పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అవధానంనాఁటికి యింకా యీ విషయం లోకానికి అంతమఱుపు తగలలేదు. యెవరో అడిగారు యీ పద్యం చెప్పాము. శా. "ధారాపాతము లేక సస్యవితతుల్తప్తమ్మ లయ్యెన్ గడున్ జేరెన్ సర్వజనంబు నీపురమునే జీవింప, వా రెల్లరన్ శ్రీరామేశఘనుండు ప్రోచి మును దా శ్రీవృష్టి నాక్షామముం బాలందోలెను దానిఁ గోర మరలన్ బాగెట్లగున్ దెల్పుమా?” యీయన చేసిన యీవుత్తమ కార్యానికి గవర్నమెంటువారు కూడా చాలా ఆశ్చర్యపడ్డట్టు వినికిడి. అప్పటి శ్రీ పిఠాపురం రాజాగారు యేదో గవర్నరు సభకు వెళ్లినప్పుడు కాకినాడ ప్రశంసవచ్చి గవర్నరుగారు- “ఓహో! బచ్చురామేశం వున్న వూరు కాదా?" అనేటప్పటికి రాజాగారికి అవమానంగా కనపడి-“రామేశం మాయెస్టేటు గ్రామాలలో వక వూల్లో వక వీథిలో వక వైపునవుండే వక గృహస్టు" అని జవాబు చెప్పినట్టు చెప్పుకోవడం. యీ రాజాగారేమో నాఁటిరోజుల్లో దానకర్ణుండని ప్రసిద్ధివహించి కోట్లకొలంది ధనమున్నూ పుట్లకొలందిభూమిన్నీ సద్వినియోగంచేసిన మహావ్యక్తి. రామేశంగారి కీర్తి యీ మహావ్యక్తి కీర్తినికూడా మఱపించింది. కారణం ఆలోచిస్తే యిది మటీ అవసరమెటింగిచేసిన దానం కావడమే. ప్రస్తుతకాలంలో కోట్లకొలంది వెచ్చిస్తూవున్న ధనదాతలు వున్నప్పటికీ యిట్టి యుక్తవ్యయం చేసేదాతలు మిక్కిలీ మృగ్యమవడంకూడా యీతిబాధలకిందికే వస్తుంది. మునుపు మార్గసులకు; అందులో ముఖ్యంగా కాశీ రామేశ్వరాలు వెళ్లే యాత్రీకులకు సత్రాలంటూ వుండేవి. రైళ్లమూలాన్ని అవి వెనకబట్టాయి. అక్కడక్కడ యింకా కొన్నయితే మిక్కిలీ స్వల్పంగా శేషించి వున్నాయి. కాని అవి దాతల వుద్దేశాన్ని నెఱవేర్చక అన్యథాగా నడుస్తూవుండడంచేత యిప్పడు కొత్తగా యెవరేనా ధనాధ్యులు లోకోపకారార్థం అలాటి ధర్మాలు చేయడానికి వెనుకందీస్తూ వున్నారు. దాతలవుద్దేశానికి పూర్తిగా అన్యథాగా ప్రవర్తించే యజమానులు ధర్మ సంస్థలకు దాపరించడముకూడా యీతిబాధలోనే చేరుతుంది. వక గ్రామములో దేవాలయాదాయము లోన్నుంచి వేదశాస్త్ర పాఠశాల నడిపిస్తూ వుండేవారు. యిటీవల దానియాజమాన్యం వోట్లలెక్కనుబట్టి బ్రాహ్మణేతరులమీందకి వచ్చింది. ఆయన అధ్యాపకుణ్ణి, బ్రాహ్మణేతరుల క్కూడా వేదం చెప్పవలసిందని శాసించారు. అధ్యాపకుండు, ఛాందసుండు చెప్పనన్నాండు. దానిమీంద ఆ యజమాని అసలు వేదానికే సున్నచుట్టినట్టు యీ మధ్యనే విన్నాను. అసలు ధనదాతవద్దేశమేమో తప్పో? వొప్పో? శాస్త్రీయమైన కార్యాలకు వినియోగించడమే కాని అన్యంకాదు. తుదకి మధ్యవచ్చిన యజమానులవల్ల ఆ వుద్దేశం మాటి యేలా \