పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/825

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“ఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది"

929


చేసుకుంటాను. అన్యాపదేశంగా వున్నదాన్ని ఆ నెత్తిని బెట్టుకోనక్కఱలేదు. వాచ్యవృత్తిగానే వున్నదాన్ని చూపుతాను. యేమైనా యెవరో మాగురువుల సమ్మతిమీఁదనో, లేక వారిపరోక్షాన్నో ఆ పుస్తకం వ్రాస్తే వ్రాయవచ్చును గాక! అభిప్రాయ ప్రదాతలు ఆత్మవిద్యా గౌరవాన్ని కొంత చూచుకోవలసి వుంటుందని నేననుకొన్నాను! యీ మా పని తప్పనితోస్తే వారొకకార్డులో నాకు వారుసూచించి నప్పటికీ నా "క్షమాపణ" ను నేను వారికి వెంటనే అందచేసుకోఁదలఁచినాను. వారిలో వకరిద్దఱిదర్శనం నేను చేసుకొనివున్నాను. కాని తక్కినవారి దర్శనం చేసికొన్నట్లు జ్ఞప్తిలేదు. యేమైనను పదవులనుబట్టిగాని విద్యనుబట్టిగాని వారునాకు పరమపూజ్యులు. అట్టివారు కనుకనే అంతోయింతో నా విషయమగు అధఃకృతి కొంత వాచ్యంగానున్నూ కొంత గూఢంగానున్నూ వున్నదానిపై అట్టి సదభిప్రాయాన్ని యివ్వడాన్ని గుఱించి చర్చించుకోవలసిన వాఁడనైనాను. అయితే "గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు సవరించుకోవడం” వంటిదేమో యీవూహ? కానివ్వండి! వారున్నూకవులు గదా! వారి కాలాగే తోస్తే నేను దాన్నే విశ్వసించి "ముదిమది తప్పితే మూడుగుణాలు” అనే సామెతనుస్మరించి నాతప్పును నేను సవరించుకుంటానని కూడా మనవి చేసుకున్నాను గదా? యింతకూ ఆ కవిగారు ఆ గ్రంథం వ్రాయడం నన్నధఃకరించడానికిన్నీ కాదు, మాగురువులను పురస్కరించడానికిన్నీ కాదు. ఆయనకు ఆ వూళ్ళోవుండే వక ప్రబలశత్రు వనుకొనే వ్యక్తిని కసితీరా తిట్టడానికి ప్రారంభించినట్లే దానికి సందర్భించిన యితర విషయములు తెలియనివాళ్లకి కూడా స్పష్టమేకాని ఆయన ఆ పనిచేసుకొని వూరుకుంటే బాగుండేది! మా యిద్దఱినిన్నీ దీనిలో యెత్తుకోవడంతో అవసరమే లేదు! లోకంలో యెందఱెందఱు పరస్పరద్వేషాలతో తిట్టుకోరు? వారందఱూ మా గురుశిష్యుల జోలి తలపెడుతూవున్నారా? లేదు. కాబట్టి ఆకవి గారికి మాయిద్దఱిలో యెవరిదో గట్టిప్రోత్సాహం వుండితీరాలిఁ యీ అంశం ఆయన గ్రంథాన్ని దగ్గిఱపెట్టుకొని మామా వ్యాసాలల్లో వున్న కొన్ని వాక్యాలను పైకితీసివిచారిస్తే బట్టబయలవుతుంది. కాఁబట్టి చదువరులను అలా చేయవలసిందని ప్రార్థిస్తూ విరమిస్తూవున్నాను. విరమిస్తూ గురువుగారితో రెండుమాటలు మనవి చేసుకుంటాను. అయ్యా! మనకు వొరుల సాహాయ్య మెందుకు? యేదేనా సత్యనిర్ధారణకు సాక్ష్యం కావలిస్తే ప్రత్యక్షంగానే చెప్పేవారు చెపుతారుగదా! అన్యాపదేశగ్రంథా లెందుకూ? కసితీరా యెవరినో తిట్టడానికి కింతకన్న వుపాయం లేదంటారా? యిదివఱలో నేలాగైనా మీరేమి! నేనేమి? డెబ్బైయెనభై పడులలో నున్నాంగదా? యిదిన్నీ కాక తమరు నా విషయంలో యెంతతిట్టులనేనా వాచ్యంగానే వ్రాస్తూవున్నారుగదా? అంతతో తృప్తితీరింది కాదా? అయితే దానిలో నీకేమి తిట్లున్నాయంటారా? అట్లావుంటే నేను దానికియింత నొచ్చుకొనేదే లేదు. నేను యెన్నోతిట్లు