస్తే తీరిపోయేది. వృథాగా కాలాలక్కాలాలు నింపుతూవున్నారు. అన్యాపదేశ కవిత్వాల కామోదమును చూపుతూవున్నారు. ప్రేరకత్వాన్ని కూడా సమర్ధించడానికి ఆధారాలు కనపడతాయి. పాపం పుణ్యం భగవంతుఁడి కెఱుక. ఇది యవసరమని నాకుతోచడం లేదు. కాబట్టి విన్నవించుకున్నాను. దివాంధ గ్రంథకర్తగారికి నామనవి యేమిటంటే? నాకు యింత అన్నోదకాలున్నాయి. యెవరేనాయేమేనాయిస్తే నా ఆత్మను వంచించి వారు పోట్లాడుమంటే నాకు సంబంధింపని వారితో పోట్లాడేదిలేదు.