పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/819

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

923


       యీ కరణి డీకొనిన నింక మీకు నేమి
       చెప్ప నెవ్వరు వలతులు చిత్తగింపు
       వినుతగుణధుర్య గురువర్య? వేంకటార్య? - 3

తే.గీ. గడుసుఁదనమొప్పఁగా ధ్వనిగర్భితంబు
       గాఁగఁ బటుపరిభాషణ కాండములను
       విసరగల మీవిచిత్ర ధన్విత్వమునకు
       చెలఁగియొకవృద్ధగురుగుఱిఁజేయఁజనునె?
       సరసహితచర్య? వేంకట శాస్త్రివర్య. - 4

అ.వె. ప్రాయమెల్ల యుద్ధపర్వధూర్వహమయ్యె
       డాకసాగె విజయఢక్క మ్రోఁగె
       చాలునింక బుద్ది శాంతిపర్వమునకు
       మల్పవయ్య పొల్పునిల్పవయ్య ! - 5

తే.గీ. మొనసి 'యాడినదాట' పాడినదిపాట
       యై యశోజ్యోత్స్న లెందు నభ్యర్హి తముగ
       నడచె మీచరితంబు లీనాఁటనకట?
       బహుళ దశ మీస్థదశనేఁటి పగలుమీకు. - 6

తే.గీ. వంగిపోయిన ముదుసలి "గంగిరెడ్ల
       యాట" వలెనిప్డు మీదుపోరాట నవ్వుఁ
       బాటు పాలౌట కాకేటిపాటు కెక్కు
       మేటులార ! విద్యాధనపేటులారా ! - 7

తే.గీ. రేఁగెనఁట? యతఁ, డీవాదిరేపితంట
       యెందులకు? నీకిటు నిరాపనిందకృష్ణ?
       ఉడుగఁగదె? యిఁక గురుతకీడ్వదగఁబోదు
       ఘనవివేకివి వినవె నామనవిసుకవి. - 8

క. సచ్చీలురకుండునె? పు
    త్రచ్ఛాత్రులయందు "భేదత త్త్వము" పుత్రా
    దిచ్ఛేత్పరాజయ" మ్మను
    స్వచ్చోక్తినివినవె? కృష్ణశాస్త్రివరేణ్యా - 2