పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/824

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

928

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కల్పించినట్లు గురువులు వ్రాయడం చాలా ఆశ్చర్యకరంగావుంది! ఫోనీ వారిచిత్తానికి అలాతోఁచింది వ్రాశారుసరే? పాపం యెవరో వక యువకవిగారు వకపుస్తకం వ్రాశారు! అచ్చొత్తించారు! ఆయువకవిగారికిన్నీ మాగురువుల యేకలవ్యశిష్యునికిన్నీ మైత్రి వుండి, ఆ శిష్యుని ప్రతికక్షిదారునియందు ప్రబలశత్రుత్వం వుండి, అది వ్రాయవలసి వచ్చినట్లు బాలునికి కూడా దానివల్ల తేలుతుంది. ఆ పుస్తకాన్ని ఆయువకవిగారు కొంతసమ్మానాన్ని చూపేమాటలు స్వదస్తూరీతో వ్రాసి నాకు పంపారు! అభిప్రాయం అంతకు పూర్వం నాతలమీఁది వారంతా యిచ్చివుండడంచేతో నన్ను కూడా దూషించడంచేతో లేక మఱేకారణంచేతో నన్ను అభిప్రాయ మిమ్మనిమాత్రం వారు కోరలేదు గాఁబట్టి నేను వారికి అభిప్రాయంపంపలేదు. అభిప్రాయం కోరకుండా నావద్దకు వట్టిపుస్తకం మాత్రమే నమస్కారాలతో నా జీవితకాలంలో యితరకవులచే పంపఁబడ్డది యిది మాత్రమే! అందు మొట్టమొదటం వకగీతపద్యంలో మా గురుశిష్యులిద్దఱికీ వకనమస్కారబాణం వేయఁబడి వుంది. నిజానికాపద్యం నమస్కారార్థం పుట్టిందిమాత్రం కాదని నా అంతరాత్మకు తోఁచింది. యిఁక యెందుకుపుట్టినట్లు తోఁచిందంటే? యిందులో వున్న చరిత్ర వీరిద్దఱికిన్నీ సంబంధించిందని లోకులకు సుళువుగా తెలపడానికి కవిగారు యా వుపాయం పెట్టుకున్నట్లు నాకు త్రికరణశుద్ధిగా తోఁచింది. అందు నాకంటె గురువులనుకొంత గొప్పచేశారు కవిగారు. అది న్యాయమే. గురువు శిష్యునికన్న గొప్పగా వుండడమే యుక్తంగదా! గురువుగారు అభిప్రాయం యిచ్చేవున్నారు కనక యిఁక శిష్యుఁడి అభిప్రాయం అంతకంటె వేఱుగావుందని అనుకొనికాఁబోలు నన్ను అభిప్రాయం మాత్రం వారుకోరలేదు. కోరకపోవడానికి యిదేకారణమైతే అది సరియైనదికాదు. నేను ఆ పుస్తక విషయంలో గురువులతోనే కాదు యింకా యిచ్చిన మహామహులతోకూడా లేశమున్నూ యేకీభవింపఁజాలను. అలా యేకీభవించేయెడల నా అంతరాత్మ నన్నుపీడిస్తుంది కాఁబట్టి యిట్లా వ్రాయడమైనది. నీయభిప్రాయం యెట్టిది? అని నన్నిప్పుడు గ్రంథకర్తగారు, ప్రశ్నించరు! ప్రశ్నిస్తే విపులంగా వ్రాస్తాను. గురువుగారొక్కరు తప్ప తక్కినవారు ప్రమాదపడిగాని ఆశ్రయింపువలన మోమోట పడిగాని అట్టి సదభిప్రాయం యిచ్చారని నేననుకుంటాను. అంతకంటె వారి విషయంలో నాలేఖిని అన్యథాగా వ్రాయనివ్వడంలేదు యేమంటే? వారి వారికి గురువులకుంబలె నాయందు ద్వేషము లేశమున్నూ లేదని నా అంతరాత్మద్వారా నాకు తెలుసును. అగుచో విశేషించి కాకున్నను యే కొంచెమో నన్ను కూడ అధఃకరించడానికి పుట్టినట్టి పొత్తముమీఁద సదభిప్రాయాన్ని బుద్ధిపూర్వకంగా యిస్తారని నేనేలా అనుకోఁగలను? ఆ పుస్తకంలో నీకేమి అధఃకరణమున్నదని అభిప్రాయ ప్రదాతలే అడుగుతారనుకొందాం! దానికి జవాబేమిటంటారా? పనిపడితే మనవి