పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/826

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

930

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తినివున్నాను. ఆ తిట్లు ప్రకటించుకోవడం కూడా నాకు అలవాటయిపోయింది. యీ మధ్య భారతిలో మా ప్రభావతీ ప్రద్యుమ్నాన్ని వకరు ఆక్షేపిస్తే తోఁచిన జవాబు వ్రాస్తూ అందు వక శిష్యుఁడి పద్యాన్నొకదాన్ని మచ్చుకు ఉదాహరించాను. దానిమీఁద “నీకుంటే నాకు మాత్రం శిష్యప్రశిష్యులు లేరా" అని తెల్పడానికో అన్నట్లు కొన్ని పద్యాలున్నూ మాలికలున్నూ నీచోక్తులతో నిండినవి వ్రాసి "ఆకాశరామన్న" అర్జీగా "గంధర్వలోకంబున నుండి" అని చేవ్రాలు చేసేచోట వకమాట వ్రాసి, గంధర్వలోకంలో పోస్టాఫీసు లేకపోవడంచేత కాఁబోలు పిఠాపురం పోష్టుద్వారా నాకు అందచేశారు. పోష్టుముద్రవల్ల తెలిసిందేకాని ఆసలాయన ఊరుగాని పేరుగాని అందుదాహరింపలేదు సుమండీ! ఆకరపత్రంలో నె 12 రు అని నాకు పంపిన దానిలో వ్రాశారు. ఇంతతో విరమిస్తే బాగానే వుండును. ఊరుకుంటే బాగుండదని మళ్లాయేవో నాలుగుమాటలు భారతిలో వాదాన్నిగుఱించి ప్రకటిస్తూ ఆమాటలలో యీ అక్షరాలు వ్రాశారాయన. "నాకు నెవ్వరో గంధర్వలోకంబున నుండి" యని పద్యములతో గూడిన 14వ నంబరుగల బహిరంగలేఖను పంపినారు. "పద్యములు కోపోద్రిక్తములై యుండుటచే వానిని శ్రీవారిరీతిగా మచ్చునకు జూపుటకైన మనస్సొప్పినదికాదు" అని. నాకువచ్చిన బహిరంగ లేఖ 12 నంబరు కలది. ఆయనకు వచ్చినది 14వ నంబరుకలది. అందులో నన్ను లెక్కకు మిక్కిలిగా దూషించడంవుంది. ఆయన్నికొంచం భూషించడంవుంది. ఆయన యీ మాటలు వ్రాసి ఆత్మవంచన చేసుకోఁగలిగినంతలో లోకం ఆలేఖతో తమకేమిన్నీ సంబంధం లేదని లోలోపల భావిస్తుందని భావించి వున్నారు. ఆయనకు మనస్సొప్పలేదుగాని నాకు మనస్సు వప్పుతోంది కనక దాన్ని నేనిందు కొంచెం ప్రకటిస్తాను.

వకబహిరంగలేఖ

“................................................. కింకవీంద్రుడా? ఉ. కాటికి కాళ్లు చాచుకొని............ యేటికి నీదు పాండితి? మరేటికినీదు కవిత్వధాటి? నా; మాటలు వించునీపయిని మానుము, వోలెటివాఁ డసాధ్యుఁడు...... యశంబునేల కరాబొనరించుకొనఁగ నట్లు కొట్లాటలనాడి నోట గెలుపొందెడిరోజులు వెళ్లిపోయెం.......... కూయుచున్న వినుమోయి?... పండితాళి చీవాటుల పెట్టరయ్య! తలవాచెడిలాగున..... పండితవర్యులెల్ల “ఛీ! ఛీ!" యని నిందల సేయఁగ..... నామతంబు గ్రహించి వేగమె క్షమార్పణ గోరుము. క. వెగటుగదా? చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి !" -

ఇత్యాదులు. ఆయన ప్రకటింపక మానినానని బొంకినారు. తాను తనకు తోఁచినరీతిని మాపొత్తమును విమర్శిస్తే తోఁచినరీతిని జవాబు వ్రాసిన దానిమీఁద లోకంలో